MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఓ రాశివారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది.

Weekly Horoscope: ఓ రాశివారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది.

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు.

8 Min read
Author : ramya Sridhar
Published : Dec 31 2023, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

వార ఫలాలు : 31-12-23 నుండి 6-1-24 వరకు
 
 జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ  వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ  వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి చతుర్దాది పతి అయిన చంద్రుడు పంచమ స్థానము  సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలుంటాయి. మానసికంగా భయంగా ఉండుట. చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.వారాంతం లో  సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ సమస్యల తీరి ప్రశాంతత లభిస్తుంది.సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వ్యాపారము లో ధన లాభం పొందగలరు.

కుజుడు భాగ్యస్థానం లో సంచారము అనుకూలము కాదు.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజము నందు అవమానాలు ఎదురవగలవు. కొన్ని సంఘటనలు మానసిక ఆందోళన కలిగించును. వృత్తి వ్యాపారాల్లో  జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా బలహీనపడతారు. శారీరక పీడ పెరుగును.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి తృతీయాధిపతి అయిన చంద్రుడు ఈవారం చతుర్థ స్థానము   సంచారం. ఈ సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబము నందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.

అష్టమ స్థానము నందు సంచారము ఈ సంచారం వలన అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతారు.రుణ శత్రు బాధలు పెరుగును. ఉద్యోగం నందు స్థానచలనం రాగలదు. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. శారీరకంగానూ మానసికంగానూ బలహీనంగా ఉంటుంది. చేతిదాకా వచ్చిన అవకాశాలు జారిపోవడం వలన నిరాశ స్పృహలకు గురి అవుతారు. కొద్దిపాటి జ్వర రక్త సంబంధిత అనారోగ్యాలు రావచ్చు.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ రాశి వారికి ధనాధిపతి అయిన చంద్రుడు ఈవారం తృతీయ స్థానము   సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు ఆభరణాలు లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.వారాంతం లో అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును

కుజుడు కళత్ర స్థానము నందు సంచారము ఈ సంచారము ఇబ్బందులు ఎదురవుతాయి.
భార్యతో సఖ్యత గా ఉండవలెను. మనస్పర్ధలు మరియు కలహాలు రాగలవు జాగ్రత్త అవసరం. సమాజము నందు సంభాషణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. లేదా విరోధాలు రాగలవు. బందు మిత్ర అన్నదమ్ముల సంతానము తోటి సఖ్యత అవసరము. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యవహారాలలో ఆత్రుత తగ్గించుకుని వ్యవహరించవలెను. మానసిక బాధలు.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ రాశి వారికి జన్మరాశ్యాధిపతి అయిన చంద్రుడు ఈవారం ధన స్థానము  చంద్రసంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజం లో అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.వారాంతం లో  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

కుజుడు శత్రు స్థానము నందు సంచారము ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.
కీర్తి సంఘము నందు ప్రతిష్టలు పెరుగును. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారమ నందు ధన లాభం లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు. తలచిన కార్యాలలో విజయం లభిస్తుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. ఆర్థికంగా బలపడతారు.

కుజుడు పంచమ స్థానము నందు సంచారము ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు కలుగును.
చేయురాని పనులు యందు ఆసక్తి చూపుతారు. సంతానముతోటి సఖ్యతగా ఉండవలెను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాదోపవాదములకు దూరంగా ఉండాలి. పుత్రుల వలన మానసిక ఒత్తిడి అధికమవుతుంది.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ రాశి వారికి వ్యయాధిపతి అయిన చంద్రుడు ఈవారం జన్మ రాశి లో  సంచారం. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు.తలపెట్టిన కార్యాలు మిత్రుల సహాయ సహకారాల తో పూర్తి అగును . ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.వారాంతం లో  వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ రాశి వారికి లాభాధిపతి అయిన చంద్రుడు ఈవారం వ్యయస్థానం   సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజము లో ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.వారాంతం లో  శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అన్ని రంగాలు వారు అభివృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుజుడు చతుర్ధ స్థానములో సంచారం ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు.
అకారణంగా బంధు వర్గముతో విరోధాలు రాగలవు. వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న వస్తువులు చెడిపోవడం.కుటుంబంలో కలహాలు వలన మానసిక ఆవేదనకు గురి అవుతారు. అనేక రకమైన క్రూరమైన ఆలోచనలు కలుగును. నమ్మిన వారి వలనే మోసం జరిగే ప్రమాదం. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ఈ రాశి వారికి రాజ్యాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానము సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. వారాంతం లో  తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.


కుజుడు తృతీయ స్థానం నందు సంచారం ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.
కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొంతకాలముగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ఉపసమనం పొందగలరు. వృత్తి వ్యాపారాలలో  ధనలాభం కలుగును. ఉద్యోగము నందు అధికారుల ఆదరాభిమానం మరియు అధికారం పొందుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఈవారం రాజ్యస్థానము  లో సంచరించును. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగాలలో అధికారవృద్ధి పొందగలరు.వారాంతం లో  సమాజము లో అవమానాలు కలగవచ్చు.తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.


కుజుడు ధనస్థానమునందు సంచారం వలన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. మానసిక భయాందోళనగా ఉంటుంది .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి ఆగిపోవును. శారీరకంగా బలహీనతగా ఉంటుంది .
వ్యవహారాలలో కఠినంగా మాట్లాడడం లేదా ఆతురత వలన వ్యవహారాలు చెడిపోగలవు. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగవలెను. ఉద్యోగమునందు అధికారులు తో నిరాదరణకు గురికావడం. సమాజము నందు అవమానాలు కలగటం. రావలసిన ధనం చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవ గలవు.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఈవారం భాగ్యస్థానం లో  సంచరించును. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.వారాంతం లో  స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.

కుజుడు జన్మరాశిలో సంచారము ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు.
రక్త సంబంధిత అనారోగ్య సమస్యలు రావచ్చు. బంధు వర్గం తోటి విరోధాలు అకారణంగా కలహాలు రాగలవు. తలపెట్టిన పనులలో ప్రతిభందకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు డునుపెరుగును. ఉద్యోగము లో అధికారులతో విభేదాలు రాగలవు. శ్రమ అధికంగా ఉండి అలసట చెందుతారు. మానసిక దుఃఖం మరియు భయాందోళనగా ఉండును.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి కళత్రాధిపతి అయిన చంద్రుడు ఈవారం అష్టమ స్థానము    సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేస్తారు .మానసిక ఆవేదన వ్యక్తం చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.వారాంతం లో  ఉద్యోగం నందు అధికార అభివృద్ధి కలుగును.అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును.


కుజుడు వ్యయ స్థానమునందు సంచారము ఈ సంచారము వలన
వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరము. అకారణంగా బంధు వర్గముతో విరోధాలు రాగలవు. వృధా ఖర్చులు పెరుగును. సంఘము నందు అవమానాలు కలగవచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలతో అనుకోని వివాదాలు రాగలవు.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి షష్ఠమాధిపతి అయిన చంద్రుడు ఈవారం కళత్ర స్థానములో సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వారాంతం లో  శారీరక పీడ. అనవసరమైన ఖర్చులు పెరుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది. మానసిక భయాందోళన.

కుజుడు లాభ స్థానం నందు సంచారం ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.
వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. కొద్ది రోజులుగా పడుతున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. సమాజములో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి పంచమాధిపతి అయిన చంద్రుడు ఈవారం శత్రు స్థానం సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. గత కొద్దిరోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.వారాంతం లో  మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతో వాదోపవాదమునలకు దూరంగా ఉండటం మంచిది.


రాజ్యస్థానం లో సంచారము ఈ సంచారం వలన ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. గిట్టన వారి తోటి అపకారం జరిగే ప్రమాదం. తలపెట్టిన కార్యములలో  విఘాతములు కలుగును. పనులలో శ్రమ అధికంగా ఉండును. కష్ట నష్టాలు ఎదురవచ్చు. చెడు స్నేహాలకు వ్యసనాలకు దూరంగా ఉండవలెను.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved