MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలితాలు తేదీ 6 ఆగష్టు శుక్రవారం నుండి 12 ఆగస్టు గురువారం 2021

వారఫలితాలు తేదీ 6 ఆగష్టు శుక్రవారం నుండి 12 ఆగస్టు గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఎంతటి పరిస్థితినైనా చాకచక్యంగా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. 

5 Min read
Author : ramya Sridhar
| Updated : Aug 06 2021, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి : ఈ వారం ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.

చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు అభివృద్ధిదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు వివాదాలు కొంత పరిష్కారమవవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
214
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఎంతటి పరిస్థితినైనా చాకచక్యంగా అధిగమించి ముందుకు సాగుతారు.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఎంతటి పరిస్థితినైనా చాకచక్యంగా అధిగమించి ముందుకు సాగుతారు.

. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులలో నూతనోత్సాహం. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు ముందుకు కొంత నిరుత్సాహపరిచినా క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యస్థితి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి.

సోదరుల నుంచి సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. వారం చివరిలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
414
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి.

ఉద్యోగాలలో నెలకొన్న సమస్యల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు అనుకూల సమాచారం అందుతుంది. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

పట్టుదల, ధైర్యంతో సమస్యలు అధిగమిస్తారు. సన్నిహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. అయితే, విధుల్లో కొంత అప్రమత్తత అవసరం. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. మానసిక అశాంతి. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే అనుకూలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు బాధ్యతలు కొంత తగ్గి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.

అవసరాలకు సరిపడు ధనం సమకూరుతుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందినా సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో సహచరులతో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ఖర్చులు అధికం. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం నూతన వ్యక్తుల పరిచయం ఉపకరిస్తుంది. అనుకున్న వ్యవహారాలు నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తారు.

ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం నూతన వ్యక్తుల పరిచయం ఉపకరిస్తుంది. అనుకున్న వ్యవహారాలు నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి సంతోషకర సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి అప్పులు తీరతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబసమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరించడంలో పురోగతి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినా ఆత్మవిశ్వాసంతో వాటిని పరిష్కరించుకుంటారు.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినా ఆత్మవిశ్వాసంతో వాటిని పరిష్కరించుకుంటారు.

రాబడికి ఇబ్బందులు తొలగి అవసరాలు తీరతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మిత్రులు, బంధువుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో అనుకూల పరిస్థితులు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడతాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు సైతం నచ్చడం విశేషం.

కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడతాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు సైతం నచ్చడం విశేషం.

పలుకుబడి, హోదాలు ఉన్న వ్యక్తులు పరిచయమవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూవివాదాలు పరిష్కరించుకుని లబ్ది పొందుతారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న విధుల్లో చేరతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. నీలం, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1214
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. దీక్ష, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది.

సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆస్తుల విషయంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. బంధువుల కలయిక. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
<p>డా.యం.ఎన్.చార్య -</p>

<p>డా.యం.ఎన్.చార్య -</p>

 ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా లక్కీ.. త్వరగా ధనవంతులు అవుతారు!
Recommended image2
Rare Yoga: శని కలయికతో అరుదైన రాజయోగాలు.. వారం ఓపిక పడితే వీరి విజయాన్ని ఎవరూ ఆపలేరు..!
Recommended image3
Rice bag: వంటింట్లోని మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి.. మీ అదృష్టమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved