నల్ల పిల్లి ఇంటికి వస్తే ఏం జరుగుతుంది?
చాలా మంది ఎక్కడికైనా వెళుతున్నప్పుడు పిల్లలు ఎదురు రావడం అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా నల్లపిల్లిని ఇంట్లోకి రాకూడదని అంటుంటారు. అసలు నల్ల పిల్లి ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా?
హిందూ గ్రంథాలలో.. ఎన్నో విషయాల గురించి వివరంగా వివరించబడ్డాయి. వీటిలో జంతువుల గురించి కూడా ఉన్నాయి. అయితే మన ఇంట్లోకి ఎక్కువగా వచ్చే జంతువుల్లో పిల్లి ఒకటి. జ్యోతిష్యం ప్రకారం.. ఇంట్లోకి పిల్లుల రాక కొన్ని సంకేతాలను చూపిస్తుంది. అయితే చాలా మంది నల్ల పిల్లులను చూస్తేనే భయపడిపోతారు. అలాగే వాటిని అశుభంగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. మన ఇంట్లోకి ఎప్పుడూ నల్ల పిల్లి వస్తూ ఉంటే అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నల్ల పిల్లి
పిల్లులు ఎన్నో ముఖ్యమైన విషయాలకు ప్రతీకలు. అవి పూర్వీకులతో కూడా సంబంధం కలిగి ఉంటాయని నమ్ముతారు. అలాగే నల్ల పిల్లులను నల్ల శక్తికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రంలో.. పిల్లులను ప్రతికూల శక్తికి మూలం అని కూడా పిలుస్తారు.
దుష్ట శక్తుల రాక..
నారద పురాణం ప్రకారం.. నల్ల పిల్లి తరచుగా ఇంట్లోకి రావడం అస్సలు మంచిది కాదు. దీన్ని అశుభంగా భావిస్తారు. నల్ల పిల్లులు.. దుష్ట శక్తుల రాకకు చిహ్నంగా భావిస్తారు.
పేదరికానికి సంకేతం
నల్ల పిల్లిని చాలా మంది ఇండ్లలోకి రానీయ్యరు. దీనికొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇది ఇంటికి రావడం పేదరికానికి సంకేతంగా భావిస్తారు.
డబ్బు నష్టం..
ఒక నల్ల పిల్లి మీ ఇంటికి వచ్చి వంటగదిలో పాలు తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అసంతృప్తికి సంకేతం
మీరు మీ ఇంట్లో నల్ల పిల్లిని పదేపదే చూస్తే అది ఏదైనా అవాంఛనీయతకు సంకేతం కావొచ్చు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చెడు జరగడాన్ని సూచిస్తుంది.
జీవితంలో సంక్షోభం..
ఇంట్లోకి నల్ల పిల్లి తరచుగా రావడం చెడు శకునంగా భావిస్తారు. నల్ల పిల్లి మిమ్మల్ని తాకడం లేదా మీపై దాడి చేస్తే.. అది ఒక వ్యక్తి జీవితంలో సంక్షోభాన్ని సూచిస్తుంది.
దుష్ట శక్తులకు చిహ్నం
ఇంట్లో నల్ల పిల్లి ఉండటం కూడా దెయ్యాలకు సంకేతంగా భావిస్తారు. పిల్లుల రాకతో ఇంట్లో దుష్ట శక్తులు కూడా వస్తాయని నమ్ముతారు.