MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సత్తా చూపిస్తారు

Today Horoscope: ఓ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సత్తా చూపిస్తారు

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు రాగలవు. వ్యాపారం సజావుగా సాగును. ఉద్యోగస్తులు అధికారులు మన్ననలు పొందగలరు.

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 03 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


3-4-2024, బుధవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)
జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం. విషయాల్లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

భరణి నక్షత్రం వారికి సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. .

కృత్తిక నక్షత్రం వారికి జన్మ తార(జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-వ్యాపారంలో  పెట్టుబడి తగ్గ ధన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు బాగున్నాయి.ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి అగును. బంధుమిత్రుల కలయిక ఆనందం కలగజేస్తుంది.విద్యార్థులు చదువు యందు ప్రతిభ కనబరుస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.ఓం బుధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మృగశిర నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్రుడు)ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును.ఆర్థికంగా బాగుంటుంది.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. క్లిష్టమైన సమస్యలు ను చాకచక్యంగా ఎదుర్కొంటారు. గృహంలో శుభకార్యములు జరుగును.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అన్ని విధాల అభివృద్ధి కనిపించును.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

413
telugu astrology

telugu astrology

మిధునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి నైధన తార(నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పునర్వసు నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు రాగలవు. వ్యాపారం సజావుగా సాగును. ఉద్యోగస్తులు అధికారులు మన్ననలు పొందగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత.శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఆశ్రేష నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

దిన ఫలం:-బంధు సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగాలు లో అధికార అభివృద్ధి.కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు.వ్యవసాయదారులకు అన్ని విధాల యోగించును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.విద్యార్థులు పరీక్ష యందు ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యవహారాలు లో ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి.ఓం గురవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందగలరు.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం.విషయాలు లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

పూ.ఫ నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించవలెను. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. చేయు వ్యవహారం నందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి. మనసునందు అశాంతి ఏర్పడుతుంది. బంధువర్గము ద్వారా అనేక అవరోధాలు ఏర్పడవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులు తో ఇబ్బంది కలుగుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి పరమైత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

చిత్త నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు కలుగును. మిత్రుల తోటి విరోధం. ఉద్యోగాలు లో  అధికారులు తో సమస్యలు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు.మనసునందు ఆందోళనగా ఉంటుంది.శత్రు బాధలు ఏర్పడగలవు.కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.తలపెట్టిన పనుల్లో అపజయాలు ఎదురౌతాయి.విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి.ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు . వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-ఆరోగ్యం బాగుంటుంది.అభివృద్ధి కార్యక్రమంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యల వలన కోపానికి ఉద్రేకాలకు గురవుతారు. వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.ఓం నృసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

జ్యేష్ట నక్షత్రం వారికి  క్షేమ తారాధిపతి ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.


దిన ఫలం:-పుత్రులతో ప్రతికూలత వాతావరణ. బంధువర్గం తో అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మానసికంగా నిరుత్సాహంగా ఉంటుంది.శారీరక శ్రమ పెరిగి అలసట పొందుతారు.ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మిత్రుల తోటి సఖ్యంగా వ్యవహరించాలి.ఓం కేతవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల , పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం. విషయాల్లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

పూ.షాఢ నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది.జీవిత భాగస్వామి తో అకారణ కలహములు ఏర్పడవచ్చు.సమాజం లో ప్రతికూలత వాతావరణం.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణము చేయవలసి వస్తుంది.బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.ఓం రాహవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

ధనిష్ఠ నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-ఆరోగ్యం  ప్రశాంతత లభించును. కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహారాలు చక్క పెట్టుకోవాలి. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో  అనుకూలమైన మద్దతు లభిస్తుంది. సమస్యలు సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అందుకోలేరు.ప్రతి పని యందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఓం శనైశ్చరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు . వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పూ.భా నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మనసు నందు ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు.ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.ఉద్యోగ పరంగా అభివృద్ధి కనపడను.సంసార సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. ప్రయాణాలు కలిసి వస్తాయి.ఓం అంగారకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భా  నక్షత్రం వారికి  ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

రేవతి నక్షత్రం  వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

దిన ఫలం:-వివాహ ది శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.వైవాహిక  జీవితం ఆనందంగా గడుపుతారు.దూర ప్రయాణాలు లాభిస్తాయి.ఉద్యోగులకు అధికారంతో కూడిన అనుకూలమైన బదలీలు అవుతారు. ప్రతి చిన్న సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు.అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది.నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved