MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • నదిలో బిఎమ్‌డబ్ల్యూ కారు: కోటి రూపాయల కారును నదిలో తోసేశాడు, కారణం తెలిస్తే మనసుని కదిలిస్తుంది..

నదిలో బిఎమ్‌డబ్ల్యూ కారు: కోటి రూపాయల కారును నదిలో తోసేశాడు, కారణం తెలిస్తే మనసుని కదిలిస్తుంది..

ప్రతిరోజూ  కొన్ని వింత సంఘటనలు తెరపైకి వస్తూ హెడ్ లైన్స్ గా మారుతున్నాయి.  ఇప్పుడు చెప్పబోయేది ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ గురించి కాదు, కానీ కోటి రూపాయల విలువైన తన BMW కారును నదిలో విసిరిన భారతదేశానికి చెందిన వ్యక్తి గురించి...

1 Min read
Ashok Kumar | Asianet News
Published : May 31 2022, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తల్లి చనిపోవడంతో
తల్లి మృతితో బాధపడుతున్న ఓ వ్యక్తి   బిఎమ్‌డబ్ల్యూ కారుని శ్రీరంగపట్నంలోని కావేరీ నదిలోకి తోసేసిన కేసు బెంగళూరుకు చెందినది. ఆ వ్యక్తి కారు నుండి దిగిన తర్వాత దానిని నది లోకి తోసేశాడు. నివేదిక ప్రకారం ఆ వ్యక్తి కావేరీ నదిలోకి తోసేసిన BMW X6 SUB విలువ రూ. 1.3 కోట్లు. 
 

24

ఆ వ్యక్తి తన ఎస్‌యూవీని కావేరీ నదిలో పడేసినప్పుడు అతను తన తల్లి మరణంతో చాలా బాధపడుతున్నడని   అక్కడి మత్స్యకారులు, బాటసారులు  తెలిపారు. నదిలో కూరుకుపోతున్న ఈ లగ్జరీ కారును నది చుట్టూ ఉన్న మత్స్యకారులు, బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 

34

ఈ కారు ప్రమాదానికి గురైందని పోలీసులకు తెలిసిన వెంటనే కారు లోపల ఎవరైనా చిక్కుకుపోయారేమోననే భయంతో పోలీసులు బృందం చాలా శ్రమించి కారును నదిలో నుంచి బయటకు తీశారు. చివరకి పోలీసులు రవాణా శాఖ నుంచి సమాచారం సేకరించి బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌లో నివాసముంటున్న కారు యజమానిని గుర్తించారు. 
 

44

పోలీసుల విచారణలో 
పోలీసుల విచారణలో సదరు వ్యక్తి దీని గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ.. తల్లి చనిపోవడంతో డిప్రెషన్‌కు లోనయ్యాడని.. అందుకే బీఎండబ్ల్యూ ఎస్‌యూవీని నదిలో పడేసినట్లు అతని బంధువులు చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇవ్వడంతో ఆ వ్యక్తిని పోలీసులు రిలీజ్ చేశారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
MG Comet : అసలే చవకైన ఈవీ కారు.. ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్లో మరో రూ.1 లక్ష డిస్కౌంట్
Recommended image2
Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Recommended image3
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved