MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి అనుకోని కొన్ని కొత్త సమస్యలు

Today Horoscope: ఓ రాశివారికి అనుకోని కొన్ని కొత్త సమస్యలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశి వారికి ఈ రోజు  తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

8 Min read
Author : ramya Sridhar
Published : Dec 07 2023, 04:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 05

daily horoscope 2023 New 05

7-12-2023, గురువారం   మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం


ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (క్షేమతార) సమాజములో కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

భరణి నక్షత్రం వారికి (విపత్తార) ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలించును.వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించుకొనవలెను. వ్యాపారంలో ధననష్టం రాగలదు.

కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో  పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పిల్లలతో సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు  ఆలోచనలతో భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

రోహిణి నక్షత్రం వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారుల తో విరోధాలు ఏర్పడగలవు.

మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తో సఖ్యతగా వ్యవహరించాలి .వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘము నందు మీ  ప్రతిభకు తగ్గ గౌరవం పెరుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.  కీలకమైన సమస్య బుద్ధి కుశలత తో పరిష్కారం చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దామోదరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

       


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తో సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

ఆరుద్ర నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.


దిన ఫలం:-పట్టుదలతో చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో  పని ఒత్తిడి గా ఉంటుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు ఆలోచనలతో భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును.ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం.
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

పుష్యమి నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన  బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

ఆశ్రేష నక్షత్రం వారికి (ప్రత్యక్తార) అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-చేయు పనులు లో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడతాయి. సమాజంలో  మీరు చేయని పనులు కి బాధ్యత పడి అవమానాలకు గురి అవుతారు.వాదనలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు మనసు నందు చికాకులు పుట్టించును. దురాచారాలకు దూరంగా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేయ ఖర్చులు యందు ఆచితూచి వ్యవహరించాలి . వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4,పుబ్బ1 2 3 4,ఉత్తర1):
నామ నక్షత్రములు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారములు లాభసాటిగా జరుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.ఫ నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించు కొనవలెను.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేయ పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి.సంతానం మూలకంగా శుభవార్తలు వింటారు., నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.గురవే నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

హస్త నక్షత్రం వారికి(జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారులతో  విరోధాలు ఏర్పడగలవు.

చిత్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-శారీరక శ్రమ అధికమై శరీర బాధలు పెరుగుతాయి .కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధ పడతారు. చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఆటంకాలు ఏర్పడును. బంధుమిత్రుల తోటి కలహాల రావచ్చు. వస్తువులు యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. ఉద్యోగాలు లో అధికారుల  ఒత్తిడి ఎక్కువగా నుండును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల తోటి సఖ్యత గా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు  (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) ప్రభుత్వ అధికారులతో  సఖ్యతగా వ్యవహరించాలి .వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

స్వాతి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

విశాఖ  నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-చేసే పనుల్లో  కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. అధికారులు తో సఖ్యత గా ఉండవలెను. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు. రాజకీయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .ఓం ఆదిత్యాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం(విశాఖ 4,అనురాధ1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార) అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల యందు ఉహించని ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి  బంధుమిత్రుల తోటి చర్చిస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా పూర్తి కాగలవు. ఉద్యోగం నందు పై అధికారుల ఆశీస్సులు లభించును. సమాజమునందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది .మహాలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1013
telugu astrology

telugu astrology

    
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు  
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.షా  నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించు కొనవలెను.

ఉ.షా నక్షత్రము వారికి  (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-తలపెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యిందు ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో అధికారులు యొక్క ఆదర అభిమానం  లభించును. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

శ్రవణం నక్షత్రము వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారులతో విరోధాలు ఏర్పడగలవు.

ధనిష్ఠ నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఆదాయ మార్గం అన్వేషణ ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది.గృహమునకు కావలసిన వస్తువుల గూర్చి అధికంగా ఖర్చు చేస్తారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానం పొందుతారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు గానే పూర్తగును. రావలసిన పాత బాకీలు వసూలు అవును. శారీరిక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (పరమైత్రతార)ప్రభుత్వ అధికారులతో  సఖ్యతగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

శతభిషం నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో  కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. సమాజము నందు మీ మాట విలువ తగ్గును. ఉద్యోగమునందు అధికారులతో పేచీలు ఏర్పడవచ్చు. మిత్రులు నమక ద్రోహం చేయాలని చూస్తారు. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీన పడుతుంది. కీలకమైన సమస్య లు పెరిగి మానసిక బాధలు ఏర్పడును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించ వలెను. అనాలోచిత పనుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. పని వారి తోటి ఇబ్బందులు రావచ్చు. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉ.భా  నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలుళచేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

రేవతి నక్షత్రం  వారికి (ప్రత్యక్తార)అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-సమాజంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగును. ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. ఇతరులతో చేసే వ్యవహారం మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్క పెట్టవలెను. ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved