MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ వారం టారో రీడింగ్.. ఓ రాశివారికి ఉద్యోగ ప్రాప్తి..!

ఈ వారం టారో రీడింగ్.. ఓ రాశివారికి ఉద్యోగ ప్రాప్తి..!

ఈ టారో రీడింగ్ ని మనకు ప్రముఖ జోతిష్యులు చిరాగ్ దారువాలా అందించారు. ఈ టారో రీడింగ్ లో ఆయనకు దాదాపు 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

4 Min read
ramya Sridhar
Published : May 23 2022, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషం: 
ఈ వారం మీ జీవితంలో ఇతరుల జోక్యం పెరగడాన్ని మీరు గమనిస్తారు . మీ ప్రశ్నలకు వెంటనే సమాధానాలు లభించనందున మీ ఆందోళన కూడా పెరుగుతోంది, దీని వలన మీరు తప్పు అడుగులు వేయవచ్చు. మీ కెరీర్‌లో మీకు ప్రతికూలంగా అనిపించిన విషయాలను మీరు మార్చుకోవాలి. ఈ వారం మీ భాగస్వామి మీ స్వంత వ్యవహారాల్లో ఎక్కువగా పాల్గొనవచ్చు. ఈ వారం శారీరక సమస్యలు అంటే ఏవైనా నొప్పలు వచ్చే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : - బ్లూ
లక్కీ నెంబర్ : 5

213

వృషభం:
ఈ వారం ఈ ప్రయాణంలో మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉ:ది. మీరు ప్రయాణం చేయబోతున్నట్లయితే లేదా బయలుదేరబోతున్నట్లయితే, మీరు అనేక అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఈ వారం ముఖ్యమైన పత్రాలు ,విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. పనికి సంబంధించిన విషయాలను మార్చడానికి ఇప్పుడు కొంత సమయం పట్టవచ్చు. మీ మాటలు సరైనవే అయినా, సరిగ్గా చెప్పకపోవడం వల్ల అపార్థాలు తలెత్తుతాయి. ఈ వారంలో పొట్ట సంబంధిత సమస్యలతో బాధ పడే అవకాశం ఎక్కువగా ఉంది.
లక్కీ కలర్ : ఎరుపు
లక్కీ నంబర్ : 2

313

మిథునం: 
ఈ వారం మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలను సరిగ్గా పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా మీ వనరులు, మీ ఆలోచనలను వారి  ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది.  ఈ వారం కార్యాలయంలో జరుగుతున్న రాజకీయాల కారణంగా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సమయం పడుతుంది. భాగస్వామి మీ కంటే ఇతర వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మీరు గమనించే అవకాశం ఉంది. ఈ వారం జలుబు-దగ్గు సమస్య రావచ్చు.
లక్కీ కలర్ : - ఆకుపచ్చ
శుభ సంఖ్య: 3

413

కర్కాటకం: 

ఈ వారం అనుబంధ వ్యాపారంలో విజయం సాధించాలంటే మీకు అదృష్టం చాలా అవసరం. మీకు కావలసిన జీవనశైలి కోసం, మీరు కూడా కష్టపడాలి. ఈ వారం కేవలం నిత్యావసరాలకు మాత్రమే ఖర్చు చేయండి. పని విషయంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల మీరు నష్టపోయే స్థితిలో ఉన్నారు. మీరు చెప్పేది మీ భాగస్వామి అర్థం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు. ఈ వారం కాళ్లలో విపరీతమైన నొప్పి కలిగే అవకాశం ఉంది.
శుభకరమైన రంగు: బూడిద
శుభ సంఖ్య: 6

513

సింహం: 
ఈ వారం సింహ రాశివారు  రూపాయి లావాదేవీల వల్ల నష్టపోకుండా జాగ్రత్తపడాలి. ప్రజలు తమ సమస్యలను ఈ వారం మీ ద్వారా మాత్రమే పరిష్కరించగలరు. పని ద్వారా స్థిరత్వం సాధించవచ్చు. ఈ వారం మోకాళ్ల నొప్పుల సమస్య రావచ్చు.
శుభ వర్ణం: - ఊదా( పర్పుల్)
శుభ సంఖ్య: 4

613

కన్య: 
మీ స్వంత అంచనాలు  పెరిగే అవకాశం ఉంది.మీరు చేయాలనుకుంటున్న పని సరైన దిశలో సాగుతుంది. స్నేహితుల నుండి దూరం పాటించడం ముఖ్యం. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం.  ఈ వారం ప్రేమ సంబంధాలకు దూరంగా ఉండటం మీకు మంచిది. కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.
శుభ రంగు: - నీలం
శుభ సంఖ్య: 8

713

తుల: 
ప్రస్తుతం మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి జీవితంలో సానుకూలత , ప్రతికూల సంఘటనలు తగ్గించుకోవడం చాలా ముఖ్యం.ప్రతికూల విషయాల పట్ల వైఖరి మారాలి. వ్యాపారం కోసం ఎవరి దగ్గర నుంచి రుణం తీసుకోకండి. మీ భాగస్వామి విషయంలో మీరు చేసిన తప్పును మీరు గ్రహించే అవకాశం ఉంది. భుజం నొప్పి వచ్చే అకవాశం ఉంది. 
శుభకరమైన రంగు: నారింజ
శుభ సంఖ్య: 9

813

వృశ్చికం: 
డబ్బు కారణంగా.. మీ ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది . ఏ రకమైన లావాదేవీలోనైనా పారదర్శకతను కొనసాగించడం మీకు చాలా అవసరం. బ్యాంకింగ్, రుణ రంగంలో నిమగ్నమైన వ్యక్తులు ముఖ్యమైన పత్రాలను ఉంచాలి. ఈ వారం వివాహంలో ఆనందం, శాంతిని పొందే అవకాశం ఉంది. ఈ వారం బీపీ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
శుభకరమైన రంగు: గులాబీ
శుభ సంఖ్య: 7
 

913

ధనుస్సు: 
చెడ్డ సంబంధాన్ని కలిగి ఉన్న వారితో తిరిగి సంభాషించవచ్చు.మనస్సుపై ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఈ వారం మీకు అనుకూలమైన వారం. ఉద్యోగార్థులు త్వరలో సన్నిహిత వ్యక్తి ద్వారా ఉద్యోగం పొందవచ్చు. యువకులు ఈ వారం ప్రేమ వివాహానికి ఆమోదం పొందవచ్చు. ఈ వారం కడుపు సంబంధిత సమస్యలు ఎదుర్కొనవచ్చు.
శుభ రంగు: ఎరుపు
శుభ సంఖ్య: 3
 

1013

మకరం: 
ఇతరుల బాధ్యతను మీరు ఎంతగా మోస్తున్నారో.. అది మీ బాధ్యతగా భావిస్తారు. ఈ వారం మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. కుటుంబం, పని మధ్య సమతుల్యతను కొనసాగించేటప్పుడు మీరు మీ వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి పెట్టగలరు. వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు ఈ వారం చాలా లాభదాయకమైన రోజు. మీరు పడే శ్రమ వల్ల బంధంలో మార్పు కనిపిస్తుంది.శరీర బలహీనతను అధిగమించడానికి ఆహారంలో మార్పులు అవసరం.
శుభ వర్ణం: - పసుపు
శుభ సంఖ్య: 8

1113

కుంభం: 
ఈ వారం అందరు అందుకుంటున్న సలహాలకు మీరే కారణం అయ్యే అవకాశం ఉ:ది.మీరు మిమ్మల్ని మీరు గందరగోళానికి గురిచేసుకుంటారు.  సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మీరు బాధపడవచ్చు. యువతలో పని పట్ల సంయమనం తగ్గడం కనిపిస్తుంది. చాలా మంది మీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ వారం వెన్ను నొప్పి రావచ్చు.
శుభ రంగు: తెలుపు
శుభ సంఖ్య: 1

1213

మీనం: 
ఈ వారం మీ బలాలు, సామర్థ్యాలు రెండింటినీ అంచనా వేసుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరగడాన్ని మీరు చూడవచ్చు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ఉపయోగించే వ్యక్తులపై మీ ప్రభావం కొనసాగుతుంది. ఉన్నత విద్యకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు పెరుగుతాయి. దంత సమస్యల నుండి బయటపడటానికి వైద్యుని సహాయం తీసుకోవడం అవసరం.
శుభకరమైన రంగు: గులాబీ
శుభ సంఖ్య: 2

1313
Chirag Daruwalla

Chirag Daruwalla

ఈ టారో రీడింగ్ ని మనకు ప్రముఖ జోతిష్యులు చిరాగ్ దారువాలా అందించారు. ఈ టారో రీడింగ్ లో ఆయనకు దాదాపు 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జోతిష్యం పట్ల ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. ఆయనకు జాతకం, జ్యోతిషశాస్త్ర అంచనాలలో అద్భుతమైన పాండిత్యాన్ని పొందారు. కాగా.. చిరాగ్.. ప్రతివారం మన ఏషియానెట్ కి అన్ని రాశులవారి టారో రీడింగ్ తెలియజేస్తారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved