ఆపిల్ మొట్టమొదటి డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ కార్ చూసారా.. 2025 నాటికి లాంచ్..
అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ అపిల్(apple) డ్రైవర్ లెస్ అటానమస్ ఎలక్ట్రిక్ కారు(electric car) గురించి చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన వ్యక్తుల ప్రకారం, Apple Inc. కంపెనీ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది అంతేకాదు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (self driving)సామర్థ్యాలతో కారును త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.
ఆపిల్ ప్రాజెక్ట్ టైటాన్ (project titan)చాలా కాలంగా వార్తల్లో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఆపిల్ కార్ బృందం ఒకేసారి రెండు మార్గాలను అన్వేషించింది-ఒకటి ఇప్పటికే ఉన్న అన్నీ కార్ల లాగానే స్టీరింగ్ అండ్ యాక్సిలరేటర్‌లపై దృష్టి సారించిన లిమిటెడ్ సెల్ఫ్-డ్రైవింగ్ సామర్థ్యాలతో మోడల్‌ను రూపొందించడం లేదా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ సామర్థ్యంతో కూడిన వేర్షన్ అంటే మానవ జోక్యం అవసరం లేకుండా.
ఆపిల్ కొత్త ప్రాజెక్ట్ టైటాన్‌కు లీడ్ వహించడానికి కెవిన్ లించ్‌పై ఆధారపడింది. కెవిన్ లించ్ ఆపిల్ వాచ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి నాయకత్వం వహించారు. కెవిన్ లించ్ నేతృత్వంలోని ఇంజనీర్లు ఇప్పుడు రెండవ ఆప్షన్ పై దృష్టి సారించారు. కెవిన్ లించ్ ఆపిల్ కార్ మొదటి వెర్షన్‌ను ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌తో కూడిన కారుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ చర్చలు ప్రైవేట్‌గా ఉన్నందున ప్రాజెక్ట్‌తో అనుబంధించబడిన కొందరు వ్యక్తులు ఈ సమాచారాన్ని అందించారు.
లీడ్ లో మార్పు ఆపిల్ ప్రత్యేక ప్రాజెక్ట్‌ల గ్రూప్ తాజా మార్పు మాత్రమే, ఈ ప్రాజెక్ట్ 2014లో ప్రారంభమైనప్పటి నుండి ఎంతో మంది సిబ్బంది పునర్నిర్మాణాలు, వ్యూహాత్మక మార్పులను చూసింది. ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును 2025లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ టైమ్‌లైన్ లో మార్పు ఉండవచ్చు. కానీ కంపెనీ అప్పటికి ఫుల్ అటోనోమస్ సామర్థ్యాలు లేకుండా వాహనాలను విడుదల చేయడానికి ఎంచుకోవచ్చు.
టెస్లా ఇంక్., ఎలక్ట్రిక్ వాహనాలలో మార్కెట్ లీడర్, ఫుల్ అటోనోమస్ కార్లను అందించడానికి ఇంకా చాలా దూరంలో ఉంది. ఆల్ఫాబెట్ ఇంక్. వేమో(waymo) టెక్నాలజి అభివృద్ధి చేసే ప్రయత్నాలలో నిష్క్రమణను ఎదుర్కొంది. యుబర్ టెక్నాలజీస్ ఇంక్ గత సంవత్సరం సెల్ఫ్ అటోనోమస్ -డ్రైవింగ్ విభాగాన్ని విక్రయించడానికి అంగీకరించింది.
వీటన్నింటి మధ్య ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును నాలుగేళ్లలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఈ సంవత్సరం ప్రారంభంలో కొంతమంది ఇంజనీర్లు ప్లాన్ చేసిన ఐదు నుండి ఏడు సంవత్సరాల కాలక్రమం కంటే వేగంగా. కానీ టైమ్‌లైన్ నిర్ణయించలేదు, 2025 లక్ష్యాన్ని చేరుకోవడం అనేది సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌లను రూపొందించే కంపెనీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆపిల్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే లాంచ్ ఆలస్యం చేయవచ్చు లేదా ప్రారంభంలో లో-టెక్ కారును ప్రారంభించవచ్చు.