MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలితాలు తేదీ 27 ఆగష్టు శుక్రవారం నుండి 2 సెప్టెంబర్ గురువారం 2021

వారఫలితాలు తేదీ 27 ఆగష్టు శుక్రవారం నుండి 2 సెప్టెంబర్ గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులలో ఆటంకాలు తొలగి చకచకా సాగుతాయి. కుటుంబసమస్యలు తీరి ఊరట చెందుతారు.

6 Min read
Author : ramya Sridhar
Published : Aug 27 2021, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు నూతన అవకాశాలు. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో  ధనవ్యయం. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులలో ఆటంకాలు తొలగి చకచకా సాగుతాయి. కుటుంబసమస్యలు తీరి ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  అవాంతరాలు తొలగి ముందడుగు వేస్తారు.  కళారంగం వారు  ఊహించని అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో  వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. రుణాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాల పరిష్కారం. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి.  వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414


కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగుతుంది. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్య సూచనలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కొత్త  పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. వారం చివరిలో  సోదరులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. అనుకోని ఖర్చులు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు రాదు. మిత్రుల  నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులకు సైతం లోటు ఉండదు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే సూచనలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి.  వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం కొత్త విద్యాయత్నాలు ఫలిస్తాయి. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఎటువంటి పనులైనా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో ఊహించని ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814


వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. చేపట్టిన పనులు సమయానికి  సాఫీగా పూర్తి కాగలవు. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది. వాక్చాతుర్యంతో వ్యతిరేకులను సైతం మెప్పిస్తారు. ఎటువంటి బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు. భూములపై కొన్ని వివాదాలు నెలకొంటాయి. ముఖ్య వ్యవహారాలలో రాజీమార్గం తప్పనిసరి కావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బదిలీలు అనివార్యం కావచ్చు.  కళారంగం వారికి∙గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక ఇబ్బందులు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో మరింత సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు.  కొన్ని నిర్ణయాలు బం«ధువులను ఆశ్చర్యపరుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు.  ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించి ఉత్సాహంగా సాగుతారు. పారిశ్రామికవర్గాల కృషి మరింత ఫలిస్తుంది. వారం చివరిలో సోదరుల నుంచి కొన్ని సమస్యలు. శ్రమ మరింత పెరుగుతుంది. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం నూతన వ్యవహారాలు  చేపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలించి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి పెడతారు. ప్రముఖ వ్యక్తులు సాయపడతారు. కుటుంబసభ్యుల ఆశలు నెరవేరుస్తారు.  వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కవచ్చు.  రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1214

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడి లబ్ధి పొందుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  ముఖ్య వ్యవహారాలలో విజయం. అరుదైన ఆహ్వానాలు అంది సంతోషపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కవచ్చు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1314
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు మల్టీ టాలెంటెడ్.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి!
Recommended image2
Budhaditya Yogam: సూర్య బుధుల సంయోగం.. ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టినట్టే
Recommended image3
Vastu Tips: కిచెన్ లో స్టవ్ పక్కన ఇవి ఉంటే..ఇంట్లో డబ్బు నిలవదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved