ఈ రాశులవారు పక్కవారి సక్సెస్ ని జీర్ణించకోలేరు..!
జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశులు కూడా అంతే... ఎదుటివారి సక్సెస్ ని చూసి అస్సలు జీర్ణించుకోలేరు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

jealous
జీవితంలో ప్రతి ఒక్కరూ సెక్సెస్ అవ్వాలని రూలేమీ లేదు. కొందరు చాలా కష్టపడి జీవితంలో అనుకున్నది సాధిస్తారు. తాము జీవితంలో సక్సెస్ అవ్వడానికి వారు చాలా కష్టపడతారు. అయితే.. వీరి సక్సెస్ ని చూసి మరికొందరు మాత్రం అస్సలు తట్టుుకోలేరు. వారు తమకన్నా జీవితంలో ముందుకు వెళ్లడాన్ననిన.. విజయం సాధించడం చూసి అస్సలు జీర్ణించుకోలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశులు కూడా అంతే... ఎదుటివారి సక్సెస్ ని చూసి అస్సలు జీర్ణించుకోలేరు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..
1.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి కి అసూయ చాలా ఎక్కువ. ఈ రాశివారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలి అనుకుంటారు. అందుకోసం విరామం లేకుండా పనిచేస్తారు. అయితే.. తమకన్నా.. ఎవరైనా ముందుగా విజయాన్ని సాధిస్తే మాత్రం చూసి తట్టుకోలేరు. నిస్సహాయ స్థితి కి వెళ్లిపోతారు. ఎదుటివారు ఎదగడం చూసి తట్టుకోలేక.. మీరు పనిచేయడం మానేస్తారు. ఎదుటివారి ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తారు. తమ పట్టుదలను పక్కన పెట్టేస్తారు.
2.మేష రాశి..
ఈ రాశికి చెందిన వారు చాలా పోటీగా ఉంటారు. ఇతరులు మంచి జీవితాన్ని గడపడం లేదా వారి కంటే ఎక్కువ డబ్బు , ప్రశంసలు సంపాదించడం చూసినప్పుడు వారు చాలా అసూయ చెందుతారు. వెంటనే.. ఆ వ్యక్తిని కిందకు లాగడానికి.. తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
3.కుంభ రాశి...
ఈ రాశివారు చాలా ఇంట్రావర్టర్స్. అయితే ఇతరులు విజయం సాధించిన వార్త వారి చెవులకు చేరుకున్నప్పుడు, వారు చాలా చిరాకు, అసూయ చెందుతారు. వారు తమ స్వంత పని గురించి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారు.
4.కన్య రాశి..
ఇతరుల విజయాల పట్ల విపరీతంగా చిరాకుపడే వారిలో వీరు ఒకరు. వారు ఎల్లప్పుడూ అన్నింట్లోనూ తామే అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఇతరులను తక్కువ చేయడం, అన్నీ తారుమారు చేయడంలోనూ వీరు ముందుంటారు. అత్యున్నత స్థానాన్ని పొందుతారు. వారు ఎంతో తెలివైనవారు కానీ ఒకరి విజయానికి వారు ఎప్పుడూ సంతోషించలేరు.