MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మీ ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రిపూట ఇలా చేయండి

మీ ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రిపూట ఇలా చేయండి

ఇంట్లో మెండుగా సంపద ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రిపూట కొన్ని పనులు చేస్తే ఇంట్లో సంపద పెరుగుతుంది.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 11 2024, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయి. చాలా మంది ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఎన్నో పనులు చేస్తుంటారు. అయినా ఒక్కపైసా కూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో సంపద పెరగదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రి పూట మీరు కొన్ని పద్దతులను ఫాలో అయితే ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇందుకోసం ఏ చేయాలంటే? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పూజగది

చాలా మందికి రాత్రి పడుకునే ముందు ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పడుకునే అలవాటు ఉంటుంది. దేవుడి గదితో సహా అన్ని లైట్లను ఆఫ్ చేస్తుంటారు. కానీ ఇంట్లో దేవుడి గదిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు. మీ ఇంట్లో సంపద పెరగాలంటే మాత్రం రాత్రి పడుకునేముందు మీ ఇంటి పూజ గది లైట్స్ తో వెలిగేలా చూడండి. 
 

35

దీపం

ఉదయం, సాయంత్రం వేళల్లో దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగిస్తుంటారు చాలా మంది. అయితే ఒక్కసారి దీపం ముట్టించిన తర్వాత అవి వెలుగుతున్నాయా? ఆరిపోయాయా? అని చూడరు. అయితే మీరు నిద్రపోవడానికి ముందు పూజగదిలో చిన్న దీపం వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ ఇంట్లో సంపదకు  లోటు ఉండదు. 
 

45


ఇంటి ప్రధాన ద్వారం

లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. ఆర్థిక సమస్యలు కూడా రావు. అయితే చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. కానీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే  ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి.
 

55

చీపురు

చీపురును ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు చాలా మంది ఆడవారు. కానీ ఇది మంచిది కాదు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండకూడదంటే మీరు రాత్రి పడుకునే ముందు చీపురును నిటారుగా ఉంచండి. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అందుకే చీపురును ఎప్పుడూ కూడా కిందికి వంచి పెట్టండి. లక్ష్మీదేవి రాత్రిపూట ఇంటికి వస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా
Recommended image2
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
Recommended image3
Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved