MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ధనస్సు రాశివారు ఈ రాశివారిని పెళ్లి చేసుకుంటే.. వారి లైఫ్ అద్భుతంగా ఉంటుంది..!

ధనస్సు రాశివారు ఈ రాశివారిని పెళ్లి చేసుకుంటే.. వారి లైఫ్ అద్భుతంగా ఉంటుంది..!

మీరు కనుక ధనస్సు రాశివారిని పెళ్లి చేసుకోవాలని.. లేదా.. ప్రేమిస్తున్నట్లయితే.. వారి మెంటాలిటీకి.. మీ రాశి మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 02 2021, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రేమ, పెళ్లి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఎవరిని ప్రేమించాలి..? ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే రెండు విషయాలు మన చేతిలోనే ఉంటాయి. కొన్ని సార్లు.. అవి వర్కౌట్ అవుతాయి.. మరోసారి బెడిసి కొడతాయి. అయితే..  అలా బెడిసి కొట్టకుండా ఉండాలంటే...  ఏ రాశివారికి ఎవరు సెట్ అవుతారో తెలుసుకోవాలట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ధనస్సు రాశివారికి ఎలాంటివారు బాగా సెట్ అవుతారో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీరు కనుక ధనస్సు రాశివారిని పెళ్లి చేసుకోవాలని.. లేదా.. ప్రేమిస్తున్నట్లయితే.. వారి మెంటాలిటీకి.. మీ రాశి మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

37

1.మేష రాశి...

మేష రాశివారితో ధనస్సు రాశి కి జత కుదిరితే.. వాడి జోడి అదిరిపోతుంది. ఈ రెండు రాశుల వారిలోనూ ఫైర్ ఎక్కువ. వీరు ఇద్దరూ కలిసి సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. ఈ రెండు రాశులకు స్వేచ్ఛగా ఉండటం నచ్చుతుంది. ఎవరైనా తమను కంట్రోల్ చేయడం వీరికి అస్సలు నచ్చదు. అంతేకాదు.. వీరిద్దరూ.. ఒకరికి  మరొకరు పూర్తిగా గౌరవం ఇస్తారు. వీరు లైఫ్ లో థ్రిల్ ఎక్కువగా కోరుకుంటారు. వీరి పరిచయం కూడా.. ఎదైనా అడ్వెంచర్ పార్క్ లో జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే... ఈ రెండు రాశులకు కోపం చాలా ఎక్కువ. దానిని కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే.. వీరంత బెస్ట్ పెయిర్ ఇంకోటి ఉండదు.
 

47

2.సింహ రాశి..

ధనస్సు , సింహ రాశి.. ఈ రెండు రాశుల మనస్థత్వాలు ఒకేలా ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీరిద్దరూ డేటింగ్ మొదలుపెడితే.. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు. ప్రపంచం గురించి పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తారు. వీరి ఆలోచనాలు చాలా యూత్ ఫుల్ గా ఉంటాయి. చాలా సరదాగా ఉంటారు. నవ్వుతూ.. నవ్విస్తూ.. జోకులు వేసుకుంటూ సరదాగా ఉంటారు. అయితే.. ధనస్సు రాశివారు కాస్త స్వేచ్ఛ కోరుకుంటారు. ఆ స్వేచ్ఛ సింహ రాశారిని బాధపెడుతుంది. తమను వదిలేసి వెళ్లిపోతున్నారనే భావన కలిగే అవకాశం ఉంటుంది.

57

3.కుంభ రాశి..
ధనస్సు రాశి.. అగ్నికి సంకేతం అయితే.. కుంభ రాశి గాలికి సంకేతం. గాలి.. అగ్నికి ఇంధనం లాంటిది. ఈ రెండు రాశుల జోడి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే.. ఈ రెండు రాశుల కాంబినేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంది.

67


4.తుల రాశి..
తుల రాశి కూడా గాలికి సంకేతం. ఇక ధనస్సు రాశి.. అగ్నికి సంకేతమనే విషయం కూడా మనకు తెలిసిందే. ఈ రెండూ కలిసి ఒక దానికి మరొకటి అనువుగా ఉంటాయి. ఈ రెండు రాశులు.. ఆనందంగా ఉంటాయి. ఎప్పుడూ వెచ్చదనం పంచుతూ.. ఒకరికి మరొకరు తోడుగా ఉంటాయి. వీరు. చాలా సామాజిక జంట. అందరితోనూ బాగా కలిసిపోతారు.

77

5.మిథున రాశి..
మిథున రాశి.. ధనస్సు రాశివారికి ఎప్పుడూ తమ కంట్రోల్ లో ఉంచుకోగలరు. అయితే.... ఆ కంట్రోల్ మంచి కోసమే కావడం గమనార్హం. మంచి మార్గంలో ఉంచాలని చూస్తుంటారు. అయితే.. ధనస్సు రాశివారు విసుక్కోవడం నచ్చదు.  అయితే.. మిథున రాశివారు అప్పుడప్పుడు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు. ఆ సమయంలో వారిని కాస్త కంట్రోల్ చేస్తే... ఈ రెండు రాశులు చక్కగా హ్యాపీగా ఉండగలరు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Astrology Predictions: జూన్ 24 నుంచి ఈ 3 రాశుల వారికి జాక్‌పాట్.. కెరీర్‌లో దూసుకెళ్తారంతే!
Recommended image2
Saturn Transit: ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలాన్ని తీసుకురాబోతున్న శని దేవుడు.. పెరగనున్న సంపాదన
Recommended image3
Planet Alignment:59 ఏళ్ల తర్వాత గ్రహాల అద్భుత కలయిక...ఈ రాశుల జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరగడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved