వార ఫలాలు: ఓ రాశి వారు ఈ వారంలో మంచి వార్త వింటారు.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. వివిధ మార్గాల ద్వారా ధనాధాయ లభించును.
వార ఫలాలు :02 ఏప్రియల్ 2023 నుంచి 08 ఏప్రియల్ 2023 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
చేయ పనుల యందు తికమకగా వుండును. అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇష్టం లేని కార్యములు ఇష్టముగా చేయవలసి వస్తుంది. బద్ధకం కొన్ని వ్యవహారములు చేజారుస్తారు. సమాజము నందు అవమానం కలగవచ్చు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారును. స్నేహితులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారములలో అల్ప లాభాన్ని పొందుతారు. ప్రతి విషయం నందు వ్యతిరేకతలు ఏర్పడను. ఇంటా బయట సంయమనములు పాటించుట మేలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శారీరకంగా మానసికంగా బలహీనత ఏర్పడుతుంది.రుణ శత్రుబాధలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. జీవిత భాగస్వామితో మనస్పర్థలు. వారాంతంలో ఆర్థికంగా బాగుంటుంది. మనసు నందు ఆనందం కలుగుతుంది . వస్తు వాహనాలు సౌకర్యాలు లభిస్తాయి. అనే ప్రయత్నాలు ఫలించును.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
చేయి వ్యవహారమాలలో అనేక ఆలోచనలతోటి చికాకుగా నుండును.కష్టపడిన చదివిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. సంతానము నందు కొన్ని విషయాలలో ప్రతికూలత వాతావరణం. తలపెట్టిన పనులు కలసి రాకపోవట. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. ఉద్యోగమనందు అధికారులు ఆగ్రహానికి గురి అవుతారు.సంఘం నందు అప కీర్తి ఏర్పడగలరు. స్థల గృహ విక్రయాలు ఈ వారం వాయిదా వేయటం మంచిది. ఆరోగ్యం పరవాలేనిదిగా ఉండును. అన్ని వ్యవహారాలు యందు శ్రద్ధాసక్తుల తోటి ముందుకు సాగాలి. కుటుంబ అవసరాల నిమిత్తం ధనాన్ని సమర్ధించుకొనుట ఇబ్బందికరంగా ఉండును. మానసికంగా భయాందోళనలు గా ఉండును వారాంతంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగును.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఋణ శత్రు బాధలు తొలగును. బంధుమిత్రుల సహకారం లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. వివిధ మార్గాల ద్వారా ధనాధాయ లభించును. .రావాల్సిన బాకీలు వసూలగును. ఇతరులకు ఉపకారం చేస్తారు. స్థిరాస్తి వృద్ధికి ప్రయత్నాలు కలుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వచ్చును.తలచిన పనులన్నీ సకాలంలో పూర్తి అగును. అన్నదమ్ములు సహాయ సహకారాలు లభించును. వృత్తి వ్యాపారం నందు రాణిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేయ వ్యవహారమునందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మనసునందు ప్రశాంతంగా ఉండును . వారాంతంలో అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఇతరులతో విరోధాలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకోని ఖర్చులు పెరుగుతాయి.జాగ్రత్త అవసరం. కుటుంబ నందు ప్రతికూలత వాతావరణం. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మానసిక ఒత్తిడికి గురి అవుతారు. వృత్తి వ్యాపారాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంఘమునందు అనుకోని అపవాదములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా చిరాకు పుట్టించును. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. మిత్రులు శత్రువులుగా మారే ప్రమాదం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకుని అవమానాలు ఏర్పడగలరు. ఉద్యోగమనందు అధికారులతోటి విరోధాలు ఏర్పడగలవు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారములు అనుకూలంగా ఉండవు. వారాంతంలో అవసరానికి తగిన డబ్బు లభించగా ఇబ్బంది పడతారు. ప్రతి పని యందు వ్యతిరేకతగా ఉండును.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
ధనాదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహకారంతో వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఇతరులకు సహాయ సహకారాలు సత్కార్యాలు . స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబం సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆగిపోయిన వ్యవహారములు పరిష్కారం అవును. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల కలయిక. సంతానం అభివృద్ధి కలుగును. సమాజము నందు సన్మానాలు గౌరవం లభించును. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాల లాభకరంగా ఉండును. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. అనుకోని కొన్ని సంఘటనలు ఆనందం కలిగించును. వారాంతంలో నూతన వస్త్రాభరాణలు కొనుగోలు చేస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని విధాల శుభం జరుగుతుంది.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
సోదరులతో విభేదాలు రాగలవు. అనవసరపు ఖర్చులు పెరుగును. .ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. రుణ శత్రుబాధలు వలన కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. భూ గృహ క్రయవిక్రయాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. సంఘం నందు మరియు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించవలెను. చేయు పనులలో బద్దకం ఏర్పడి పనులు సకాలంలో పూర్తి చేయలేరు. మనసునందు భయాందోళనగా ఉంటుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా కోపానికి గురి అవుతారు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. విరోధాలకు దూరంగా ఉండవలెను. చేయు వ్యవహారమునందు సరైన ఆలోచనలు తోటి నిర్ణయాలు తీసుకుని చేయవలెను. వారాంతంలో ఉద్యోగములు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. విద్యార్థులకు అనుకూలం. మనసు నందు ఆనందంగా గడుపుతారు.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలుగును. సంతానము విద్య ఉద్యోగంలో రాణిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. కుటుంబము . స్థిరాస్తి క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుంది. సర్వత్ర విజయం చేకూరుతుంది. ఇతరులతో మంచి సంబంధాలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఉద్యోగము నందు అభివృద్ధి కనబడును. వారాంతంలో శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగవనందు సహోదయోగులతో సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించును. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందగలరు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అగును. గృహము నందు శుభ కార్యాచరణ. రుణ శత్రుబాధలు తీరి ప్రశాంతత లభించును. వృత్తి వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యం అనుకూలించును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. ధనాధాయ విషయంలో లోటు ఉండదు. మంచి మాటికారతరం తోటి ఇతరులను ఆకట్టుకుంటారు. వారాంతంలో వ్యవహారాలు యందు ఇబ్బందులు కలుగును. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగును.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
బంధు మిత్రులతో కలహాలు ఏర్పడవచ్చు . మానసిక ఒత్తిడి పెరుగును. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణము చేయవలసి వస్తుంది. వాహనం ప్రయాణమునందు జాగ్రత్త వహించవలెను. ప్రభుత్వ సంబంధిత కార్యాల్లో ఇబ్బందులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించవలెను. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఉద్యోగం నందు అధికారులతో సమస్యలు రాగలవు.గృహనిర్మాణ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానము నందు విరోధములు కలహాలు ఏర్పడతాయి. శారీరక మానసిక బలహీనత ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. వారాంతంలో భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగును. ధర్మకార్యాలలో పాల్గొంటారు.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అతి కష్టం మీద పనులు పూర్తగును.భూ గృహ క్రయవిక్రయాల యందు ఆలోచన అవసరం. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. కుటుంబ నందు ప్రతికూలత వాతావరణం. మానసిక ఒత్తిడి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అవసరమైన ఖర్చులు పెరుగును.ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు. కొన్ని సంఘటనలు మానసిక ఆవేదనకు గురి అవుతారు. అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. ఆర్థిక సహకారాలు తక్కువగా నుండును. కుటుంబవనందు పెద్దల యొక్క విషయాలలో జాగ్రత్త అవసరము. రావలసిన బాకీలు విషయంలో స్తబ్దత ఏర్పడును. ఇతరులతోటి వినోదం ఏర్పడిన విజయం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల ఆదరభిమానాలు పొందగలరు.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
శుభవార్తలు వింటారు. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. గృహమునందు శుభ కార్యాచరణ. ఆదాయ మార్గాలు బాగుంటాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ అభివృద్ధి కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. ఆరోగ్యం అనుకూలించును. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. అన్ని విధాల సుఖ సౌఖ్యములు పొందగలరు. వారాంతంలో శుభా శుభ ఫలితాలు పొందగలరు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసు నందు ఆనందంగా గడుపుతారు.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
ఆదాయ మార్గాలు బాగుంటాయి. వృత్తి వ్యాపారాల యందు లాభం. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించును. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూ,గృహ క్రయవిక్రయాల యందు ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. విద్యార్థులకు అనుకూలం. దైవ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వారాంతంలో శారీరక మానసిక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తికాక చికాకు పుట్టించును