MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • 2023 లో కన్య రాశి వారి ఫలితాలు

2023 లో కన్య రాశి వారి ఫలితాలు

నూతన సంవత్సరం 2023లో కన్య రాశివారికి శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. చిరకాల సమస్యలకు ఈ సంవత్సరం నివారణ మార్గాలు దొరుకుతాయి.

11 Min read
Author : ramya Sridhar
Published : Dec 06 2022, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

315

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):


2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా  ఈ సంవత్సరం అంతా ఎక్కువ శాతం  మంచి ఫలితాలు ఉన్నాయి. ఆదాయం బాగా ఉండి, అది అన్ని విధాలా సద్వినియోగపడడం వలన చాలా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. కొత్త ఋణాలు అనుకూలంగా అందుతాయి.  ఉత్సాహంగా ఉంటారు.  పుణ్యక్షేత్ర సందర్శన, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రమోషన్‌లు, అనుకున్న రీతిగా ట్రాన్స్‌ఫర్‌లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. చిరకాల సమస్యలకు ఈ సంవత్సరం నివారణ మార్గాలు దొరుకుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సూచనలు అంది, సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు.  అలంకరణ వస్తువులు కొనుగోలుకు బాగా ధనవ్యయం చేస్తారు. 
 

415

ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే... 
 
జనవరి 2023
 
ఈ నెలలో  మంచి కాలం. అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ధైర్యంగా, స్వయంగా పనులు చేసుకుంటూ విజయం సాధిస్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. కుటుంబ సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఋణ సమస్యలు తీరే కాలం.

లవ్ లైఫ్ : ముఖ్యమైన విషయాల్లో   మీ జీవిత భాగస్వామి ని సంప్రదించటం వలన పనులు సులభంగా అవుతాయి. అలాగే కుటుంబ స‌భ్యుల‌తో విభేదాలు రానీయ‌వ‌ద్దు. ఒత్తిడి లేకుండా ఆలోచించండి తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. కుటుంబ సభ్యులను సంప్ర‌దించి నిర్ణ‌యాలు తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. ఓర్పు చాలా అవ‌స‌రం.  

ఉద్యోగం-వ్యాపారం:    ఉద్యోగం వ్యాపారాల్లో అధికారులతోను, పనివారితోను చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. వ్యాపారస్దులకు కూడా ఇదే సూచన. 
 
 ఆరోగ్యం:    ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇతరుల వివాదాల్లో తలదూర్చితే మీ ఆరోగ్యం పై దాని ప్రభావం పడుతుంది. ఆ టెన్షన్ మీకు ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 
 

515
Astro

Astro

ఫిబ్రవరి 2023

ఈ నెలలో   మీ ఆనందం మెరుగు పడుతుంది. మీ విజయాలు ఎక్కువ అవుతాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ అనుకున్నది సాధిస్తారు.  మీరు చక్కటి ఆలోచనలతో అద్భుతాలు చేస్తారు.  మీ జీవితంలో చిన్న చిన్న బాధలు వచ్చి, పోతుంటాయి. నెల మధ్యలో గ్రహ సంచారం మారుతున్నప్పుు  కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అశాంతి కూడా పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకమైన శాంతి కార్యములు అవసరం లేదు. రోజూ విష్ణూ సహస్ర పారాయణ చేయుట శుభప్రదం.

లవ్ లైఫ్:  మీ లైఫ్ పార్టనర్ విషయంలో కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. అనుమానాలు తలెత్తకుండా చూసుకోండి. మంచి కూడా గ్రహాలు అనుకూలించకపోతే చెడుగా కనపడుతుంది.    
  
 ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెల లో  ఉద్యోగస్దులకు అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. వ్యాపారస్దులు ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. నిరుద్యోగులు కొత్త వార్తలు వింటారు, కలిసొచ్చే కాలం.

ఆరోగ్యం:    ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని ఒడ్డున పడేస్తాయి. ఒకరోజు సౌఖ్యంగా.. మరోరోజు చికాకుగా సాగుతుంది. కుటుంబం మీకు అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చి నిలబెడుతుంది.  వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  

615
Virgo Zodiac

Virgo Zodiac

మార్చి 2023

ఈ రాశివారికి ఏ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  న్యాయ, ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. నెల ప్రారంభంలో స్వల్ప ఇబ్బందు లుంటాయి. అయితే   గ్రహాలను అనుకూలిస్తాయి. గురు సంచారం వల్ల అన్ని విధాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. 


లవ్ లైఫ్ :   సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. భార్య,భర్తల మధ్య అనుకూలతలు అంతంత మాత్రమే. మీకుటుంబ జీవనాన్ని మెరుగుపరిచే అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్లిపోతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. 

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగ,వ్యాపారాల్లో  సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.

ఆరోగ్యం:  తరచు ఆరోగ్య సమస్యలెదురవుతాయి. వైద్య సేవలతో కుదుటపడతారు. ఆ క్రమంలో కొన్ని దీర్గకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త పరిచయాలు మీ మానసిక ఉన్నతికి తోడ్పడతాయి. అయితే కొన్ని చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. 

715


ఏప్రియల్  2023

ఈ నెలలో  గ్రహ సంచారం  విశేష‌మైన అదృష్టాన్నీ శారీర‌క శ‌క్తిని, పేరు ప్ర‌తిష్ట‌ల‌ను ప్ర‌సాదిస్తుంది. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. దైవానుగ్ర‌హం ఉంది. కోరిక‌లు సిద్దిస్తాయి. భూ గృహ వాహ‌నాది శుభ‌యోగాలు ఫ‌లిస్తాయి. ఉద్యోగ‌ప‌రంగా శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు తెచ్చుకుంటారు.  అయితే కొంత మాన‌సిక ఒత్తిడి క‌లుగుతుంది.  తెలియ‌ని ఖ‌ర్చులూ ఇబ్బందులు ప్ర‌యాణాలు చేయాల్సిన ప‌రిస్థితులు గోచ‌రిస్తాయి. విదేశీయాన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయి. వ్యాపార యోగం బ్ర‌హ్మండంగా ఉంటుంది. విద్యార్థుల‌కు ఉత్త‌మ విద్య ల‌భిస్తుంది. శ‌ని, రాహు శ్లోకాలు చ‌దువుకోవాలి.   
 

లవ్ లైఫ్ :    కుటుంబ జీవనంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ భాగస్వామి తరుపు బంధుత్వాలు, పరిచయాలు వాటి నుంచిబయిటపడటానికి సాయిపడతాయి. ప్రేమికులకు ఇది కలిసొచ్చేకాలం.  మిమ్మల్ని తప్పుగా అర్దం చేసుకుని కొందరు విరోధులు ఏర్పడతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి మధ్యా జరిగే వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. 

ఉద్యోగం-వ్యాపారం:  వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. అనుకున్న సమయానికి పెట్టుబడులు సమకూరే సమయం. ఉద్యోగస్తులు తగినంత గుర్తింపు పొందుతారు. అలాగే, ప్రమోషన్లు కూడా లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రసాంకేతిక రంగాల వారు ప్రతిభను చాటుకుంటారు. విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు పొందుతారు. రాజకీయవేత్తలు ద్వితీయార్థంలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలున్నాయి. 
 

ఆరోగ్యం:  పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వైద్యం పెద్దగా అవసరం లేకుండానే   అనారోగ్యవంతులు కూడా సుఖపడే అవకాశం ఉంది. 

815
VIRGO

VIRGO

మే  2023

ఈ నెల   అన్ని అంశాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న ప్రతిపనినీ సకాలంలో పూర్తి చేస్తారు. సందర్భానుసారం ప్రవర్తించడం, అందరితో స్నేహంగా ఉండడం, ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్యం సహకరించడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయినా తెలివిగా ఖర్చులను నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలుంటాయి.  ఈ నెల చాలా మంచికాలం.

లవ్ లైఫ్ :  జీవన భాగస్వామి మీకు అనుకూలం. మీ దూకుడుకి అడ్డు కట్టు వేస్తున్నారని కోపం పెట్టుకోకండి. మీ మేలు కాంక్షించేవారు మీ వెన్నంటే ఉన్నారని భావించండి. అంతటా మీరు గౌరవింపబడతారు. 

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగస్దులు, వ్యాపారస్దులు  శ్రమ చేసినా ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. శనికి శాంతి అవసరం.   మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాగలవు. ఉద్యోగ, వ్యాపారాలు భారంగా నడుస్తాయి. సానుకూలత తక్కువ ఉన్న కాలం.

ఆరోగ్యం:  స్వల్ప అనారోగ్య బాధలున్నా....కంగారుపడాల్సిన పనిలేదు. ఆరోగ్య విషయమై నిశ్చింతగా ఉండండి. అన్నీ అవే సర్దుకుంటాయి.  వ్యయ ప్రయాసలు తప్పవు. ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదు. అంతా మంచే జరుగుతుంది. ఔషధ సేవనం తప్పనిసరి అయినా భయపడాల్సిన పనిలేదు.

915

జూన్   2023
 
ఈ నెలలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ  స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. జీవితంలో ఉన్న‌త స్థితికి చేరుకుంటారు  కార్య‌సిద్ధిని గౌర‌వాన్ని ప్ర‌సాదిస్తుంది. జీవితాశ‌యాలు నెర‌వేర‌తాయి. తెలివిగా ప‌నుల‌ను పూర్తి చేసుకుంటూ...వివాదాల‌కు దూరంగా ఉండాలి. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో ప్రశాంతత  అవ‌స‌రం. వ్యాపారం క‌లిసి వ‌స్తుంది. ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి.  విద్యార్థుల‌కు ప‌రీక్ష కాలంగా అనిపిస్తుంది. విదేశ‌యోగాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టి ఉంచాలి. వృథా ప్ర‌యాణాలు త‌గ్గించుకోవాలి. బాధ్య‌త‌ల‌ను ధ‌ర్మ బ‌ద్ధంగా నిర్వ‌ర్తించండి.

లవ్ లైఫ్ :   మీ కుటుంబంలో ఏ ఇబ్బందులు లేవు. నిరాశను మాత్రం దగ్గరకు రానివ్వకండి.  జీవనభాగస్వామితో  వైరమేర్పడకుండా మెలగండి.  ఆర్థిక ఇబ్బందులు వల్ల కుటుంబంలో వాదనలు జరుగుతాయి. పిల్లల వల్ల   కుటుంబంలో సం తోషం. పేరుప్రతిష్టలు లభిస్తాయి. ప్రేమికులకు అంతటా అనుకూల వాతావరణం.

ఉద్యోగం-వ్యాపారం: ఉద్యోగం వ్యాపారాల్లో అధికారులతోను, పనివారితోను చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. 

ఆరోగ్యం: ఈ నెలలో ఆకస్మిక అనారోగ్యం ఏర్పడకుండా  జాగ్రత్త వహించడం మంచిది. సాదాసీదాగా ప్రశాంతంగా గడుస్తుంది.  దైవదర్శనంతో కొన్ని అనారోగ్య బాధలు తప్పుతాయి.

1015
virgo

virgo

జూలై   2023

ఈ నెలలో  స‌మాజంలో గౌర‌వం పెరుగుతుంది. సంతృప్తిక‌ర‌మైన జీవితాన్ని అనుభ‌విస్తారు. ఆశయాలు నెర‌వేర‌తాయి. ఆప‌ద‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.  గ్రహ సంచార అనుకూలత వ‌ల్ల విశేష‌మైన లాభాలు గోచ‌రిస్తున్నాయి. వ్యాపారం క‌లిసి వ‌స్తుంది. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. గృహ‌లాభం సూచితం. ఇంట్లో వివాహాది శుభ‌కార్యాలు జ‌రుగుతాయి. ఆనందంగా ఉంటారు. ఉద్యోగాల్లో అద్భుతమైన ఫ‌లితాల‌ను సాధిస్తారు. నూత‌న బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. ప్ర‌శంస పుర‌స్కారాలు అందుతాయి. ఎదురు చూస్తున్న విష‌యంలో సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాలు సిద్ధిస్తాయి.  విద్యార్థుల‌కు విశేష‌మైన స‌ర‌స్వ‌తీ క‌టాక్షం సిద్ధిస్తుంది. శ‌ని, కేతు శ్లోకాలు చ‌దువుకోవాలి.

లవ్ లైఫ్ : విశ్రాంతి సమయాన్ని మీ లైఫ్ పార్టనర్ తో గడపటానికి కేటాయిస్తారు. ఆనందాలు మీ వెంటే ఉన్నాయి.  కొత్త అనుభూతులు ఆస్వాదించే సమయం..  గ్రహాల అనుకూలత ఉంది.  దూరమైన సంబంధాలు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.పిల్లలు సైతంమిమ్మల్ని అర్దం చేసుకుంటారు. ప్రేమికులకు వేరే వారి సలహాలు ఇబ్బంది పెడతాయి.  

ఉద్యోగం- వ్యాపారం:  వృత్తులు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు బదిలీలు ఆందోళన కలిగిస్తాయి.


  ఆరోగ్యం:  స్వల్ప అనారోగ్య బాధలు సూచిస్తున్నా అవన్ని తాత్కాలికమే. కంగారుపడి హాస్పటిల్స్ చుట్టూ తిరగకండి. కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుని మనోల్లాసాన్ని పొందుతారు. కంటినిండా నిద్రే మీ బాధలకు మందు అని గ్రహిస్తారు.
 

1115

ఆగస్ట్    2023

 ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి మించిన ఖ‌ర్చులుంటాయి. ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి. సంయ‌మ‌నాన్ని పాటిస్తే అవ‌మానాల్ని త‌ప్పించుకోవ్చు. నెల చివర్లో  సౌభాగ్య సిద్ధి క‌లుగుతుంది. ఆర్థిక స్థితి క్ర‌మంగా మెరుగు అవుతుంది. సాహ‌స నిర్ణ‌యాలు విజ‌యాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింత‌న‌లో ముందుకు సాగాలి.   ఉద్యోగంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. సంక‌ల్ప‌బుద్ధి క‌లుగుతుంది.  కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు. బంగారు భ‌విష్య‌త్ సూచితం.  రోజూ విష్ణూ సహస్ర పారాయణ చేయుట శుభప్రదం

 లవ్ లైఫ్ :   ఈ నెలలో మీకు లైఫ్ పార్టనర్ తో ఆనందంగా ఉండే కాలం. ఆర్దిక కష్టాలు మీ ఫ్యామిలీ లైఫ్ పై పడనివ్వకండి. దగ్గర ఉంటూ ఒకరి సలహాలు మరొకరు తీసుకుంటూ ఉంటే  మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లల  వల్లే మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. 

ఆరోగ్యం:   మీ ఆరోగ్యంలో ఏ సమస్యలు ఈ నెలలో గ్రహాలు సూచించటం లేదు.అంతా  బాగుంది.  అయితే కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో  జాగ్రత్త పడండి.  ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం.  అందు నిమిత్తం ఋణప్రయత్నాలు చేస్తారు.

ఉద్యోగం- వ్యాపారం:  వ్యాపారంలో,  ఉద్యోగంలో అనుకోని చికాకులు రాగలవు. మితభాషణ అవసరం. మీ పనులు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ మానసిక స్థితితో ఇబ్బందులు ఎదురు అవుతాయి. మీరు కొత్త వసతి ఆనందాన్ని పొందుతారు.

1215

సెప్టెంబర్    2023

ఈ నెలలో  విశేష‌మైన ఆదాయం ఉంటుంది. చ‌ర‌, స్థిరాస్తుల‌ను వృద్ధి చేసే స‌మ‌యం.  గురుబ‌లం విశేష‌మైన శుభాన్ని ప్ర‌సాదిస్తుంది. గృహ నిర్మాణాది కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం అవుతుతాయి. త్వ‌ర‌గా కార్య‌సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విశేష‌ష్ట్ర ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తాడు. రాజానుగ్ర‌హా సిద్ధి క‌లుగుతుంది.  అయితే అప్పుడ‌ప్పుడూ తెలియ‌ని ఆటంకాలు ఎదురు అవుతాయి. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. వ్యాపారంలో బ్ర‌హ్మండ‌మైన లాభాలుంటాయి. స‌మాజంలో పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదిస్తారు. ఇంట్లో శుభ‌కార్యాలు జ‌రుగుతాయి. ప్ర‌ముఖ వ్య‌క్తుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ప‌లు మార్గాల్లో విజేత‌లుగా నిలుస్తారు.  ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తారు. కుటుంబ స‌భ్యుల ప్రోత్సాహం ల‌భిస్తుంది. అల‌స‌త్వం లేకుండా ల‌క్ష్యాల‌ను పూర్తి చేయండి. 

లవ్ లైఫ్ :  మీ భాగస్వామితో  తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు.  వ్యవహారాలలో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సమస్యలను మీ అంతట మీరు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. 

