MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఓ రాశివారికి ఊహించని లాభాలు, ఉద్యోగాల్లో పదోన్నతి..!

Weekly Horoscope: ఓ రాశివారికి ఊహించని లాభాలు, ఉద్యోగాల్లో పదోన్నతి..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం అనుకున్న పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 28 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం  కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాల  పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. సన్నిహితులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214


వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు.  నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు తీరతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోగతి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. శారీరక రుగ్మతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం కొన్ని ముఖ్య పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని కళానైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. బాధ్యతలు పెరుగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం అనుకున్న పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో  పరపతి పెరుగుతుంది. గృహం, వాహనాలు కొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి అవసరాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. సోదరులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆరోగ్య సమస్యలు  కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో  శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో విజయం. సన్నిహితులతో తగాదాలు నెలకొంటాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. శుభకార్యాలపై మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సంతోషకరంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన రీతిలో పదవులు దక్కవచ్చు. వారం చివరిలో బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ముఖ్య పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది.  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. పెట్టుబడులు అనూహ్యంగా లభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో∙నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరతాయి.  వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  వ్యాపారాలు అనుకున్న మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు శుభవార్తలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాట విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. పైస్థాయి ప్రశంసలు సైతం అందుతాయి. రాజకీయవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. అనారోగ్యం.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం  పనుల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒక ముఖ్య సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1114


కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అంది ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. కళారంగం వారికి  ఊహించని అవకాశాలు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1214


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు అనుకోకుండా దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ నిర్ణయాల కోసం బంధువులు ఎదురుచూస్తుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కివచ్చే సూచనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు సఫలమవుతాయి.  ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో విభేదాలు. శ్రమ తప్పకపోవచ్చు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1314

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved