Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • 2022లో ఈ రాశుల వారికి వారు కోరుకున్న ప్రేమ దక్కుతుంది..!

2022లో ఈ రాశుల వారికి వారు కోరుకున్న ప్రేమ దక్కుతుంది..!

ఈ రాశులవారికి మాత్రం.. 2022లో తాము కోరుకున్న ట్రూలవ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉందట. మరి ఆ లక్కీ రాశులేంటో ఓసారి చూసేద్దాం..  

Ramya news team | Published : Dec 15 2021, 02:52 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
astrology

astrology

మరికొద్ది రోజుల్లో మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరం కోసం  అందరూ ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నాం. అయితే.. ఈ నూతన సంవత్సరమంతా తమకు బాగుండాలని అందరూ కోరుకుంటారు. తమ జీవితంలోకి కొత్త ప్రేమ అడుగుపెట్టాలని కోరుకునేవారు కూడా లేకపోలేదు. అయితే.. ఈ  జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశులవారికి మాత్రం.. 2022లో తాము కోరుకున్న ట్రూలవ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉందట. మరి ఆ లక్కీ రాశులేంటో ఓసారి చూసేద్దాం..

27
Asianet Image

1.వృషభ రాశి..
ఈ రాశివారు.. ఇప్పటికీ ఒంటరిగా ఉన్నవారైతే.. వీరికి 2022లో నిజమైన ప్రేమ దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ఎంతో  కాలంగా తమకు నమ్మకమైన బంధం కావాలని కోరుకుంటూ ఉన్నవారైతే. అది నిజమౌతుంది. అయితే.. వీరి రిలేషన్ ముందు స్లోగా మొదలై.. తర్వాత..  బంధం భాగా బలపడుతుంది. వారి ఎమోషనల్ బాండింగ్.. మరింత బలపడుతుంది.

37
Asianet Image

2.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు కూడా.. వారు ఎలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారో.. ఆ వ్యక్తి  వారికి నూతన సంవత్సరంలో దొరికే అవకాశం ఎక్కువగా ఉంది.  వీరి బంధం చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వారు ప్రేమించిన వారితో పెళ్లి జరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. వారితోనే వారి జీవితం చివరి వరకూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు.

47
Asianet Image

4.కన్య రాశి..
ప్రేమ విషయంలో ఈ రాశి చాలా అదృష్టమైనదని చెప్పొచ్చు. ఈ రాశివారు ఈ నూతన సంవత్సరంలో తాము కోరుకున్న ప్రేమ దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే.. వారు ప్రేమించే వ్యక్తి.. కొత్త వ్యక్తి కాకపోవచ్చు. ఎప్పుడో పరిచయం ఉన్నవ్యక్తే.. మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక వారితో రిలేషన్.. మీతో జీవితాంతం  ఉంటుంది. 

57
Asianet Image

5.వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా ఎమోషనల్. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రేమ సంబంధాల విషయంలో ఇవి వారిని కొంచెం కఠినమైన వ్యక్తిగా చేస్తాయి. ఏప్రిల్ 2022 మధ్య నుండి, వారి ప్రేమ గృహంలో బలమైన బృహస్పతి ఆశీస్సులు ఉంటాయి. ఇది వారి జీవితంలో స్థిరమైన సంబంధాలను తెస్తుంది. అలాగే, వారి లగ్నానికి బృహస్పతి యొక్క అంశం వారికి పరిపక్వతను మరియు వారి సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి శక్తిని ఇస్తుంది. రొమాంటిక్ బాండ్‌లో ఉన్నవారు తమ కనెక్షన్‌ల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. కుటుంబానికి తమ ప్రియమైన వారిని పరిచయం చేస్తారు.

67
Asianet Image

6.ధనస్సురాశి..
ప్రేమ జాతకం ప్రకారం, ధనుస్సు రాశి వారికి 2022 విజయవంతమవుతుంది. వారి ఐదవ ఇంటి యజమాని సంవత్సరం ప్రారంభంలో పెరుగుతున్న రాశిలో ఉంటాడు. రిలేషన్ షిప్ లో ఉన్నవారు ఈ కాలంలో తమ భాగస్వామి పట్ల మక్కువ చూపుతారు. ఈ సమయంలో వారు తమ జీవితంలోని ప్రేమించిన వారితో నిశ్చితార్థం కూడా చేసుకోవచ్చు. ఒంటరిగా ఉన్న వ్యక్తులు 2022 సంవత్సరం ప్రారంభంలో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది.

77
Asianet Image

7.మకర రాశి..

ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు జూన్, 2022 నెలలో తమ భాగస్వామితో మంచి అవగాహనను ఏర్పరచుకుంటారు. ఈ కాలంలో వారి ప్రేమ గృహం నుండి కుజుడు సంచరిస్తున్నందున ఆగస్టు నెలలో వారి అనుబంధంలో సాన్నిహిత్యం , అభిరుచి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వారు 2022 సంవత్సరం చివరి నాటికి వారి జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవచ్చు. జూలై నెలలో వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు కానీ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విషయాలు సజావుగా సాగుతాయి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories