MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది..!

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ వారం చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 21 2022, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరపతి మరింతగా పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో  వృథా ఖర్చులు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తొలగి, కొంత ఊరట చెందుతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఎదురవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాల యత్నాలలో పురోగతి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఆర్థిక విషయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు  పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ ఊహలు నిజం కాగలవు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. మిత్రులతో కలహాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం పనితీరుతో, మాటనేర్పుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఏపనినైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. తీర్థయాత్రలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల బాధ్యతలకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం కొత్త విషయాలు తెలుస్తాయి.  మీ అభిప్రాయాలు బంధువులకు నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనూహ్యంగా ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత స్థానాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం క్రమేపీ తొలగుతాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు. మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. అందర్నీ ఆశ్చర్యపరచే నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పాత బాకీలు వసూలవుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఎటువంటి సమస్యనైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభిస్తాయి.  ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొన్ని వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. సంఘంలో  గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. బంధువులతో తగాదాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలపై బంధువులతో సంప్రదిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలను విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం.  కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం పనుల్లో విజయం సా«ధిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు, లాభాలు తథ్యం. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. రాజకీయ వర్గాలకు సాంఘిక గౌరవం. వారం మధ్యలో ఖర్చులు అధికం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలలో చికాకులు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సోదరీ సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక హామీలపై తొందరవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల మిత్రులు కొంత సహాయపడతారు.  వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

1214

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ సమర్థత వెలుగులోకి  వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో శ్రమ తప్పదు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved