MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఓ రాశివారికి చెందిన నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరుతుంది..!

Weekly Horoscope: ఓ రాశివారికి చెందిన నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరుతుంది..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం మొదటి రెండుమూడురోజులు ఇబ్బందులు, సమస్యలతో సతమతమవుతారు. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.

6 Min read
Author : ramya Sridhar
Published : Dec 10 2021, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం అనుకున్న పనులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు మరింత హుషారుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం రావచ్చు. వారం ప్రారంభంలో వ్యూహాలు తప్పుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

213

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం మొదటి రెండుమూడురోజులు ఇబ్బందులు, సమస్యలతో సతమతమవుతారు. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. మీలో నైరాశ్యం తొలగి ముందడుగు వేస్తారు. వాహనాలు, విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో అడుగు ముందుకేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా మరింత బలపడేందుకు కృషి చేస్తారు. కొన్ని రుణాలను ఎట్టకేలకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరవచ్చు. వ్యాపారాలు విస్తరణలో ఒకరి సాయం అందుతుంది. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం కొత్త వ్యూహాలతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. భూముల వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్య పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అందుకుంటారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను ఆలోచింపజేస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చీటికీమాటికీ చికాకుపరుస్తున్న ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. మీమాటంటే ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. భూ, వాహనయోగాలు ఉండవచ్చు. వ్యాపారాలు పుంజుకుని ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

613

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం మొదట్లో పడిన కష్టాలు, ఇబ్బందులను క్రమేపీ అధిగమిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు దక్కించుకుంటారు. సోదరులు మీపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలలో భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. కళారంగం వారికి ఊహించని విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

713


తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నిర్ణయాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విజయాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినా ఖర్చులు పెరిగి ఇబ్బందిపడతారు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం తప్పదు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. విద్యార్థులు శ్రమించినా ఫలితం కనిపించదు. స్థిరాస్తి వివాదాలతో సతమతమవుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉన్నా కుటుంబసభ్యులు నిరాశ పరుస్తారు. వ్యాపారాలు స్వల్ప లాభాలు అంది పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలం. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కీలక సమావేశాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఇతరులకు సైతం చేయూతనిస్తారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మలచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. రాజకీయవర్గాల ఆశలు కొన్ని ఫలించే సూచనలు. వారం మధ్యలో వృథా ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతారు. శుభకార్యాలకు కొంత వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పలుకుబడి పెరుగుతుంది. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

1213


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన కష్టాలను అధిగమిస్తారు. మీసేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో మీపై కొన్ని బాధ్యతలు పడవచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

1313
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Tips: పడుకునే ముందు బెడ్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకునే అలవాటు ఉందా?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు
Recommended image3
Zodiac Signs: నవపంచమ రాజయోగం.. ఈ 3 రాశులవారి లైఫ్ అద్భుతంగా మారిపోవడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved