లగ్జరీ ఎస్‌యువి విభాగంలో హీట్ పెంచుతున్న ఆడి క్యూ 5.. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్..
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి కొత్త మోడల్ 2021 ఆడి క్యూ 5 (2021 audi Q5) ఎస్‌యూవీ నవంబర్‌లో విడుదల చేయనుంది. ప్రస్తుతం భారతదేశంలో కొత్త ఆడి క్యూ 5 బుకింగ్ ప్రారంభించింది. ఈ కస్టమైజేడ్ ఆడి క్యూ 5 స్పోర్టి ఫీచర్లను గొప్ప డైలీ యుటిలిటీ కంబైయిన్ చేస్తుంది ఇంకా వివిధ రకాల ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ సపోర్ట్ ఆప్షన్‌లతో వస్తుంది.
ఆడి క్యూ5 ఎల్లప్పుడూ సైజ్, పర్ఫర్మెంస్, ఎక్విప్మెంట్ కలయికలకు ప్రసిద్ధి చెందింది. అత్యంత విజయవంతమైన ఈ మోడల్ అద్భుతమైన ఎక్స్టీరియర్ డిజైన్ క్యూ గుర్తింపును నొక్కి చెబుతుంది, క్వాట్రో DNAని ప్రతిబింబిస్తుంది. ఆడి క్యూ5ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు దీనిని రూ.2 లక్షలతో బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, "ఈ రోజు నుండి మేము ఆడి క్యూ5 బుకింగ్‌లను ప్రారంభిస్తున్నాము. భారతదేశంలో ఆడి క్యూ5 అనేది ఆడి విజయవంతమైన క్యూ ఫ్యామిలిలో మరొక బలమైన వాహనం. 2021లో లాంచ్ అవుతున్న మా 9వ ఉత్పత్తి ఆడి క్యూ5. కొత్త ఆడి క్యూ5 దాని విభాగంలో ఫీచర్లు, సౌకర్యం, ప్రాక్టికాలిటీకి పర్ఫెక్ట్ సమ్మేళనం. దీని ఆకర్షణీయమైన కొత్త డిజైన్ అత్యుత్తమమైనది అని మాకు నమ్మకం ఉంది. అలాగే ఇప్పటికే ఉన్న మా ఆడి కస్టమర్లతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుంది. " అని అన్నారు.
స్లిమ్ డిజైన్ తో వస్తున్న కొత్త ఆడి క్యూ 5 క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతుంది. గొప్ప డైనమిక్స్‌తో పాటు దాని సెగ్మెంట్‌లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని తెస్తుంది. ఆడి క్యూ5 ఫీచర్లలో 48.26 cm (R19)5 డబుల్-స్పోక్ స్టార్ స్టైల్ అల్లాయ్ వీల్స్, ఆడి పార్క్ అసిస్ట్, కంఫర్ట్ కీస్ అలాగే సెన్సార్ కంట్రోల్డ్ బూట్ లిడ్ ఆపరేషన్, ఆడి ఎక్స్‌క్లూజివ్ పియానో బ్లాక్ రిజిస్ట్రీ, ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, B&O ప్రీమియం 3D సౌండ్ సిస్టమ్‌లు ఉన్నాయి.
ఆడి క్యూ5 కూడా ఫోర్ వీల్స్ పై డ్యాంపింగ్ కంట్రోల్ సస్పెన్షన్ పొందుతుంది. దీని శక్తివంతమైన 2.0L TFSI ఇంజిన్‌తో, ఆడి క్యూ5 ఆకట్టుకునే ఆక్సీలరేషన్, సామర్థ్యాన్ని అందిస్తుంది. క్వాట్రో ఆల్-డ్రైవ్ అన్ని రకాల డ్రైవింగ్ అనుభవాల కోసం అసాధారణమైన ట్రాక్షన్, డైరెక్షనల్ స్టెబిలిటీని అందిస్తుంది.
ఆడి క్వాట్రో ఫీచర్లు
40 సంవత్సరాలుగా రెగ్యులర్ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ ఆడి ప్రధాన టెక్నాలజిలలో ఒకటి. అద్భుతమైన ట్రాక్షన్, ఉన్నతమైన డ్రైవింగ్ భద్రత, అధిక డ్రైవింగ్ డైనమిక్స్ ఆడి రెగ్యులర్ ఆల్-వీల్ డ్రైవ్ ముఖ్యమైన ఫీచర్స్. కాబట్టి క్వాట్రో అనేది బ్రాండ్‌కు ట్రంప్ కార్డ్. క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఆడికి ఆధారం. ఇప్పుడు ఆడి కొత్త మోడళ్లు, కొత్త టెక్నాలజీలతో మరింత మెరుగ్గా చేస్తోంది. విద్యుదీకరించబడిన పవర్‌ట్రైన్‌లలో క్వాట్రో అనేది భవిష్యత్తులో కదలిక కోసం పూర్తిగా కొత్త సమర్పణ.