ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఈ సారి‘నా చిన్నప్పటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది’ అంటూ..
ప్రతి సంవత్సరం నవంబర్ 14న చిల్డ్రన్స్ డే(childrens day) సెలెబ్రేషన్స్ ని స్కూల్స్ లో జరుపుకుంటుంటారు. స్కూల్ డేస్ (school days)లో ప్రతి ఒక్కరినీ టీచర్ అడిగే ప్రశ పెరిగి పెద్దయ్యాక ఏమవుతావు అని.. చాలా మంది వారి చిన్నప్పటి స్కూల్ డేస్ లో ఈ ప్రశ్నకి ఏవేవో సమాధానాలు చెబుతుంటారు. కానీ చదువు ముగించుకొని పెద్దయ్యాక ఈ ప్రశ్నకి మనం చెప్పిన సమాధానం ఒకోసారి గుర్తుండదు.
తాజాగా దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియా ట్విట్టర్ లో వైరల్ అవుతుంది... అదేంటని అనుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో ఎప్పుడు విచిత్రమైన, అరుదైన సంగతులని షేర్ చేసుకునే ఆనంద్ మహీంద్ర ఈ సారి తన చిన్ననాటి బాల్యం గుర్తుకొచ్చి చిన్న స్మైల్ తో ఒక ట్వీట్ చేశాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా తనకు కనిపించిన ఎన్నో మేసేజ్‌లలో ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతుందని, ఈ మెసేజ్ ప్రతీ రోజుకి వర్తిస్తుందని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘పెరిగి పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావ్ అనే ప్రశ్నకి నా చిన్నతనంలో అసలు సమాధానం దొరికేది కాదు. కానీ ఈ రోజు నేను పెద్దయ్యాను. ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. అదేంటంటే... తిరిగి చిన్న పిల్లాడిగా మారిపోవాలని అనిపించడం’ అంటూ ఉన్న మెసేజ్‌ని ఆయన షేర్ చేశారు. ఈ మేసేజ్ చదివిన నెటిజన్లు ఆనంద్ మహీంద్రాలోని చమత్కారం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ కి 2 వేల 5 వందలకు పైగా లైకులు, భారీగా రిట్వీట్లు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ ని ఈ రోజు మధ్యనం షేర్ చేశారు.