వారఫలాలు సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 10 వరకు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అవసరాలకు ఏ మాత్రం లోటురాదు. వాహనాలు, భూములు కొంటారు. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ వారం నిరుద్యోగుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రత్యర్థులు సైతం మీపై ప్రేమ చూపిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. మీ ఊహలు కొన్ని నిజం కాగలవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ వారం వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సంతోషకరమైన సమాచారం. ఏ పని చేపట్టినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొంతకాలంగా రావలసిన సొమ్ము అంది ఆశ్చర్యపరుస్తుంది. అవసరాలకు ఏ మాత్రం లోటురాదు. వాహనాలు, భూములు కొంటారు. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు తప్పవు. వారం చివరిలో శుభవార్తలు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించని స్థితి. కొన్ని నిర్ణయాలు చివరిలో మార్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని వేడుకలు రద్దు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో కొంత అనుకూల పరిస్థితులు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. పారిశ్రామికవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో స్వల్ప ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ వారం వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీలోని నైపుణ్యం మరింత వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారానికి చేరువగా ఉంటాయి. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు సఫలమయ్యే సమయం. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ వారం నిరుద్యోగులకు ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. కళారంగం వారి యత్నాలు సఫలం. కొన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. బంధువులతో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) వారికి :- ఈ వారం వ్యాపారాలు సామాన్యలాభాలతో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. ధన, వస్తులాభాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. శ్రమపడతారు, అయితే ఫలితం కనిపించని స్థితి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తుల వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే సూచనలు. రాజకీయవర్గాలకు కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. వారం ప్రారంభంలో కొత్త వ్యక్తుల పరిచయం. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి ఒప్పందాలు కొన్ని మార్చుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఆసక్తికర సమాచారం రాగలదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ వారం పరిస్థితులు అంతగా అనుకూలించక నిర్ణయాలు కొన్ని మార్పుకుంటారు. సన్ని తుల సలహాల కోసం యత్నిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రుణభారాలు పెరిగి సతమతమవుతారు. శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళారంగం వారికి అవకాశాలు చేజారవచ్చు. వారం మధ్యలో ధనలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. మీపై కుటుంబంలో ఆదరణ మరింత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ వారం ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. వ్యాపారాలు ఎంత కష్టించినా లాభాలు కనిపించని స్థితి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ వారం కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొని ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే అనుకూలిస్తాయి. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు క్రమేపీ కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.