వార ఫలాలు: ఓ రాశివారికి వ్యాపారంలో సానుకూల ఫలితాలొస్తాయి
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
చేయ ఉద్యోగాలలో అధికారులు ఉన్నతమైన హోదాను గౌరవాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు వర్తకులకు లాభంచును. సమాజము నందు ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడును. సంఘంలో పలుకుబడి మీ మాటకు గౌరవం పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలు కలిసి వచ్చును.వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు లభిస్తాయి. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి.మొండి బాకీలు లౌక్యం తో వసూలు చేసుకోవాలి.విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. సహోదర సహోదరీ వర్గం తో తత్ సంబంధాలు బలపడతాయి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. బంధువర్గం నుండి విరోధము ఏర్పడుతుంది.విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోవచ్చును. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమగును. సంఘంలో సమయానుకూలంగా వ్యవహరించాలి.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఉద్యోగాలలో చికాకులు.అధిక శ్రమ.ఆర్ధిక ఇబ్బందులు.భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.అకారణంగా కోపం.మనస్సు నందు ఆందోళన.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.బంధు మిత్రులతో కలహాలు.ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. ఇతరుల నుండి ఋణము ఆశించవలసి వస్తుంది.ప్రయాణములు అంతగా కలిసి రావు.మానసికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.మనస్సు నందు ఆందోళనకరంగా ఉంటుంది.గృహము నందు చికాకులు.శ్రమాధిక్యం.అనుకోని ప్రయాణాలు.బంధు మిత్రులతో కలహాలు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.జీవిత భాగస్వామితో చికాకులు.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఉద్యోగాలలో అధికారుల వలన చికాకులు.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
చేయు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశములకు బదిలీ పొందుతారు. జీవితంలో స్థిరత్వం కలుగుటకు ఆలోచనలు చేస్తారు.ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.ఉద్యోగ సంబంధమైన విషయాలు లో మంచి మార్పులు రాగలవు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన అభివృద్ధి ఆలోచనలు గూర్చి బంధుమిత్రులతో కలిసి చర్చిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు పొందుతారు.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
12ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తత అవసరం. ఎటువంటి విషయంలో ఆవేశం పనికిరాదు.మిత్రులు కూడా శత్రువులు అవుతారు. వ్యాపారంలో అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.నమ్మిన వారి వలన మోసపోవడం.చెడు స్నేహాలు కు దూరంగా ఉండండి.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.అకారణంగా కోపం.బంధువర్గంలో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఉద్యోగస్తులకు పదవీ లాభం ఉంటుంది.ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. చేయు ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.స్వయంకృషితో కష్టపడి పనుల్లో విజయం సాధిస్తారు.అనుకోని కలహాలు.చెడుస్నేహాలు దూరంగా ఉండటం మంచిది.గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి.నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.సంతాన విషయంలో శుభవార్త వింటారు.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.చేయు వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది.సంఘంలో గౌరవం లభిస్తుంది.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గృహము నందు శుభకార్యాల ప్రస్తావన. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
స్థిరాస్తులు విషయంలో తగాదాలు ఏర్పడును. చిన్నపాటి గాయాలు జబ్బులు చేయును.వివాహ విషయములో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడతాయి.కొన్ని రంగాల వారికి చురుకుదనం తగ్గి బద్ధకము పెరుగుతుంది. నూతనంగా ప్రారంభించిన కార్యక్రమంలో నిరుత్సాహంగా ఉందురు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఆతురత వలన కష్టాలు నష్టాలు ఎదురవుతాయి.స్త్రీలు తో తగాదాలు వచ్చే అవకాశం. అనుకున్న పనులు లో స్థిరమైన నిర్ణయం లేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలిస్తాయి. మానసిక అశాంతి తొలగును. భార్యాభర్తల మధ్య ఉండే తగువులు సర్దుబాటు అవును.రావలసిన పాత బాకీలు వసూలు అవును.ప్రభుత్వముచే లేదా పండితులచే సన్మానము పొందుదురు.సంఘంలో గౌరవ ప్రతిష్టలు.నూతన పరిచయాలు. నూతన వస్తు వాహన ప్రాప్తి.చేయు వృత్తి వ్యాపారాలలో ధనలాభం.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.గృహనిర్మాణ ఆలోచనలు నెరవేరుతాయి.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఇదివరకు చేసిన రుణం కొంత తీర్చేదరు. విద్యార్థులు మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులు కాకపోయినప్పటికీ రెండో ప్రయత్నంలో కచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు.
సోదరి సహాయ సహకారాలు లభించును.వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొంత కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.వృతి వ్యాపారాలు అభివృద్ధి కోసం కృషి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి.బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
స్త్రీలు కు ఉద్యోగాలు లో అధికారులు యొక్క వేధింపులు ఒత్తిడి కలుగును. వృత్తి వ్యాపారం లందు ఊహించిన స్థాయిలో లాభాలు ఉండవు.విద్యార్థులకు ఉన్నత ర్యాంకులు వచ్చుట కష్టం. అంది వచ్చిన అవకాశాలు జారవిడిచెదరు.చేసే పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు.ఆర్ధిక ఇబ్బందులు కొంత చిరాకు కలిగిస్తాయి.మనస్సు నందు అనవసరమైన ఆందోళనకరంగా ఉంటుంది.ఏ పని యందు ఆసక్తి లేకపోవడం.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.ఇతరుల విషయంలో జోక్యం తగదు.కొంత మేర రుణాలు చేయవలసి రావచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి రావు. విమర్శించేవారు అధిక మవుతారు.ఏ పనైనా ఒకటికి పలుమార్లు చేయవలసి వచ్చును.ఇష్టం లేని ప్రయాణం చేయవలసి వస్తుంది.ఆదాయానికి మించిన ఖర్చులు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు. మిత్రులతో కలహాలు.మనస్సు నందు అనవసరమైన ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు అనుకోని బదిలీ .చేయు పని యందు ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.మానసిక ఆందోళన చెందుతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.
.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
క్లిష్టమైన సమస్యలు ను ధైర్యముతో ఎదుర్కొంటారు.వివాహాది శుభకార్యములు తలచిన కార్యములు నెరవేరుట జరుగును. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి అవుతాయి.ఉద్యోగులు అధికారులు మన్ననలు పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.ఉద్యోగులకు అనుకూలమైన స్థానచలనాలు.గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు తగిన ప్రణాళికలను అమలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు.