MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ వారం ఈ రాశులవారికి వ్యాపారాల్లో లాభాలు.. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు!

ఈ వారం ఈ రాశులవారికి వ్యాపారాల్లో లాభాలు.. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు!

ఈ వార ఫలాలు 17.08.2025 నుంచి 23.08.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

4 Min read
Author : Kavitha G
Published : Aug 17 2025, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. వ్యాపారాలలో భాగస్వాముల సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిదికాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో దాయదులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతానం వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వారం మధ్యలో డబ్బు పరమైన సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి.  

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తొలగుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వారం చివరన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు తెప్పిస్తాయి. 

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మీ శ్రమ ఫలించి లాభాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనువు పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం చివరిలో కొన్ని పనులు సకాలంలో పూర్తికాక చికాకు పెరుగుతుంది. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలు తొలగిపోతాయి. మిత్రులతో అకారణంగా కలహాలు కలుగుతాయి. 

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొన్ని రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. 

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగులు కొన్ని వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజకనంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.  

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని ట్రాన్స్ ఫర్ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. చిన్న తరహా పరిశ్రమలవారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.  

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. మిత్రుల సహాయంతో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో బంధువులతో అకారణంగా వివాదాలు వస్తాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వారం ప్రారంభంలో మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాల నుంచి బయటపడి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. వారం మధ్యలో బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగాలలో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. 

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పాతమిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో సోదరులతో స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
August Rasi Phalalu: ఆగస్టు నెల ఏ రాశివారికి కలిసివస్తుందో తెలుసా?
Recommended image2
August Horoscope: ఆగస్టులో అరుదైన గ్రహ యోగం.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved