MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వార ఫలితాలు: ఓ రాశి వారికి వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు

వార ఫలితాలు: ఓ రాశి వారికి వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు

5 Min read
Author : ramya Sridhar
Published : Sep 18 2022, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ వారం మీకు అన్ని విధాలా  శుభదాయకం. అన్నింటా విజయాలే. ఆదాయం గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం. మానసిక ఆందోళన. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. హనుమాన్‌ చాలీసా పఠించండి. 
 

313
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మీకు పరీక్షా సమయం.   వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. కుటుంబము నందు శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కొంతమేర రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

413
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు. కలిసి వచ్చినా కొన్ని ఇబ్బందులు తప్పవు.  ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధన లాభం. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. సంతానమునకు ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు మార్గాలు అన్వేషించండి. శారీరక అలసట. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య కొంతవరకు చికాకు కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

513
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం సమస్యల మయం. ఆదాయానికి మించిన ఖర్చులు. మానసిక ఆందోళన. శారీరక శ్రమ అధికంగా ఉండును. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు.  గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సహోద్యోగుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది.  ఇతరుల విషయంలో జోక్యం తగదు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. మీ యొక్క శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

613
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం మీకు శుభ సమయం.  కాస్త జాగ్రత్తలతో మీకు కలిసి వస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.  కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. మొండి బాకాయలు వసూలు అగును. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఎదురైన సమస్యలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

713
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారం మీరు శుభవార్తలు వింటారు.స్తంభించిన పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో పై అధికారుల వలన కొంత ఇబ్బందులు ఏర్పడను. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు. వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శివాష్టకం పఠించండి.

813
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారం ఓ కొత్త మార్పులు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. నూతన కార్యక్రమమునకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన. దానధర్మాలు చేస్తారు. కుటుంబం నందు కొంత చికాకు ఏర్పడును. భాగస్వామ్య వ్యాపారాలు లేదా మిత్రులతో తెలివిగా వ్యవహరించవలెను. సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆదిత్య హృదయం పఠించండి.

913
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉంది. జాగ్రత్త. అయితే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయిక. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. సంఘమునందు కలహాలు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. మానసికంగా బాధ. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. గణపతికి అభిషేకం చేయండి.

1013
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం మీరు నమ్మిన వారితోనే సమస్యలు వస్తాయి. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం నందు అనుకూలమైన ప్రమోషన్లు. చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు . చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.  సంఘమునందు తెలివిగా వ్యవహరించండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రమాధిక్యం. సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.

1113
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కుటుంబం నందు శుభకార్యచరణ. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలుపొందుతారు. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. స్తంభించిన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు.  వ్యాపారాల అభివృద్ధి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత భాగస్వామితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. భూ గృహ కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. శివాష్టకం పఠించండి.

1213
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారం మిమ్మల్ని చిరకాలంగా వేధించే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చెబుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. గృహ నిర్మాణ యత్నాలకు అనుకూలం. ప్రయాణాల్లో నూతన మిత్రులు కలయిక.  ఈశ్వరారాధన మంచిది.

1313
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ వారంలో వ్యాపార లావాదేవీలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులైనా అధిగమిస్తారు.చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం. చెడు స్నేహాల వలన కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగం నందు పై అధికారుల వలన చికాకులు. జీవితం గురించి కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతాన మూలకంగా లాభాలు. రుణాలు కొంతమేర తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. విష్ణుధ్యానం మంచిది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved