ఈ-కామర్స్ కంపెనీలకు నోటీసు.. నకిలీ హెల్మెట్లు, కుక్కర్లు, సిలిండర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు..
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి లేదా అందుకుగల కారణమయ్యే నకిలీ ఉత్పత్తుల విక్రయాలు, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టనుంది. నకిలీ ఐఎస్‌ఐ స్టాంప్డ్ ప్రెషర్ కుక్కర్లు, టూ వీలర్ హెల్మెట్లు, ఎల్‌పిజి సిలిండర్లను విక్రయిస్తున్న వారిపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) బుధవారం తెలిపింది.
రిటైలర్లతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో విచక్షణారహితంగా విక్రయాలు జరుగుతున్నాయని సిసిపిఎ( CCPA) చీఫ్ కమిషనర్ నిధి ఖరే తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఐదు ఈ-కామర్స్ కంపెనీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నిబంధనలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లను ఇందులో విక్రయిస్తున్నారు.
నకిలీ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు అందిన కంపెనీలపై విచారణ జరపాలని CCPA అన్ని జిల్లా కలెక్టర్‌లను కోరింది. అధికార పరిధిలో విచారణ తర్వాత మేము దాని నివేదికను వచ్చే రెండు నెలల్లో పంపుతాము. అంతేకాకుండా, CCPA ఈ ఉత్పత్తులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు సిసిపిఎ చీఫ్ కమిషనర్ చెప్పారు. ఇలాంటి కేసులు తెరపైకి వస్తే నిందితులపై కేసు నమోదు చేస్తాం అని వెల్లడించారు.
కొనుగోలు చేసే ముందు
1. షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారుల రక్షణ కోసం BIS ఇండియన్ స్టాండర్డ్ (IS) గుర్తును తప్పకుండా తనిఖీ చేయండి.
2. కస్టమర్లు కూడా ఉత్పత్తుల ఫీచర్లలో BIS మార్క్ చూసిన తర్వాత మాత్రమే వెబ్‌సైట్లలో ఆర్డర్ చేయాలి.
3.BIS మార్క్ లేకుండా ప్రెషర్ కుక్కర్, టూ వీలర్ హెల్మెట్, ఎల్‌పీజీ సిలిండర్‌లను విక్రయించరాదని వినియోగదారులు తెలుసుకోవాలి.
4. హెల్మెట్ పై BIS 4151:2015 అలాగే ప్రెషర్ కుక్కర్ పై BIS 2347:2017 గుర్తును చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి.