- Home
- Automobile
- Bajaj Pulsar 250 Eclipse Edition:నేకెడ్ బజాజ్ పల్సర్ 250 సిసి బ్లాక్ ఎడిషన్, స్పెషాలిటీ ఎంతో తెలుసా..?
Bajaj Pulsar 250 Eclipse Edition:నేకెడ్ బజాజ్ పల్సర్ 250 సిసి బ్లాక్ ఎడిషన్, స్పెషాలిటీ ఎంతో తెలుసా..?
బజాజ్ ఆటో నేకెడ్ 250 సిసి పల్సర్ బైక్ బ్లాక్-అవుట్ ఎడిషన్ టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో టీజర్‌ను షేర్ చేసింది ఇంకా దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. బజాజ్ ఆటో క్వార్టర్-లీటర్ పల్సర్ సిరీస్ బైక్స్ లో డార్క్ ఎడిషన్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా ఎక్లిప్స్ ఎడిషన్ అని పిలుస్తారు.

స్పెషల్ ఏంటి
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ పల్సర్ 250 సిరీస్ బైక్స్ ని గత ఏడాది అక్టోబర్‌లో పరిచయం చేసింది. ఇందులో పల్సర్ N250, నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ అండ్ పల్సర్ F250, సెమీ ఫెయిర్డ్ క్వార్టర్-లీటర్ బైక్స్ ఉన్నాయి. వీటిని మూడు కలర్ స్కీంస్ లో అందించబడతాయి. ఇందులో టెక్నో గ్రే, రేసింగ్ రెడ్ అండ్ కరేబియన్ బ్లూ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు, రాబోయే ఎక్లిప్స్ ఎడిషన్ కొత్త పెయింట్ స్కీమ్‌లో అందించబడుతుందని భావిస్తున్నారు.
కొత్త టీజర్ విడుదల
కంపెనీ ప్రస్తుతం పల్సర్ ఎన్250 ఎక్లిప్స్ ఎడిషన్ టీజర్‌ను మాత్రమే విడుదల చేస్తోంది. అయితే, బజాజ్ సెమీ-ఫెయిర్డ్ పల్సర్ F250తో కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. కొత్త కలర్ స్కీమ్‌తో పాటు, ఎలాంటి కొత్త మార్పులు ఆశించంవసరం లేదు.
ఇంజిన్ అండ్ పవర్
కొత్త బజాజ్ పల్సర్ N250 ఇంకా F250 లు 249.07cc, సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో అందించబడతాయి. ఈ ఇంజన్ 24.1 బిహెచ్‌పి పవర్ ఇంకా 21.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది ఇంకా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ని కూడా పొందుతాయి.
ధర
ధర పరంగా బజాజ్ పల్సర్ N250 ప్రస్తుతం రూ. 1.44 లక్షలుగా ఉంది. కాగా పల్సర్ ఎఫ్ 250 ధర రూ.1.45 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ చెందినవి. ఈ బైక్స్ విడుదలైన ఆరు నెలల్లోనే 10,000 విక్రయాల మైలురాయిని కూడా అధిగమించాయి.