గర్ల్ ఫ్రెండ్ కలలో కనిపిస్తే ఆర్థమేంటో తెలుసా?
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే కలలు మన వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉంటాయి. కలలు మనకు మన భవిష్యత్తును గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తాయి. అయితే కొన్ని కలలు శుభ సంకేతాలను ఇస్తే.. మరికొన్ని అశుభ సంకేతాలను ఇస్తాయి. మరి గర్ల్ ఫ్రెండ్ కలలో కనిపిస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఏ కారణం లేకుండా ఒక వ్యక్తికి కలలు పడవు. దీనిప్రకారం.. కలలు మనకు మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తాయి. అంటే ఇవి మన జీవితంలో శుభ, అశుభ సంఘటనలు జరగబోతున్నాయని సూచిస్తాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలు మన భవిష్యత్తుతో ముడిపడి ఉంటాయి. అయితే చాలా సార్లు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ కూడా కలలోకి వస్తుంటారు. అయితే ఈ కలలు మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఏ స్థితిలో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందట.
కలలో చిరునవ్వులు చిందిస్తున్న ప్రియురాలిని చూస్తే..
మీ కలలో మీ ప్రేయసి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తే.. దానిని శుభప్రదంగా భావిస్తారు. అంటే మీ రాబోయే కాలంలో ఆనందం రాబోతోందని ఈ కల సూచిస్తుంది. అలాగే మీ ప్రేమ మరింత బలపడుతుందని అర్థం. త్వరలోనే మీ ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళుతుంది.
కలలో ఏడుస్తున్న ప్రియురాలిని చూస్తే..
మీ గర్ల్ ఫ్రెండ్ మీ కలలో ఏడుస్తూ కనిపిస్తే దాన్ని అశుభంగా భావిస్తారు. ఇది మీ గర్ల్ ఫ్రెండ్ మీపై కోపంగా ఉన్నారని, మీరు ప్రేమలో మోసపోవచ్చని సూచిస్తుంది. అందుకే ఇలాంటి కల పడ్డప్పుడు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఎరుపు రంగు చీరలో దర్శనమిచ్చిన ప్రియురాలు..
మీ గర్ల్ ఫ్రెండ్ ఎరుపు రంగు చీర కట్టుకుని మీ కలలో కనిపిస్తే.. శుభసూచకం. అంటే ఈ కల మీరు ప్రేమ సంబంధంలో విజయం సాధిస్తారని అర్థం వస్తుంది. అలాగే మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించొచ్చు కూడా.
కలలో భాగస్వామితో పెళ్లి చూడటం
మీ గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లిని కలలో చూసినట్టైతే.. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం వస్తుంది. అలాగే మీ ప్రేమ పెళ్లి పీఠలు ఖచ్చితంగా ఎక్కుతుందని అర్థం వస్తుంది.
పెంపుడు జంతువులతో కనిపించిన ప్రియురాలు
మీ గర్ల్ ఫ్రెండ్ మీ కలలో పెంపుడు జంతువుతో మిమ్మల్ని చూస్తే కూడా మంచిదే. ఇలాంటి కల మీరు త్వరలోనే ఆమెను కలుసుకోవచ్చని సూచిస్తుంది. లేదా మీరు అమెతో పాటు నడకకు కూడా వెళ్లొచ్చని సూచిస్తుంది.
డ్రీమ్ లో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడటం..
మీరు మీ కలలో మీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు కనిపిస్తే.. మీకు త్వరలో కొన్ని శుభవార్తలు అందుతాయి. అలాగే మీ ఫిక్స్ అవుతుందని అర్థం వస్తుంది.
కలలో ప్రియురాలితో గొడవ..
మీ కలలో మీ ప్రియురాలితో గొడవ పడుతున్నట్టు చూస్తే.. ఇది మీకు చెడు వార్తే అవుతుంది. ఇలాంటి కల మీ ప్రేమ జీవితం దెబ్బతింటుందని, సంబంధంలో చీలిక ఉండొచ్చని సూచిస్తుంది.