ఇంట్లో ఈ మొక్కలను నాటండి.. ధనవంతులు అవుతారు!
వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో మొక్కలను, చెట్లను నాటడానికి నియమాలను పేర్కొన్నారు. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన చెట్లను, మొక్కలను నాటడం వల్ల సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Vastu Plants
సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ మొక్కలను నాటడానికి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. జ్యోతిష్యుల ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన మొక్కలను, చెట్లను ఇంట్లో నాటడం వల్ల మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంటికి సరైన దిశలో మొక్కలను, చెట్లను నాటకపోవడం వల్ల మనిషి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తారు. అందుకే ఇంట్లో మొక్కలను, చెట్లను నాటేటప్పుడు దిశపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరి ఇంట్లో ఏ చెట్లు, మొక్కలను నాటితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తులసి మొక్క
సనాతన ధర్మంలో తులసి మొక్కను పూజిస్తారు. ఈ మొక్కను ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఈ మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. మీరు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనుకుంటే మీ ఇంటికి ఈశాన్య దిశలో ఈ మొక్కను నాటండి. ఈ మొక్కకు ప్రతి రోజూ పూజ చేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీంతో మీరు సంపద ప్రయోజనాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పారిజాత చెట్టు
సనాతన ధర్మంలో పారిజాత మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పారిజాత మొక్క పుష్పం సంపద దేవత అయిన లక్ష్మీ దేవికి ప్రియమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పారిజాత మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.
జమ్మి చెట్టు
జమ్మి చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఇంట్లో జమ్మి చెట్టును నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, శనీశ్వరుడు సంతోషిస్తాడని చెబుతారు. అలాగే నెగెటివ్ ఎనర్జీ ఇంటి నుంచి వెళ్లిపోతుందనే నమ్మకం ఉంది.