వారఫలాలు: ఓ రాశివారు ఈ వారంలో లక్ష్మీ కటాక్షం,మొత్తం మారిపోతుంది
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పులు రావచ్చును.
daily horoscope
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
Daily Horoscope
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సమస్యలు కీలకంగా మారి మానసికంగా బాధ పెడతాయి. విద్యార్థులు తగినంత చదువుపై దృష్టి సారించాలి. వ్యాపారం నందు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగోద్వెగం తోటి చేసేటువంటి పనులలో కొత్త సమస్యలు ఏర్పడతాయి. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేయాలి. నిరాశ నిస్పృహలకు లోనవొద్దు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పులు రావచ్చును. వారాంతంలో ఆరోగ్యమునందు శ్రద్ద వహించవలెను. కొన్ని సమస్యలు మానసికంగా శారీరకంగా బాధపడతాయి . ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. ఇంట్లోవారి సూచనలు అవసరం. సూర్య నారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
శారీరకంగా మానసికంగా బాగుంటుంది. చేయి వ్యవహారాలుయందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. తలపెట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవును. పెట్టిన పెట్టుబడులకు మించి ధన లాభం కలుగుతుంది . వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యమనందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.నూతన పెట్టుబడులకు అనుకూలమైన వారం. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. పెద్దవారు యొక్క స్నేహ సంబంధాలు వలన అభివృద్ధి పనులకు శ్రీకారం చేస్తారు. వారాంతంలో బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఎదురుచూస్తున్న పని ఒకటి దిగ్విజయంగా పూర్తవుతుంది. కుటుంబపరంగా ఆనందించే అంశం ఉంది. ఆదిత్యహృదయం చదవండి .
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఉద్యోగమునందు పని ఒత్తుడులు ఉన్నా అధికమించి ఉత్సాహంగా పనిచేస్తారు. విలాస వస్తువులు కొనుగోలుకు అధిక ధనం ఖర్చు చేస్తారు. బంధుమిత్రులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. తలపట్టిన అన్ని పనులు మీరు అనుకొన్న విధంగా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార ముందు ధన లాభం కలుగుతుంది. వారాంతంలో కీలకమైన సమస్యలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కొన్ని సమస్యలు మానసికంగా బాధ పెడతాయి . ఆర్థికంగా ఇబ్బందులున్నా సరైన నిర్ణయంతో సమస్య తొలగుతుంది. లక్ష్మీదేవిని స్మరించండి, సానుకూల ఫలితాలు వస్తాయి.
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు వస్తాయి. చేయ పనులలో కోపాన్ని అదుపు చేసుకుని పని చేయాలి. పిల్లలతోటి సరదాగా గడపండి. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. ఆరోగ్య సమస్యల మీద శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగమునందు పై అధికారుల యొక్క ఒత్తిడిలో ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చుల అదుపులో ఉంచుకున్న వలెను. ఆటంకాలు ఎదురైన అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని రోజులుగా బాధ పెడుతున్న సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వారాంతంలో శుభవార్తలు వింటారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. సంపదలు వృద్ధి చెందుతాయి. ఇష్టదేవతను దర్శించండి, శుభవార్త వింటారు.
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చేయ పనుల్లో ఒత్తిడిలు శ్రమ ఎక్కువ అవుతుంది. కొన్ని సమస్యలు ఆలోచించి చేయాలి. గొడవలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. కొత్త సమస్యలు ఏర్పడి చికాకులు పుట్టించును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు పై అధికారులతోటి గొడవలు ఏర్పడగలవు. ఆరోగ్య మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. వారాంతంలో కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగమునందు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఆంజనేయస్వామిని ధ్యానించండి, మేలు జరుగుతుంది.
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
గతంలో వస్తువులు యందు పెట్టిన పెట్టుబడి రాణించక వదిలేసిన వస్తువుల యందు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సంఘమనందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగమునందు మీకు అనుకూలమైన మార్పులు. తలపెట్టిన కార్యాలలో సకాలంలో పూర్తి అవుతాయి. వారాంతంలో జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపు చేసుకుని మాట్లాడవలెను. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహశ్లోకాలు చదవండి, శాంతి లభిస్తుంది.
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
గృహవనందు శుభకార్యాలు జరుగుతాయి. అభివృద్ధి పనులకు శ్రీకారం చేస్తారు. సంఘం నందు మీ గౌరవం పెరుగుతుంది. రావలసిన బాకీలు వసూలు అవును. వృత్తి వ్యాపార ముందు ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగము నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభించును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వారాంతంలో కొత్త సమస్యలు ఏర్పడగలవు కీలకమైన సమస్యలన్నీ బుద్ధి బలంతో పరిష్కరించాలి . విలువైన వస్తువుల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారయోగం బ్రహ్మాండం. స్పష్టంగా నిర్ణయం తీసుకోండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శుభం జరుగుతుంది.
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
కొత్త వివాదాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారంలో సామాన్యమైన లాభం. పెట్టుబడి విషయంలో మిత్రుల యొక్క సలహాల మేరకు పెట్టుబడులు పెట్టవలెను. వచ్చిన అవకాశాలను అందుపించుకోవాలని. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .గృహము నందు పెద్దవారి యొక్క ఆరోగ్యంలో జాగ్రత్త వహించాలి. సంతానము విషయంలో ప్రతికూలతలు ఏర్పడతాయి. కొద్దిపాటి రుణాలు తీరుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేయు వారికి శుభవార్త వింటారు. వారాంతంలో మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. పొదుపు పథకాలు పై దృష్టి పెడతారు . ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ఇంట్లోవారితో ఆనందాన్ని పంచుకుంటారు. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కొన్ని వార్తలు వినడం వలన భావోద్వేగానికి లోనవుతారు .బంధుమిత్రులతోటి కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును. మానసికంగా బలహీనంగా ఉంటుంది. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు లో ఆటంకాలు ఏర్పడవచ్చును ,వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపించాలి. వారాంతంలో రుణ రోగములు తీరి ప్రశాంతత లభించును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ యొక్క మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికవృద్ధి బాగుంటుంది. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలుంటాయి. సూర్యాష్టకం చదివితే మేలు.
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు చేయు ప్రయత్నంలో సమయస్ఫూర్తిగా ఆలోచించి చేస్తారు. కుటుంబ అభివృద్ధికి చేయ పనులు కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన వారం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వారాంతంలో వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను .దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త. స్వయంగా పర్యవేక్షిస్తే లాభం ఉంటుంది. తొందర వద్దు. ప్రతిభతో అభివృద్ధిని సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి, ఆశయం నెరవేరుతుంది.
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారం ఆర్థిక ఇబ్బందులు ఎదురవచ్చు.భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు వాయిదా వేట మంచిది. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించవలెను . వాహన ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. వ్యాపారమునందు పెట్టుబడుల విషయంలో మిత్రుల యొక్క లేక పెద్దల యొక్క సూచనల మేరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనే వలెను. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు . వారాంతంలో సంఘమనందు చేయు వ్యవహారాలు యందువిషయం తెలుసుకొని సమయస్ఫూర్తి తోటి చేయవలెను. వచ్చిన అవకాశాల్ని అందుపుచ్చు కొనవలెను. విద్యార్థులు చదువు మీద దృష్టి సారించవలెను.
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4 ఈవారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. దురాఆలోచనలకు దూరంగా ఉండండి.కొత్త ఆదాయ మార్గాలకు అన్వేషణ చేస్తారు. వృత్తి వ్యాపారములందు ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించును .కుటుంబ అభివృద్ధి కొరకు చేయ పనులు కలిసి వస్తాయి. సోదరులతోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలవు. చేయి పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురుగును. కీలకమైన సమస్యల యందు సమయస్ఫూర్తి తోటి చేయాలి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి . వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.వారాంతంలో నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన పెట్టుబడులకు శుభ సమయం. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దేవతను ధ్యానించండి, శుభయోగాలున్నాయి.