కేటిఎం, యమాహాకి పోటీగా బజాజ్ పల్సర్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్.. సరికొత్త స్టయిల్ అండ్ లుక్ తో...
ఇండియన్ మల్టీనేషనల్ టు వీలర్ అండ్ త్రీ వీలర్ తయారీ సంస్థ బజాజ్(bajaj) కొత్త 2021 మోడల్ పల్సర్ 250 (bajaj pulsar 250), పల్సర్ 250 ఎఫ్ (pulsar 250f) అక్టోబర్ 28న భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. బజాజ్ ఆటో ఈ మధ్య కాలంలో కొత్త పల్సర్‌ను లాంచ్ ముందు దాని గురించి చాలా హైప్ చేసింది.
ఈ బైక్‌లలో ఒకదాని టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ రెండు కొత్త బైక్‌లు కూడా గత కొన్ని వారాలుగా భారతీయ రోడ్లపై పరీక్షించింది. ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బైక్‌లు భారతదేశంలో సేల్స్ కి సిద్ధంగా ఉన్నాయి.
ఇంజిన్ అండ్ పవర్
2021 బజాజ్ పల్సర్ 250 పూర్తిగా కొత్త ఉత్పత్తి. ఈ బైక్ కొత్త ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అధికారిక టీజర్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ బైక్ కొత్త 250 సిసి ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ దాదాపు 26 పిఎస్ పవర్, 22ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. గేర్ ట్రాన్స్‌మిషన్ గురించి చెప్పాలంటే 6-స్పీడ్ గేర్‌బాక్స్ దీనిలో చూడవచ్చు.
లుక్ అండ్ డిజైన్
ఎక్స్టీరియర్ లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే కొత్త 2021 పల్సర్ 250లో సరికొత్త డిజైన్ అందించారు. అంటే ప్రస్తుతం ఉన్న పల్సర్ శ్రేణి బైక్‌లకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ బైక్ దాని శ్రేణిలో ఫ్లాగ్‌షిప్ బైక్ అయినందున ఎక్స్టీరియర్ డిజైన్ మరింత దూకుడుగా ఉండవచ్చు. కొన్ని కీలక ఎక్స్టీరియర్ ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లు, ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, బ్యాక్ మోనోషాక్, అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉంటాయి.
పల్సర్ 250 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ స్టైల్‌ను పొందగా, పల్సర్ 250ఎఫ్ సెమీ ఫెయిర్డ్ సెటప్‌ను పొందుతుంది. రెండు మోడల్‌లకు ఒకే ఇంజన్ అండ్ ఫీచర్ సెటప్ ఉంటాయి, కానీ ఎక్స్టీరియర్ డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా విభిన్నంగా ఉంటాయి.
మార్కెట్‌లో పోటీగా ఉండేందుకు బజాజ్ ఆటో కొత్త పల్సర్ 250 ట్విన్‌ల ధరలను చాలా దూకుడుగా నిర్ణయించే విధంగా ధర ఉండవచ్చు . నేకెడ్ పల్సర్ 250 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా అంచనా వేయబడింది. సెమీ-ఫెయిర్డ్ పల్సర్ 250ఎఫ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షల నుండి ప్రారంభం కావచ్చు. బజాజ్ ఇతర బైక్ డొమినార్ 250 (dominor 250) సేల్స్ ప్రభావితం చేయని విధంగా రెండు బైక్‌లను ఉంచడానికి బజాజ్ ప్రయత్నిస్తుంది.