ఉద్యోగం- వ్యాపారం :ఉద్యోగస్తులు పనితీరు మెరుగ్గా ఉన్నా పైస్థాయి వారితో మాటపడతారు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు శ్రమానంతరం లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఏర్పడి పరీక్షాకాలంగా ఉంటుంది. కళాకారులు తొందరపాటు నిర్ణయాలతో అవకాశాలు దూరంగ చేసుకోవడం తగదు.  శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. 

ఆరోగ్యం: ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీ  జీవన శైలిలో  కొత్త మార్పులు కలిసి వస్తాయి.  ఔషధ సేవనం లేని వైద్యం వైపు ఆకర్షితులు అవుతారు. అందులో భాగంగా ఆధ్యాత్మికత  మీకు అండంగా ఉటుంది.   వాహనం నడిపేటపుడు జాగ్రత్త. పాల్గొంటారు.  

1315

అక్టోబర్    2023

ఈ నెలలో ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని అభివృద్ధిని సాధించాలి. ఉద్యోగంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. ప‌లు మార్గాల్లో విశేష లాభాలున్నాయి. కాలం క‌లిసి వ‌చ్చి అదృష్ట‌వంతులు అవుతారు. సాహ‌సోపేత కార్యాలు శ‌క్తిని ఇస్తాయి. మిత్రుల స‌హ‌కారంతో భారీ ల‌క్ష్యాల‌ను సైతం సాధించ‌గ‌లుగుతారు.  ప‌నుల్లో జాప్యం జ‌రుగుతుంది. స‌మ‌య‌స్పూర్తి చాలా అవ‌స‌రం. దేనికి తొంద‌ర వ‌ద్దు. ఆత్మీయుల సూచ‌న‌ల‌తో ఫ‌లితం ఉంటుంది. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. స‌హ‌నంతోనే కార్య‌సాధ‌న‌లో విజ‌యాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. విద్యార్థులు క‌ష్ట‌ప‌డితేనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా పూర్తి చేయాలి.
 
లవ్ లైఫ్ :  దంపతుల మధ్య తరచు చిన్న చిన్న గొడవలు. అందుకు కారణం మీ మధ్య ఉన్న  అవగాహన లోపం.  అయితే దీర్గకాలిక  బంధాలకే ప్రయారిటీ ఇవ్వండి.  మీ పిల్లల వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాలను ఘనంగా చేస్తారు. ప్రేమికులు తమ కుటుంబాలను ఒప్పించటానికి ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి.

ఉద్యోగం- వ్యాపారం: మీ వృత్తి వ్యవహారాల్లో  చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వ్యాపార విషయాల్లో సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. మితభాషణ చేస్తారు. అవసరం అయిన చోట ధైర్యం తెలివి ప్రదర్శిస్తారు. ఊహించని లాభాలు పొందుతారు. సినిమా వాళ్లకు కలిసి వచ్చే కాలం.

ఆరోగ్యం: చక్కటి ఆరోగ్యం మీ సొంతం. అయితే కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.  కంగారుపడాల్సిన పనిలేదు. వైద్య సేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారి  గురించి రాత్రింబవళ్ళూ ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయి.  
 

1415

నవంబర్    2023

ఈ నెలలో  అధిక మొత్తంలో ఖ‌ర్చును సూచిస్తోంది. ఆదాయ వ‌న‌రుల‌ను అభివృద్ధి ప‌రుచుకునే మార్గాల‌ను అన్వేషించాలి. రాజ‌పూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశ‌దిశ‌లా వ్యాపిస్తుంది. మీ ప్ర‌తిభ‌ను అంద‌రూ గుర్తించి స‌ముచిత‌మైన స్థానాన్ని ఇస్తారు. సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. నెల  మ‌ధ్య‌లో కొన్ని కార్యాలు విజ‌య‌వంతం అవుతాయి. లాభ కేతువు వ‌ల్ల సంప‌ద‌లు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక బ‌లం పెరుగుతుంది. దైవానుగ్ర‌హంతో ఆప‌ద‌లు తొల‌గుతాయి.  గ్రహఅనుకూలత లేక  కొన్ని విఘ్నాలు ఎదుర‌వుతాయి. చిత్త‌చాంచ‌ల్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక న‌ష్టాన్ని నివారించాలి. విదేశీ ప్ర‌యాణాల‌కు అవ‌కాశం ఉంది. ద‌గ్గ‌రి వారితో విభేదాలు రాకుండా వ్య‌వ‌హ‌రించాలి.  

లవ్ లైఫ్ :  మీ లవ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది.  దంపతుల మధ్య సఖ్యత లోపం ఉన్నా కొద్దిపాటి సహనం, తెలివితో పరిష్కారం అవుతుది. ఉద్యోగ ఒత్తిడి కుటుంబంపై పడనీయకండి. శుభకార్యాలకు తరుచు హాజరవుతారు. అందువలన మీకు కొన్ని కలసివచ్చే పరిస్దితులు కనపడుతున్నాయి.  మీ పిల్లలకు ఉపాధి,  ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. 

ఆరోగ్యం:  ఈ నెల దంత బాధలు సూచిస్తున్నాయి. రాత్రిళ్లు మీకు నిద్రలేకుండా చేస్తుంది. అయితే చిన్న పాటి సర్జరీ లేదా వైద్యంతో  మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.   ఆహార,విహారాదులలో తప్పనిసరిగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనతో అన్ని సర్దుకుంటాయి.
  

ఉద్యోగం- వ్యాపారం:   

ఈ నెలలో  కెరీర్‌లో కొత్త చిక్కులు ఎదురవుతాయి. మీరు పనిచేసే చోట ఒకరి ప్రవర్తన మిమల్ని బాధిస్తుంది. మీ విజయానికి కొత్త మెట్లు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతి ఫలం లభిస్తుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
 

1515

డిసెంబర్    2023


 ఈ రాశివారి కి ఆదాయం గ‌తం కంటే ఉత్త‌మంగా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధిచేస్తారు. ధ‌నం నిలువ చేయ‌డానికి అనుకూల‌మైన స‌మ‌య‌మిది. ముఖ్య కార్యాల్లో విజ‌యం ల‌భిస్తుంది. మ‌నోబ‌లంతో అభిష్టాలు సిద్ధిస్తాయి. కీర్తీ ప్ర‌తిష్ట‌ల‌ను సాధిస్తారు.  . మంచిత‌నం కాపాడుతుంది. ధ‌ర్మబుద్దితో ప‌ని చేస్తే క‌ష్టాలు తొల‌గిపోతాయి. మొహ‌మాటం వ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ముందుగానే అంచ‌నా వేసి తెలివిగా బ‌య‌ట‌ప‌డాలి. ఉద్యోగంలో మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. ప‌నుల స‌కాలంలో పూర్తి చేయండి. బంగారు భ‌విష్య‌త్ ల‌భిస్తుంది. తోటివారి సూచ‌న‌లు అవ‌స‌రం అవుతాయి. వ్యాపారంలో జాగ్ర‌త్త వ‌హించాలి. బంధు మిత్రుల వ‌ల్ల మేలు చేకూరుతుంది. త‌గినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు ప్ర‌ణాళిక‌తో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తారు.
  
లవ్ లైఫ్ :   అవివాహితులకు శుభదాయకం. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. సాంసారిక జీవితం ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను మిగిలుస్తుందీ ఈ నెల.

ఆరోగ్యం:   ఆరోగ్య విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ లేవు. గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో పూర్తి పరష్కారం దొరుకుతుంది. నీటిని ఎక్కువగా తాగమని వైద్యులు మీకు ప్రత్యేకంగా సూచిస్తారు. అలాగే ప్రతీ చిన్న విషయానికి కంగారుపడటం తగ్గించుకోండి. అదే అనారోగ్యాలు తెచ్చిపెడుతోంది. 

ఉద్యోగం- వ్యాపారం :   మీకు అంతా శుభసమయమే.  వ్యాపారులు కొత్త ఆలోచనలతో పెట్టుబడులు సమీకరించి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించవచ్చు. ఉన్నత పోస్టులు సైతం రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు వివాదాల నుండి బయటపడతారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు సాధిస్తారు. కళాకారులు, రచయితలు మరిన్ని అవకాశాలు పొందుతారు. ప్రారంభం నుంచి మూడు నెలలపాటు శని దశమస్థితి సంచారం కొన్ని చికాకులు కలిగించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వివాదాలను పట్టించుకోవద్దు.

 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved