MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • అద్భుతం: విడిభాగాలను ఉపయోగించి వాహనం తయారీ.. అభినందిస్తు బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..

అద్భుతం: విడిభాగాలను ఉపయోగించి వాహనం తయారీ.. అభినందిస్తు బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(anand mahindra) ఒకరి విజయాలు లేదా కృషిని గుర్తించి మెచ్చుకునే విషయంలో ఉదారమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సార్లు అతను ప్రజలకు ప్రశంసల చిహ్నంగా మహీంద్రా కార్లను అందించాడు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి స్క్రాప్ మెటల్‌ని ఉపయోగించి నాలుగు చక్రాల వాహనాన్ని నిర్మించాడు. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Dec 23 2021, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అయితే ఈ ప్రత్యేకమైన వాహనానం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రకారం దత్తాత్రయ లోహర్ అనే వ్యక్తి తన కుమారుడి కోరికను నెరవేర్చడానికి లోక జ్ఞానం తక్కువ ఉన్నప్పటికీ ఈ వాహనాన్ని నిర్మించగలిగాడు. ఈ వినూత్న వాహన సృష్టి ఆనంద్ మహీంద్రాను ఎంతో ఆకట్టుకుంది. దీంతో అతను తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. అలాగే ఈ వీడియోను షేర్ చేస్తూ "ఇది స్పష్టంగా ఏ నిబంధనలకు అనుగుణంగా లేదు, కానీ మన ప్రజల తెలివి, సామర్థ్యాలను మెచ్చుకోవడం నేను ఎప్పటికీ కోల్పోను" అని అన్నారు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

45 సెకన్ల గల ఈ వీడియోలో మహారాష్ట్రలోని దేవ్‌రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రయ లోహర్ అనే కమ్మరి(black smith) వాహనం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. కేవలం  రూ.60,000 పెట్టుబడితో ఈ వాహనం తయారు చేశాడు. అలాగే ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలకు మాత్రమే కనిపించే కిక్-స్టార్ట్ మెకానిజంను ఉపయోగిస్తుంది. ఇంకా పాత అలాగే వదిలివేసిన కారు భాగాలను ఉపయోగించి ఈ కారును నిర్మించారు దీనికి ఎడమ చేతి డ్రైవ్ ఉంటుంది.

మరో ట్వీట్‌లో వాహనం నిబంధనలకు అనుగుణంగా లేనందున స్థానిక అధికారులు దానిని రోడ్లపై తిరగకుండా నిలిపివేయవచ్చు అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అతని వినూత్న సృష్టికి  బహుమతిగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ వ్యక్తిగతంగా అతని బొలెరోను ఆఫర్ చేశారు. అలాగే అతని సృష్టి ఇతరులకు ప్రేరణగా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శించబడుతుంది.

33

అతను  "నిబంధనలను ఉల్లంఘించినందున స్థానిక అధికారులు అతనిని వాహనాన్ని త్వరలోనే లేదా భవిష్యత్తులో నడపకుండా ఆపివేయవచ్చు. అతని వాహనానికి బదులుగా నేను వ్యక్తిగతంగా బొలెరోను ఆఫర్  చేస్తున్నాను. అతని సృష్టిని మహీంద్రా రీసెర్చ్‌వ్యాలీలో ప్రదర్శించబడుతుంది, ఎందుకంటే 'రిసోర్స్ ఫుల్ నెస్' అంటే తక్కువ వనరులతో ఎక్కువ చేయడం."

లోహర్  వినూత్న సృష్టికి  ప్రశంసలు కురిపించడంతో పాటు అతని వీడియో ట్విట్టర్ లో ఎంతో  వైరల్ అయ్యింది. ఆనంద్ మహీంద్రాచేసిన ట్వీట్‌కు 14,000 పైగా లైక్‌లు, 1300 రీట్వీట్‌లు, టన్నుల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి. స్మార్ట్ ఆవిష్కరణలు తరచుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ దృష్టిని ఆకర్షిస్తుంటాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Recommended image2
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. భారత్‌లో అత్యంత చౌకైన 5 CNG కార్లు ఇవే
Recommended image3
Driving Tips: వేస‌విలో బ్రేక్ ఫెయిల్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయా.? కార‌ణం ఏంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved