వారఫలితాలు తేదీ జూలై 17 శుక్రవారం నుండి 23 గురువారం 2020 వరకు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ వారం నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కాస్త అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణప్రయత్నాలలో ఓ అడుగు ముందుకు వేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశించిన విధంగా పుంజుకుంటాయి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలో మరింత పురోగతి కనిపిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి వస్తులాభాలు. ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి. రాజకీయవర్గాలకు వ్యవహారాలలో విజయం. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పాతమిత్రులతో సరదాగా గడుపుతారు. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు సంస్థల ఏర్పాటులో అనుకూలత. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. బంధువుల నుంచి మాటపడతారు. ఆర్థిక విషయాలు క్రమేపీ అనుకూలించి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. నిరుద్యోగులకు నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ వారం సంఘంలో విశేషమైన గౌరవప్రతిష్ఠలు పొందుతారు. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.. పాతబాకీలు కొన్ని వసూలై మీకున్న ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) వారికి :- ఈ వారం ప్రముఖ వ్యక్తులు ఊహించని రీతిలో సహకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగ్గా ఉంటుంది. ఒక ప్రకటన విద్యార్థులను సంతోషపరుస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై పెద్దలతో సంభాషిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. రాజకీయవర్గాలకు మరింత గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. రుణబాధలు తొలగుతాయి.కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు సంస్థల ఏర్పాటులో వివాదాలు పరిష్కారం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉత్సాహంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా సమయానికి డబ్బు అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీలో ధైర్యాన్ని నింపుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. సన్నిహితులతో మరింత ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. వివాహయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ వారం కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగినా చివరిలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఇష్టం లేకున్నా మార్పులు తప్పవు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ వారం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి ఆహ్వానాలు, పిలుపులు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పరిచయాలు పెరుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే సంతృప్తినిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యతిరేక పరిస్థితులను సానుకూలపర్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.