వంటగదిలోఈ వస్తువులను గనుక ఉంచితే.. మీ ఇంట్లో డబ్బుకు లోటే ఉండదు..
మన ఇంట్లో వంటగది ఒక ముఖ్యమైన భాగం. అలాంటప్పుడు వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు పాటిస్తే ఆ వ్యక్తికి కలిగే ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోడు. అలాగే ఇంట్లో డబ్బుకు లోటే ఉండదు.
హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. ఇంట్లో వాస్తు లోపముంటే.. మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో దీనిని ఎదుర్కోవటానికి ఎన్నో మార్గాలు కూడా వాస్తు శాస్త్రంలో వివరించబడ్డాయి. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న కొన్ని వస్తువులను వంటగదిలో పెడితే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఇందుకోసం వంటింట్లో ఏం పెట్టాలో తెలుసుకుందాం పదండి.
పసుపు
పసుపును మనం ప్రతి కూరలో వేస్తాం. మసాలా దినుసుగా ఉపయోగించే పసుపును మతపరమైన వేడుకల్లో కూడా ఉపయోగిస్తారు. అందుకే మీ వంటగదిలో పసుపు ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. ఇలా గనుక చేశారంటే మీ ఇంట్లో డబ్బుకు లోటే ఉండదు. అలాగే డబ్బుకు మార్గం సుగమం అవుతుంది.
copper
రాగి, ఇత్తడి పాత్రలు
ప్రస్తుత కాలంలో ప్రతి వంటింటిలో గాజు, ప్లాస్టిక్, స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉంచుతున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగది పశ్చిమ దిశలో రాగి, ఇత్తడి పాత్రలను పెట్టాలి. దీనివల్ల మీరు ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.
మొక్కలు
ఇంటి దగ్గర ఎన్నో రకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే మీ వంటగదిలో కలబంద, తులసి వంటి కొన్ని మొక్కలను పెట్టొచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా తగ్గుతుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులు
వాస్తు నియమాల ప్రకారం.. మీరు మీ వంటగదిలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది. ఇందుకోసం మిక్సర్, ఓవెన్ వంటి విద్యుత్ ఉపకరణాలను వంటగది ఆగ్నేయ మూలలో ఉంచండి.
ఈ నియమాలను గుర్తుంచుకోండి
వంటగదికి సమీపంలో మరుగుదొడ్లను ఎప్పుడూ కూడా నిర్మించకూడదు. వంటగది కింద లేదా పైన మరుగుదొడ్డిని ఉండకూడదు. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.