MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Astrology
  • Your Weekly Horoscopes: ఓ రాశి వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంది,శుభవార్తలు వింటారు

Your Weekly Horoscopes: ఓ రాశి వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంది,శుభవార్తలు వింటారు

Your Weekly Horoscopes: ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ వారం శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారము నందు ధనలాభం. కొత్త ఆలోచనలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. 

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 10 2024, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

వార ఫలాలు : 10 -03-2024 నుండి 16-03 -2024  వరకు
 
జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
కొత్త ఆలోచనలు కలసి వస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో  ఊహించని ధన లాభం పొందగలరు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు ఉపకారం చేస్తారు.ఉద్యోగస్తులకు పై అధికారులు సహాయం లభిస్తుంది. భూ గృహ క్రయవిక్రయాలు అనుకూలం. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. 


 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
శుభకార్యాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాల్లో  ఆశించిన లాభం పొందగలరు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.ఉద్యోగాలలో సహనం ఓర్పు అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలం. గృహ నిర్మాణ కార్యక్రమాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగవలెను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాలలో ధన లాభం. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల కలయిక. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. సంఘంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాకుండా  అభిప్రాయం ఒకరికి ఒకరు గౌరవించుకోవాలి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది . ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలు  లో అధికారుల తో వ్యతిరేకతలు. మానసిక శారీరక బాధలు పెరుగుతాయి . అనవసరమైన సంభాషణల తో కాలయాపన చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. గృహ వాతావరణం అనుకూలంగా ఉండదు. కుటుంబసభ్యులతో వాదనలు చేయకూడదు.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
బంధుమిత్రులతో మనస్పర్థలు. చేసే పనిలో ఆసక్తి లేక పోవుట. మనసు నందు ఆందోళనగా ఉండును. వ్యాపారం పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం చేయాలి. ఉద్యోగస్తులకు పై అధికారులు ఒత్తిడులు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది మనశ్శాంతి లోపిస్తుంది.ఏ పని చేసినా కలిసి రాకపోవడం. మానసికంగా బాధ. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొంతమేర రుణం చేయవలసి వస్తుంది.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారము నందు ధనలాభం. కొత్త ఆలోచనలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. బంధు మిత్రుల కలయిక. నిలిచిపోయిన పనులు పూర్తగును. విద్యార్థులు విద్య యందు శ్రద్ద వహించవలెను.ఉద్యోగంలో  ఇబ్బందులు ఏర్పడిన అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.  కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం.గృహమునందు శుభకార్యం జరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేయు వృత్తి వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది. గృహ నిర్మాణములు ముందుకు సాగుతాయి. పొదుపు మార్గాలు అన్వేషణ చేస్తారు.ప్రారంభించి నిలిచిపోయిన పనులు ప్రయత్నంతో పూర్తి చేస్తారు.ఆరోగ్యం కుదుటపడి మనశ్శాంతి లభిస్తుంది.ఆకస్మిక ధన లాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరుల విషయంలో జోక్యం తగదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగవలెను. మనస్సు నందు ఆందోళన. వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బంది పెట్టను. సంతాన మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మానసిక ఒత్తిడి. పనులలో ఆటంకాలు మరియు ఆరోగ్య పరంగా  ఇబ్బందులు ఏర్పడతాయి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఉద్యోగాలు లో పని ఒత్తిడి అధికంగా ఉండును. మీ పక్కన ఉండే వారు మీకు అపకారం ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. బంధు మిత్రులతో అనుకోని గొడవలు ఏర్పడగలవు. సంతాన విషయంలో తగు శ్రద్ధ వహించవలెను.వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులతో కలహాలు. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రభుత్వ సంబంధించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు నూతన విద్యల యందు ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.గత  కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.ఇతరులకు సహాయ పడతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు. నూతన ఆలోచనలు కలసి వస్తాయి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురవుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.బంధుమిత్రులతో మనస్పర్థలు రాగలవు.గృహంలో కొన్ని సమస్యలు బాధించును.ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి వలన చికాకులు కలుగును. మానసిక ఒత్తిడి ఆందోళనగా ఉండటం. శారీరక శ్రమ పెరుగుతుంది .కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
తలపెట్టిన పనులు నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.నూతన వస్తు వాహన ప్రాప్తి.ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా గడుపుతారు. నూతన ఆలోచనలు కలసి వస్తాయి. సంతాన విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. గృహంలో శుభకార్యములు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. పని భారం ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇతరులతో వాదనలు వలన ఉద్రిక్తతలకు దారి తీయను. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం మంచిది. చెడు సావాసాలు చేయడం వలన అధికంగా ధనం ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు రాగలవు. తలపెట్టిన కార్యాలలో అధిక ప్రయత్నం చేయడం వలన సానుకూల ఫలితాలు లభిస్తాయి.వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి .వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Recommended image2
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Recommended image3
బుధుని వల్ల సెప్టెంబర్ 18 వరకు 4 రాశుల వారికి కలహాలు, ఆర్ధిక కష్టాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved