బ్యాంక్ లోన్ పై పండగకి కొత్త కారు కొంటున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
ఎవరైనా కొత్త కారు కొనే ముందు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇంకా మైలేజ్ కార్ల గురించి పరిశోధన చేస్తుంటారు. వాటి గురించి పూర్తిగా పరిశోధన చేసిన తర్వాతే కారు కొనేందుకు సిద్దమవుతారు. ఒకోసారి బడ్జెట్ కారణంగా ప్రజలు కారు కొనుగోలు చేసేందుకు రుణం(loan)పై ఆధారపడుతుంటారు. ఈ పండుగ సీజన్()loan season) లో మీరు కూడా రుణంపై కారు కొంటున్నట్లయితే ఈ కొన్ని విషయాల గురించి తెలుసుకోండి...
రుణంపై కారు కొనే ముందు మీకు మంచి, బడ్జెట్ డీల్ ఉండేలా చూసుకోండి. మీరు కారు రుణదాత అంటే లోన్ ఇచ్చే బ్యాంక్ తో మంచి సంబంధం ఉన్న డీలర్ నుండి కారును కొనుగోలు చేయవచ్చు దీనివల్ల మీకు మంచి ఫైనాన్షియల్ డీల్ అందించవచ్చు. కారు రుణం తీసుకునే ముందు మీరు దాని ఖచ్చితమైన ఖర్చు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, వడ్డీ రకం మొదలైన ఛార్జీల గురించి పరిశోధించాలి తెలుసుకోవాలి. అంతేకాకుండా మీ కారు రుణంపై మీరు చెల్లించాల్సిన వడ్డీ రేటును కూడా తనిఖీ చేయండి. అప్పుడు మాత్రమే కారు రుణం తీసుకోండి.
మీరు మీ పర్సనల్ లేదా సేవింగ్స్ అక్కౌంట్ బ్యాంక్ నుండి కూడా కారు రుణం తీసుకోవచ్చు. చాలా వరకు బ్యాంకులు (banks) వారి ప్రస్తుత కస్టమర్‌లకు కారు రుణంతో ఎన్నో ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. బ్యాంకులు తరచుగా వారి ఖాతాదారులకు డాక్యుమెంటేషన్ లేకుండా ఇంకా గొప్ప వడ్డీ రేట్లతో కారు రుణాలను అందిస్తాయి.
కారు రుణం తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోండీ. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్(credit score) ని బెస్ట్ స్కోర్ గా పరిగణిస్తారు. అంతేకాదు మీ క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే మీరు లోన్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని పొందుతారు. ఈ రుణంపై మీరు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. ఇంకా కారు రుణంపై ఈఎంఐ సంబంధించిన విషయాలను కూడా అడిగి తెలుసుకోండి.