మారుతీ సుజుకి నెక్స్ట్ జనరేషన్ బ్రెజ్జా: ఈ స్మార్ట్ ఫీచర్లు మిమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటాయి.. !
నెక్స్ట్ జనరేషన్ 2022 మారుతి సుజుకి(maruti suzuki) బ్రెజ్జా గురించి ఈ రోజుల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (brezza)చాలా సంవత్సరాలుగా దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఎస్‌యూవి. మారుతి సుజుకి బ్రెజ్జా 2016లో ప్రారంభించినప్పటి నుండి సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవి.
అయితే కాలక్రమేనంగా బ్రెజ్జా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్, ఇంజిన్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు బ్రెజ్జా డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే వచ్చేది, కానీ 2020 లో పెట్రోల్ ఇంజిన్‌తో ప్రారంభించింది. ఇప్పుడు 2022కి ఒక నెల మిగిలి ఉంది అయితే వచ్చే ఏడాది విటారా బ్రెజ్జా కొత్త లుక్ అండ్ ఫీచర్లతో కస్టమర్లకు అందించబోతోంది. ఈసారి మారుతి కొత్త బ్రెజ్జాలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసింది. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ ఎదుర్కొంటున్న సవాలును దృష్టిలో ఉంచుకుని నెక్స్ట్ జనరేషన్ బ్రెజ్జాలో ఎన్నో కొత్త ఫీచర్లు చేర్చింది. 2022 మారుతి సుజుకి విటారా బ్రెజాలో కొత్త ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం...
సన్ రూఫ్
కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కస్టమర్‌లకు సన్‌రూఫ్ ఫీచర్ ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో సన్‌రూఫ్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి. కస్టమర్లలో బాగా పాపులర్ అయిన ఈ సెగ్మెంట్‌లోని అన్ని వాహనాల్లో సన్‌రూఫ్ ఫీచర్ వస్తోంది. సన్ రూఫ్ తో బ్రెజ్జా మారుతి కంపెనీ మొదటి కారు అవుతుంది, దీనిలో ఫ్యాక్టరీ అమర్చిన సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
బిగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
కొత్త బ్రెజ్జా లీకైన ఫోటోలలో కంపెనీ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం మారుతి బ్రెజ్జా ZXI, ZXI ప్లస్ వేరియంట్‌లలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తోంది, అలాగే ఆండ్రాయిడ్ ఆటోతో పాటు వాయిస్ కమాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది.
వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
రాబోయే బ్రెజ్జా ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లే స్పోర్ట్‌తో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. అలాగే వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ను వైర్‌లెస్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయగలుగుతారు. ఈ ఫీచర్‌ని బ్రెజ్జా ప్రీమియం వేరియంట్‌లో అందించవచ్చు.
కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్
కంపెనీ కొత్త బ్రెజ్జాలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించగలదు. దీనిని బ్రెజ్జా ప్రీమియం వేరియంట్‌లలో ఇవ్వవచ్చు. అంతేకాకుండా కంపెనీ బ్రెజ్జాలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందించవచ్చు. ఈ రోజుల్లో ఈ విభాగంలోని అన్ని వాహనాల ప్రీమియం సెగ్మెంట్లో ఈ ఫీచర్ లభిస్తుంది.
కారు కనెక్ట్ టెక్నాలజి
కొత్త బ్రెజ్జాలో కస్టమర్‌లు అధునాతన కనెక్టింగ్ కార్ టెక్నాలజీ ఫీచర్‌ను పొందవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు స్మార్ట్‌ఫోన్ ద్వారా కారును రిమోట్‌గా స్టార్ట్ చేయడం లేదా ఆఫ్ చేయడం మాత్రమే కాకుండా హెడ్‌ల్యాంప్‌లు, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ నుండి యాక్సెస్ చేయగలుగుతారు.
360 డిగ్రీ కెమెరా
కొత్త బ్రెజ్జాలో కంపెనీ 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌ను అందించవచ్చు, తద్వారా డ్రైవర్ కారులోని ప్రతి మూలను రియల్-టైమ్ వ్యూ చూడగలరు. 360 డిగ్రీల వ్యూ కెమెరా ఫీచర్ మహీంద్రా XUV300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్‌లలో ఉంది. అయితే ఈ ఫీచర్ ఈ వాహనాల టాప్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
పెడల్ షిఫ్టర్లు
ఈ ఫీచర్ నేటి కాలంలో చాలా ఉపయోగకరమైన ఫీచర్. అయితే, ఈ ఫీచర్ కార్లలోని ఆటోమేటిక్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా ఈ ఫీచర్‌లో మిగిలిన వాహనాల కంటే వెనుకబడి ఉంది. అయితే ఈ లోటును కంపెనీ ఈసారి భర్తీ చేయగలదు. ప్రస్తుతం, ఈ ఫీచర్ Kia Sonet SUVలో మాత్రమే అందించబడుతోంది.
లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ
కొత్త బ్రెజ్జాలో 12V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ స్థానంలో 48V హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఫీచర్ ప్రయోజనం ఏమిటంటే కొత్త బ్రెజ్జా పాత మోడల్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. కొత్త మోడల్‌ను 4-సిలిండర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించవచ్చు, అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఎంపికతో అందించబడుతుంది.