ఇంట్లో టీవీ ఎక్కడ పెట్టాలో తెలుసా?
చాలా మటుకు టీవీని లివింగ్ రూముల్లో పెడుతుంటారు. కొంతమంది మాత్రం బెడ్ రూం తో పాటుగా ఇష్టం వచ్చిన దగ్గర పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం.. టీవీలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.
ఫోన్లు లేని మనుషులు ఎలా అయితే లేరో.. టీవీ లేని ఇళ్లు కూడా ప్రస్తుతం లేదు. ప్రతి ఇంట్లో టీవీ పక్కాగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం బాగా పెరిగింది. అయితే వాస్తు ప్రకారం.. టీవీని ఇంట్లో ఏదో ఒక దిశలో ఉంచడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే వాస్తు ప్రకారం.. టీవీని ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీవీని ఈ దిశలో ఉంచొద్దు
చాలా మంది టీవీని లివింగ్ రూమ్ లో పెడుతుంటారు. అయితే మీరు కూడా లివింగ్ రూమ్ లో టీవీని పెట్టినట్టైతే పొరపాటున కూడా నైరుతి మూలలో పెట్టకండి. ఎందుకంటే ఇలా టీవీని పెట్టడం వల్ల టీవీ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
నష్టం జరుగుతుంది
కొంతమంది దిశలను పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ టీవీలను పెడుతుంటారు. వాస్తు ప్రకారం.. టీవీని మీ ఇంటి నైరుతి మూలలో ఉంచకూడదు. ఒకవేళ పెడితే మీకు ఆర్థిక నష్టం జరుగుతుంది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల మధ్య దూరం కూడా ఏర్పడుతుంది. అందుకే టీవీని ఈ దిశలో పెట్టకూడదు.
ఈశాన్య దిశ
వాస్తుశాస్త్రం ప్రకారం.. టీవీని ఈశాన్య దిశలో పెట్టడం శుభప్రదంగా పరిగణించబడదు. ఎందుకంటే ఈ దిశలో టీవీని పెట్టడం వల్ల మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో పరిస్థితులు కూడా అంతగా బాగుండవు.
టీవీని ఏ దిశలో ఉంచాలి?
వాస్తు ప్రకారం.. టీవీని ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచడం ఉత్తమమని భావిస్తారు. మీ ఇంట్లో టీవీని ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొంటుంది. సంబంధాలు బాగుంటాయి.
ఈ దిశ పాజిటివిటీ తెస్తుంది.
వాస్తు ప్రకారం.. టీవీని కొన్ని దిశల్లో పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇంటికి ఆగ్నేయ దిశలో టీవీని ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు ప్రకారం ఈ దిశ సరైనదిగా పరిగణించబడుతుంది.
పడకగదిలో టీవీ పెట్టకూడదు
కొంతమంది పడకగదిలో కూడా టీవీని పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం పడకగదిలో టీవీని పెట్టకూడదు. పడకగదిలో టీవీ ఉంటే ఆగ్నేయ మూలలో ఉంచాలి. మిగతా ఏమూలలో పెట్టకూడదు. అలాగే వాస్తు ప్రకారం.. టీవీ దిశ, పరిశుభ్రత రెండూ ముఖ్యమైనవి. కాబట్టి టీవీలో దుమ్ము, ధూళి పేరుకుపోకుండా చూసుకోవాలి.