బీఎస్-6 బాటలో కొత్త మోడల్ కార్లు, బైక్‌లు, స్కూటీలు...
ఆటోమొబైల్ దిగ్గజాలు ‘బీఎస్-6’ ప్రమాణాలకనుగుణంగా తమ వాహనాలను అప్ డేట్ చేయడంపై కేంద్రీకరించాయి. గడువు దగ్గర పడుతున్నా కొద్దీ బీఎస్-6 మోడల్ కార్లు, మోటారు బైక్‌లు, స్కూటీల ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ తన అడ్వెంచరిస్టిక్ టూరర్ మోడల్ హిమాలయన్ బైక్, ఫోకో ఎకో స్పోర్ట్స్ కారు, మారుతి సుజుకి సెలెరియోలను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలో ఆవిష్కరించాయి.
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ సంస్థలు కర్బన ఉద్గారాల నియంత్రణ దిశ బాట పట్టాయి. వాటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్, మారుతి, ఫోర్డ్ తదితర సంస్థలు నిలిచాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హిమాలయన్, మారుతి సుజుకి సెలిరియో, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కార్లను బీఎస్-6 ప్రమాణాలతో విపణిలో ప్రవేశపెట్టాయి.
ప్రజాదరణ పొందిన ‘ఎన్‌ఫీల్డ్’ హిమాలయన్: ప్రముఖ విలాసవంతమైన, అడ్వెంచరిస్టిక్ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ప్రజాదరణ పొందిన మోడల్ హిమాలయను బైక్‌ను అప్‌డేట్ చేసింది. బీఎస్-6 ఇంజిన్‌తో సోమవారం ఆవిష్కరించింది.
హిమాలయన్ మూడు రంగుల్లో లభ్యం:రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బైక్ ప్రారంభ ధర రూ .1.86 లక్షలుగా నిర్ణయించింది. ఏబీఎస్ ఫీచర్‌తో మూడు రంగుల్లో వీటిని తీసుకొచ్చింది. 411 సీసీ సామర్థ్యం గల ఇంజిన్, 24.3 బీహెచ్‌పీ పవర్, 32 ఎన్‌ఎం టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ తన హిమాలయన్ మోటారు సైకిల్‌పై మూడేళ్ల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది.
విలక్షణ అడ్వెంచరిస్టిక్ టూరర్ హిమాలయన్ : విలక్షణమైన అడ్వెంచర్ టూరర్ గా 2016 నుండి, హిమాలయ బైక్స్ జాతీయంగా, అంతర్జాతీయంగా ఆదరణ పొందిందని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో వినోద్ దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక ఫీచర్లు, డిజైన్ ఫంక్షన్లతో కొత్త బీఎస్-6 హిమాలయన్ లాంచ్ చేయడంతో దేశంలో అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ కొత్త ప్రమాణాలను ఏర్పరచడంతోపాటు, రైడర్లను ఆకట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతుందన్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త ఉత్పత్తులు ఇలా: తమ కొత్త బైక్స్ భారతదేశంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో లభిస్తాయని రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ వినోద్ దాసరి అన్నారు. అలాగే హెల్మెట్లు, జెర్సీలు, టీ-షర్టులు, స్వెర్ట్‌షర్ట్స్, హెడ్‌గేర్ తదితరాలను సరికొత్తగా తీసుకొస్తున్నట్టు చెప్పారు.
ఈ రంగుల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బైక్స్ లభ్యం: స్నో వైట్, గ్రానైట్ కలర్ ఆప్షన్ రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బైక్ ధర రూ .1,86,811 నుండి ప్రారంభం అవుతుంది. స్లీట్ గ్రే, గ్రావెల్ గ్రే మోడల్ ధర రూ .1,89,565 కాగా, ఇక కొత్తగా వచ్చిన డ్యూయల్ టోన్ కలర్స్-రాక్ రెడ్, లేక్ బ్లూ ఆప్షన్ బైక్‌లు రూ .1,91,401లకు లభిస్తాయి.
రూ.8.04 లక్షలకు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ : ఫోర్డ్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ కారును బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో సోమవారం విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.8.04 లక్షల నుంచి రూ.11.58 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్ వెర్షన్ ధరల శ్రేణి రూ.8.04-11.43 లక్షలకు లభిస్తాయి. డీజిల్ వేరియెంట్ల ధర రూ.8.54-11.58 లక్షలుగా ఫోర్డ్ నిర్ణయించింది.
బీఎస్-6 పోకో ఎకో స్పోర్ట్ ధర ఎక్కువే: బీఎస్-4తో పోల్చితే బీఎస్-6 వేరియంట్లలో ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు ధర కాస్త ఎక్కువగానే ఉంది. కస్టమర్లు కోరుకునే ఉత్పత్తులు, టెక్నాలజీలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగిన కొత్త ఎకోస్పోర్ట్ 100 పీఎస్ పవర్.. మూడు సిలిండర్లు ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎకోస్పోర్ట్ 122 పీఎస్ పవర్‌ను వెలువరుస్తుందని కంపెనీ తెలిపింది.
బీఎస్-6 లో మారుతి ‘సెలెరియో’ ధరెంతంటే రూ.4.41 లక్షలు, ప్రముఖ ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన సరికొత్త కారు ‘సెలెరియో’ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4,41,200గా నిర్ణయించింది. ఇందులో కేవలం పెట్రోలు ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ కారులో ఒక లీటర్ కే 10బీఆల్ అల్యూమినియం పెట్రోలు ఇంజిన్, 5 స్పీడ్ గేర్ బాక్స్‌ను అమర్చారు.
మారుతి సెలెరియో మోడల్ కారు లీటర్‌కు 23.10 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. గతేడాది డిసెంబర్ నెలలో 5,958 సెలెరియోలను మారుతి సుజుకి ఉత్పత్తి చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2018 డిసెంబర్ నెలలో 9,595 యూనిట్లను ఉత్పత్తి చేసింది. కాగా, గత నెలలో 5,429 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 9,000 కార్లను విక్రయించింది. సెలెరియో మైలేజీ 23.10 కి.మీ.