కొత్త టాటా పంచ్ ఎస్‌యూవి కారు ఎంత వరకు సురక్షితం.. సేఫ్టీ రేటింగ్ లీక్..
దేశీయ ఆటోమోబైల్ దిగ్గజం, కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ నెల ప్రారంభంలో మైక్రో ఎస్‌యువి టాటా పంచ్‌ను ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. అయితే పంచ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ ఎస్‌యూవి పై తాజాగా రివ్యూలు మొదలయ్యాయి.
అధికారిక బుకింగ్ ప్రారంభమైనప్పటికీ సేఫ్టీ రేటింగ్‌లు, ధరలను లాంచ్ చేసిన తర్వాత మాత్రమే ప్రకటిస్తామని కంపెనీ చెబుతోంది. కానీ సేఫ్టీ రేటింగ్‌లు లాంచ్ ముందు వెల్లడయ్యాయి. ఈ లీక్ టాటా వెబ్‌సైట్‌లోనే జరిగింది. పంచ్ సేఫ్టీ రేటింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ అక్టోబర్ 20 నుండి అమ్మకానికి రాబోతోంది అయితే అంచనా ప్రకారం ఎక్స్-షోరూమ్ ధరలను రూ .5.5 లక్షల నుండి రూ .8 లక్షల వరకు ఉంచవచ్చు.
పంచ్ సేఫ్టీ రేటింగ్‌లు
2020 ఆటో ఎక్స్‌పోలో టాటా దీనిని హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్‌గా విడుదల చేసింది. అప్పటి నుండి టాటా సేఫ్టీ రేటింగ్‌లను అందుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. టాటా వెబ్‌సైట్‌లో టాటా పంచ్ బుకింగ్ సమయంలో లీకైన ఫోటోలో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో పంచ్‌కు 5-స్టార్ రేటింగ్ లభించిందని వెల్లడించింది. టాటా మోటార్స్ ఈ లోపాన్ని పరిష్కరించి సేఫ్టీ రేటింగ్‌ను తీసివేసినప్పటికీ దీనిపై వార్తలు వ్యాపించాయి అలాగే సేఫ్టీ రేటింగ్‌ల స్క్రీన్‌షాట్‌లు బయటికి వచ్చాయి, దీనిలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఇబిడి కూడా ఉన్నట్లు నివేదించింది.
ఇంజన్ అండ్ సైజ్
టాటా పంచ్ టాటా నెక్సాన్ కంటే చిన్నగా ఉంటుంది, కానీ టియాగో నెక్సాన్ పైన ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ కోసం 21 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎస్‌యూవి లో టియాగో ఇంకా ఆల్ట్రోజ్‌లో కనిపించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. 86 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ ఏఎంటితో వస్తుంది. మహీంద్రా కేయూవి NXT, మారుతి సుజుకి ఇగ్నిస్‌తో పాటు ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవి నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్‌లతో టాటా పంచ్ పోటీపడుతుంది. ఈ మైక్రో ఎస్‌యూవిలో 366 లీటర్ల బూట్ స్పేస్, 3827 ఎంఎం పొడవు, 1742 ఎంఎం వెడల్పు, 1615 ఎంఎం ఎత్తు, 2445 ఎంఎం పొడవు గల వీల్‌బేస్ అందిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 190 ఎంఎం. ఇంకా లైట్ ఆఫ్రోడింగ్ కోసం ట్రాక్షన్ ప్రో మోడ్ ఫీచర్‌ను పొందుతుంది.
గొప్ప లక్షణాలు
టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, 15-అంగుళాల విల్స్, డ్యూయల్ డ్రైవ్ మోడ్, ఇంజిన్-స్టార్ట్ స్టాప్, 90-డిగ్రీ ఓపెనింగ్ డోర్స్ పొందుతుంది. ఈ వేరియంట్ డోర్స్ బూడిద రంగు ఆప్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దీని తరువాత, అడ్వెంచర్ వేరియంట్ గురించి మాట్లాడితే ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ 4-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ముందు ఇంకా వెనుక పవర్ విండోస్, సెంట్రల్ రిమోట్ లాకింగ్ సిస్టమ్ పొందుతుంది.
మూడవ వేరియంట్ లో 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రియర్ వ్యూ కెమెరా, వాయిస్ రికగ్నిషన్, పాసివ్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, సిక్స్-వే హైట్ అడ్జస్ట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందుతుంది.
నాల్గవ వేరియంట్ లో క్రియేటివ్ రెడ్, బ్లూ అండ్ డ్యూయల్ టోన్ కలర్ థీమ్‌లలో ప్రవేశపెట్టరు. ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎంలు, ఆటో టెంపరేచర్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్, గేర్ నాబ్, ఐఆర్‌ఏ కనెక్ట్ టెక్నాలజీని అందించింది.