మీ పెళ్లైనట్టు కల పడితే ఏం అర్థమొస్తుందో తెలుసా?
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే ప్రతి కల మన భవిష్యత్తు గురించి ఎన్నో సంకేతాలను ఇస్తుంది. నిద్రపోయేటప్పుడు మనం ఎన్నో రకాల కలలు గంటుంటాం. వాటిలో కొన్ని పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అలాగే వాటిలో కొన్ని అశుభంగా పరిగణించబడతాయి. అయితే కొంతమందికి వారి పెళ్లైనట్టు కల పడుతుంది. ఇలాంటి కల అర్థమేంటో తెలుసా?
చాలా మందికి నిద్రపోయేటప్పుడు పెళ్లి గురించి కలలుపడుతుంటాయి. అసలు పెళ్లైనట్టు కల పడితే ఏమౌతుంది? ఇది దేనికి సంకేతం అంటూ ఎన్నో డౌట్లు వస్తుంటాయి. అయితే చాలా మంది పెళ్లి కలలు పడితే మంచిది కాదని అంటుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీ పెళ్లైనట్టు మీరు కలగంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం..
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నట్టు కల పడితే అది శుభ సంకేతంగా భావిస్తారు.అంటే మీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుండటాన్ని ఇది సూచిస్తుంది. కానీ మీ కలలో పెళ్లి ఆగిపోయినట్టు కనిపిస్తే అది మీ సంబంధంలో చీలికను సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
Marriage
వేరొకరి పెళ్లిని చూస్తూ..
ఒక వ్యక్తి తనకు దగ్గరగా ఉన్న వ్యక్తి కలలో వివాహం చేసుకోవడాన్ని చూసినట్టైతే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కలలు భవిష్యత్తులో మీకు ఏదైనా నష్టాన్ని సూచిస్తాయని డ్రీమ్ సైన్స్ లో నమ్ముతారు. ఇది మీ ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయని సూచిస్తుంది.
ఏవి మంచి కలలు?
ఒక వ్యక్తి తన కలలో ఒక స్త్రీని లేదా తనకు తెలిసిన వ్యక్తిని వివాహ జంటలో చూసినట్టైతే దాన్ని డ్రీమ్ సైన్స్ లో పవిత్రమైనదిగా చూస్తారు. ఇలాంటి కలగంటే మీ జీవితంలో సంతోషం అతి త్వరలో రాబోతోందని అర్థం. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు మీ కలలో మరొకరి ఊరేగింపును చూస్తే, అది కూడా శుభ కలగా పరిగణించబడుతుంది. దీని అర్థం మీ గౌరవం పెరుగుతుంది.