Your Weekly Horoscopes: ఓ రాశివారికి ఖర్చు అధికమైనా ధనలాభం, వాహనయోగం
Your Weekly Horoscopes: ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం వ్యాపారంలో పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు వలన ఇబ్బందులకు గురవుతారు.ఋణ బాధలు పెరుగుతాయి .గృహములో అనేక సమస్యలతో చికాకుగా ఉంటుంది
వార ఫలాలు : 14-1-24 నుంచి 20-1-24 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
సంతానంతో అకారణంగా కలహాలు రాగలవు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.భూ గృహ క్రయ విక్రయాల వాయిదా వేయడం మంచిది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యంత్ర పనిముట్లు తో తగు జాగ్రత్తలతో పని చేయాలి.
తృతీయ షష్ఠమాధిపతి అయిన బుధుడుభాగ్య స్థానంలో సంచారం. ఈ సంచారం ప్రతికూలంగా ఉంటుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. తలచిన కార్యాలు లో ఆటంకాలు ఏర్పడి ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగాలలో అధికారులు తో చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. అపకారి ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఉపయోగం లేని ఖర్చులు పెరుగుతాయి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఈవారం సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. చేయు వ్యవహారం నందు విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సమాజంలో అరుదైన గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలించును. చేయు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకూలమైన ఫలితాలు పొందగలరు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పై అధికారులతో ఆదరణ పొందగలరు.
ధన పంచమాధిపతి అయిన బుధుడుఅష్టమ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలను పొందగలరు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. మానసిక భయం గా ఉండటం. సంతానం వలన లాభాలు పొందగలరు. ఉద్యోగాలలో అధికార వృద్ధి కలుగును. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈవారం అభివృద్ధి గూర్చి బంధుమిత్రులతో చర్చిస్తారు. స్థిరాస్తి విషయంలో లో చికాకులు తొలుగును.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆభరణాలు కొనుగోలు కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తగును. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.
జన్మ చతుర్ధాధిపతి అయిన బుధుడుకళత్ర స్థానంలో సంచారం. ఈ సంచారం వలన దుష్ఫలితాలు ఏర్పడగలవు.అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగాలలో అధికారులు తో విరోధాలు ఏర్పడును. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టను. తలపెట్టిన కార్యాలు ప్రారంభంలోనే ఆగిపోవడం. అనవసరమైన కోరికలు పెరిగి వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం. ఇతరులతో కలహాలు రాగలవు.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
ఈవారం వ్యాపారంలో పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు వలన ఇబ్బందులకు గురవుతారు.ఋణ బాధలు పెరుగుతాయి .గృహములో అనేక సమస్యలతో చికాకుగా ఉంటుంది .అనేక సమస్యలూ ఆలోచనలతో మనస్సు ఉద్రేకంగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నమ్మినవారు వలన మోసం జరగవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి భిన్నాభిప్రాయాలు రాగలవు.
జన్మ చతుర్ధాధిపతి అయిన బుధుడుశత్రు స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సౌకర్యం లభిస్తుంది. వస్త్ర ధనధాన్యాది లాభాలు. తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది. సమాజంలో ప్రజాభిమానం పొందగలరు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. బంధు వర్గం తో సహాయ సహకారాలు లభిస్తాయి.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
ఈవారం జీవిత భాగస్వామి తో అకారణంగా మనస్పర్థలు. వృధా ప్రయాణాలు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు. వ్యవహారాలలో ఆతురత.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అనారోగ్య సమస్యలు రాగలవు. అధికారులు తో మనస్పర్థలు.అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.వచ్చిన అవకాశాన్ని చేజారుస్తారు.చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రతికూల వాతావరణం. సంతానంతో విరోధాలు. అకారణ కోపం.
ధన లాభాధిపతి అయిన బుధుడుపంచమ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన దుష్ఫలితాలు కలుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు ఏర్పడతాయి. కుటుంబం పెద్దలు తో భిన్నాభిప్రాయాలు వస్తాయి.వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. మానసికంగా శారీరకంగా అలసటలు పెరుగుతాయి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈవారం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.విలాసవంతమైన వస్తువులు వినోదాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. సమాజములో ప్రజాభిమానం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉండును.మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలించి లాభించును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
జన్మ రాజ్య అధిపతి అయిన బుధుడు చతుర్ధ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కీలకమైన సమస్యల్లో బుద్ధి చాతుర్యము చూపిస్తారు. తలపెట్టిన అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అకారణంగా సంతానంతో కలహాలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఇంటా బయట ప్రతికూలత వాతావరణం ఏర్పడును. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు .ఎంతో కొంత రుణం చేయవలసి వస్తుంది. ఉద్యోగం నందు అధికారులు తో సమస్యలు ఏర్పడగలవు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు. వ్యాపారంలో పెట్టుబడి ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. శారీరకంగా బలహీనం గా ఉంటుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.
భాగ్య వ్యయాధిపతి ఆయన బుధుడు తృతీయ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల వాతావరణం. బుద్ధి కుశలత తగ్గి వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని సంఘటనల వలన మానసిక ఆందోళన పెరుగుతుంది. వ్యాపార పెట్టుబడి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకొనవలెను. ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా విరోధాలు ఏర్పడును. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి కాక చిరాకు పుట్టించును. శత్రు వర్గము తో ప్రమాదం.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈవారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం లభిస్తుంది .ఇతరులకు అపకారం చేసే ఆలోచనలకు దూరంగా ఉండండి.సంతాన అభివృద్ధి. ఉద్యోగాలలో అధికార వృద్ధి కలుగును. బంధుమిత్రుల సమాగమం. అధికారుల ఆదరణ పొందగలరు. అన్ని విధాల అభివృద్ధి కలుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి ఆనందం కలుగచేస్తుంది. సమాజంలో మీ విలువకు తగ్గ గౌరవం లభిస్తుంది.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా లాభపడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలిస్తాయి.
అష్టమ లాభాధిపతి అయిన బుధుడు ధనస్థానము లో సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు చేకూరుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో పూర్తి కాగలవు. వ్యవహార విషయాల్లో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. సమాజంలో అపవాదము కలగవచ్చు.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈవారం చేసే పని యందు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చు ఏర్పడగలవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క వ్యవహారాలలో హామీలకు దూరంగా ఉండవలెను. రావలసిన బాకీలు వసూలు అవ్వక మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కోపావేశాలు నియంత్రించుకోవాలి. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. రుణాలు చేసే విషయంలో జాగ్రత్త అవసరం.
కళత్ర రాజ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో సంచారం. ఈ సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు వర్గము తో అకారణంగా విరోధాలు ఏర్పడును. చెడు సావాసాల కు దూరంగా ఉండాలి. శత్రు వర్గం తో అపకారం జరగవచ్చు .విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనుల్లో బుద్ధి స్థిరత్వం లేక ఆటంకాలు ఏర్పడతాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. జూదాలు లకు వ్యసనాలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించుట కష్టతరం అవుతుంది.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈవారం అనుకూలమైన వాతావరణం.కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
షష్ట భాగ్యాధిపతి అయిన బుధుడు వలన వ్యవహారాలలో తికమకగా ఉండటం. భయాందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబంలో చిక్కులు. సమాజంలో అపనిందలు అపవాదము ఎదుర్కోవలసి వస్తుంది. శతృభీతి అధికముగా ఉండును. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. ఆదాయమును మించి అధికముగా ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా వచ్చే ఉద్రేక కోపాన్ని తగ్గించుకోవాలి.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈవారం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించును. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వార్త వింటారు.వైవాహిక జీవితం ఆనందంగా సాగును. ఉద్యోగాలలో సహోద్యోగులు యొక్క ఆదరణ అభిమానం పొందగలరు.అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.
పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు వలన వృత్తి వ్యాపారాలు గతం కన్నా లాభసాటిగా ఉండును. సంతానం వృద్ధిలోకి వచ్చును. సంతానముకు ఎదురుచూసి వారికి శుభవార్త వింటారు. సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ధైర్యంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో సఖ్యత లభించును.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈవారం వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.ఇంటా బయటా అధికమైన ఒత్తిడిలు పెరుగుతాయి . నిత్యవసరాలకు కొంత ఋణములు చేయవలసి వస్తుంది. అకారణంగా బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. అకాల భోజనం. మనసునందు ఆందోళనగా ఉంటుంది. జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు రాగలవు.
చతుర్ధ కళాత్రాధిపతి అయిన బుధుడు వలన మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియని స్థితిలో ఉంటుంది కావున మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీరు చేయని తప్పులకు నెపము మీపై పడును. తగు జాగ్రత్త అవసరం. దగ్గరి బంధువులు లేదా మిత్రులు ను ఓదార్చ వలసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.