MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది...!

Weekly Horoscope: ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది...!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొత్త విధానాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు.  మీరు సూచించిన ప్రతిపాదనలకు కుటుంబసభ్యుల ఆమోదం లభిస్తుంది. 

6 Min read
Author : ramya Sridhar
Published : Feb 18 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో  గౌరవప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను  కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులు ప్రతిభకు పదునుపెడతారు. ఉద్యోగయత్నాలు  అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు  ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తల శ్రమ కొలిక్కి వస్తుంది.వారం మధ్యలో  ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు.ఇంతకాలం పడ్డ శ్రమ కొంత మేర ఫలిస్తుంది. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.ఒక ప్రకటన విద్యార్థులను కొంత ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. అయితే భాగస్వాములతో కొన్ని విభేదాలు తప్పవు. ఉద్యోగ విధి నిర్వహణలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి.  వారం మధ్యలో శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314


మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం కొత్త విధానాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు.  మీరు సూచించిన ప్రతిపాదనలకు కుటుంబసభ్యుల ఆమోదం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఎటువంటి వారినైనా ఆకట్టుకుంటారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో పదోన్నతులకు మార్గం ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారుల శ్రమ ఫలించే సమయం. వీరికి ఊహించని విదేశీ పర్యటనలు ఉండవచ్చు.   వారం చివరిలో సోదరులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. బంధువుల తోడ్పాటుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భూ,గృహయోగాలు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం.యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది. కుటుంబ సమస్యలు, కోర్టు వివాదాలు కొంత వరకూ పరిష్కారం.ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు.ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.వ్యాపారాలలో కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తల  యత్నాలు సఫలం.  వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు.సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.కొత్త కాంట్రాక్టుల కోసం యత్నాలు సఫలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో  పైస్థాయి నుంచి ఒత్తిడులు పెరిగినా సమర్థతను చాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు  ఆశించిన లక్ష్యాలు చేరుకుంటారు. వారం  చివరిలో అనుకోని ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. తగింత సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. కోర్టు కేసులు పరిష్కారవుతాయి.  సన్నిహితులు, మిత్రుల  చేయూతతో ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇళ్లు, స్థలాలు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి, భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఊరటనిస్తాయి. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో  కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొత్త పనులు చేపడతారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తి విషయాలలో నూతన అగ్రిమెంట్లు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ విధి నిర్వహణ ఉత్సాహంగా ఉంటుంది. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో  అనుకోని ఖర్చులు. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి  మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు.ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్యసమాచారం.భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం.వాహన, గృహయోగాలు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగ  విధి నిర్వహణలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళాకారులు, రాజకీయవేత్తలకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆశించిన రాబడి సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా కొనసాగుతాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. గృహ,వాహనయోగాలు కలుగుతాయి. స్థిరమైన ఉద్యోగాలు దక్కుతాయి. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కుతారు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటులో చికాకులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అతిధుల ద్వారా కీలక సమాచారం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. మీ ప్రతిభాపాటవాలకు తగిన ప్రోత్సాహం అందుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు. భూములు, ఆభరణాలను కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు మరింత సానుకూలమైన సమయం.  వారం ప్రారంభంలో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

1214

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు అధిగమిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. యుక్తితో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగ విధులలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1314

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

1414


గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant Vastu Benefits: ఇంట్లో తులసి మొక్కపెడితే నిజంగా అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం
Recommended image2
Moon Transit: కుంభ రాశిలో మహా లక్ష్మీ రాజయోగం... ఈ మూడు రాశుల జీవితంలో కనక వర్షం..!
Recommended image3
Saturn Effect on Relationship: దాంపత్య జీవితంపై శని ప్రభావం ఉంటుందా? కలిసిపోతారా? విడిపోతారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved