MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి

Today Horoscope: ఓ రాశివారికి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 09 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

9-6-2024 ఆదివారం  మీ రాశి ఫలాలు 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-నిరోద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. మొదలుపెట్టిన పనులు పూర్తి కావడం కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం ఒత్తిడి కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు అనుకోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికి రాదు. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారులకు కొత్త సమస్యలొస్తాయి. బంధు మిత్రుల నుంచి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- మీరు ఎంత కష్టపడి పనిచేసిన మొదలుపెట్టిన పనులు పూర్తి కావు. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఉన్న  మనస్పర్థలు తొలగిపోతాయి. బంధువుల వల్ల ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు బాధ్యతలు రెట్టింపు అవుతాయి. వ్యాపారులు అకస్మత్తుగా తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఉన్నపాటుగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరెంత కష్టపడ్డా పనికి తగ్గ ఫలితాన్ని పొందలేరు. బంధు మిత్రులతో వివాదాలొస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు పని ఒత్తిడి ఎక్కవుగా ఉంటుంది. ఇది చికాకు కలిగిస్తుంది. పాత రుణాలను తీర్చడానికి ఎంతో కష్టపడినా ఫలితం ఉండదు. లాభాలు లేని ప్రయాణాలు విసుగు తెప్పిస్తాయి. 
 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. బంధువుల రాకతో ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు ఆస్థులను కొనే అవకాశం ఉంది.  వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఆశించినట్టుగా జరుగుతుంది. విందు వినోధాల్లో పాల్గొంటారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ రోజు సమస్యాత్మకంగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు, కొట్లాటలు పూర్తిగా తొలగిపోయి.. కుటుంబ సభ్యులతంగా  ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలొస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ దర్శనం చేసుకుంటారు. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మీరు ఊహించని విధంగా సమాజంలో, ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. వ్యాపారంలో  మంచి వాతవారణం ఉంటుంది. మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- రాజకీయ నాయకుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.  చాలా కాలంగా ఉన్న వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. ధనలాభం కలిగే యోగం ఉంది. వ్యాపారంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనవసరంగా ఖర్చు చేయకండి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారులు జాగ్రత్తగా ఉంటేనే నష్టాన్ని ఎదుర్కోరు. రుణాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో చిన్న కలహాలు వస్తాయి. 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- పెద్దల సలహాలు పాటిస్తే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ముఖ్యమైన పనులు నత్త నడకన సాగుతాయి. ఇంట్లో ఒకరితో ఒకరు వివాదాలకు దిగుతారు. ఇది చిరాకు కలిగిస్తుంది. ఉద్యోగులు సమస్యలను ఎదుర్కోకతప్పదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. అనుకోని దూర ప్రయాణాలు చేస్తారు. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-వస్తు, వాహనాలను కొనే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విద్యుర్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- సంఘంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీంతో మీరు కొన్ని లాభాలను పొందుతారు. భూ తగాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో అడ్డుగా ఉన్న విషయాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బాకీలు వసూలవడంతో కాస్త ప్రశాంతంగా ఉంటారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved