ఈ రాశులవారు ఆ కళలో తోపులు...!
మన చేతికి ఎలాంటి కష్టం లేకుండా పని జరిగిపోవాలి అంటే...ఈవెంట్ ఆర్గనైజర్స్ కి అప్పగించాల్సిందే. వాళ్లు మనకు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. అన్ని పనులు వాళ్లే చేసుకుపోతారు. అలా చేయడం అందరి వల్లా కాదు.. దానికి చాలా తెలివి, ప్లానింగ్ కావాలి.

ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఒకేలా ఆలోచించరు. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. టాలెంట్ విషయంలోనూ అంతే.. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే... ఈ రోజుల్లో పెళ్లి చేయడం అంటే.. ఎంత పెద్ద పనో చెప్పక్కర్లేదు. అయితే... మన చేతికి ఎలాంటి కష్టం లేకుండా పని జరిగిపోవాలి అంటే...ఈవెంట్ ఆర్గనైజర్స్ కి అప్పగించాల్సిందే. వాళ్లు మనకు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. అన్ని పనులు వాళ్లే చేసుకుపోతారు. అలా చేయడం అందరి వల్లా కాదు.. దానికి చాలా తెలివి, ప్లానింగ్ కావాలి. ఈ కింది రాశుల వారు.. ఈ పనులు చక్కగా చేయగలరట. ముఖ్యంగా వెడ్డింగ్ ప్లానర్స్ గా ఈ రాశులవారు కరెక్ట్ గా సెట్ అవుతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
1.వృషభ రాశి..
ఈ రాశివారి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరి అభిరుచి కూడా చాలా కాస్ట్లీ గా ఉంటుంది. వీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అత్యుత్తమ డిజైన్లు చేయడంలో ముందుంటారు. వీరు కనుక వెడ్డింగ్ ప్లానర్లు అయితే.... అన్ని పనులు వీరే చేస్తారు. వేరే వారికి ఒక్క పని కూడా చేయాల్సిన అవసరం ఉండదు. అంత పక్కగా.. ప్లానింగ్ ప్రకారం పనులు పూర్తి చేస్తారు.
2.కన్య రాశి...
కన్య రాశివారు వెడ్డింగ్ ఆర్గనైజర్లుగా బాగా సెట్ అవుతారు. పెళ్లికి సంబంధించిన అన్ని పనులను వీరు పూర్తి చేయగలరు. వారికి అప్పగించిన పని పూర్తి చేసేవరకు వీరు విశ్రమించరు. కరెక్ట్ గా పద్దతి ప్రకారం అన్ని పనులు పూర్తి చేస్తారు. వీరిని ది బెస్ట్ వెడ్డింగ్ ఆర్గనైజర్లుగా చెప్పొచ్చు.
3.తుల రాశి..
ఈ రాశివారు కూడా ఎంత కష్టమైన పని అయినా సులువుగా చేయగలరు. ఎంతమందినైనా ఒకచోట సమన్వయం చేసి... ఈ వెంట్ సక్సెస్ అవ్వడానికి వీరు ప్రయత్నిస్తారు. ఎంతమందితో అయినా వీరు పని చేయించగలరు. ఎలాంటి గందరగోళం లేకుండా పని పూర్తయ్యేలా చేయడంలో వీరు తోపులు అని చెప్పొచ్చు.
4.మకర రాశి..
మకర రాశివారు కూడా వెడ్డింగ్ ఆర్గనైజర్ గా తమ పని మొత్తం సవ్యంగా పూర్తి చేస్తారు. వీరు చేసే పని కూడా చాలా బడ్జెట్ ప్రకారం చేస్తారు. ఇది అందరికీ వెసులుబాటుగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి విషయానికి వస్తే.. ఏ సమయానికి ఏం చేయాలి అనే దానిపై చాలా క్లారిటీ ఉంటుంది. ప్రతి పనీ ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకుంటారు.
5.కుంభ రాశి..
వివాహాలను ప్లాన్ చేస్తున్నప్పుడు వారు తమ సృజనాత్మకతను బయటకు తీసుకువస్తారు. కొన్ని పనిని సమయానికి పూర్తి చేయాలని తెలిసినప్పుడు వారు క్రమశిక్షణతో ఉంటారు. వారు ఎటువంటి పొరపాట్లు చేయరు, ఎందుకంటే వారు తమ ఫోన్‌లో అవసరమైన సమాచారాన్ని ఉంచుకుంటారు, ఇది వారికి చాలా సహాయపడుతుంది.