MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి బాకీలు వసూలవుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు

Today Horoscope: ఓ రాశివారికి బాకీలు వసూలవుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ధనలాభం.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 20 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

20-3-2024,బుధవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని  భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (మిత్ర తార) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును.విలాసవంతంగా గడుపుతారు.

భరణి నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

దిన ఫలం:-అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు చేజారే అవకాశం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవ్వచ్చు.ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు రాగలవు.

మృగశిర నక్షత్రం వారికి(క్షేమతార) శుభ నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు సహాయం తీసుకోవాలి.ఇంటికి సంబంధించిన  వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఓం లక్ష్మీ నరసింహ స్వామినే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. పనులలో ఆటంకాలు.

పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)శుభవార్తలు వింటారు.వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది .

దిన ఫలం:-ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ధనలాభం.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదర అభిమానం పొందగలరు.వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల గౌరవం పొందుతారు. నూతన విధానాన్ని ఆచరణలో పెడతారు.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి  ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

ఆశ్రేష నక్షత్రం వారికి (పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

దిన ఫలం:-ఆర్థిక లాభాలు పొందగలరు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.ఇతరులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఉపాధి మార్గాలు లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగును,ఉద్యోగాలు అనుకూలంగా ఉండును.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయాలు కలుగుతాయి.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైధనతార)చేసే పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది.సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

దిన ఫలం:-దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  కీలకమైన విషయం గురించి చర్చలు చేస్తారు.ఉత్సాహంగా ఉంటారు. మనోవాంఛలు నెరవేరును. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందగలరు. ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు రాగలవు.

చిత్త నక్షత్రం వారికి (క్షేమతార) శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగం అనుకూలం.శుభవార్తలు వింటారు.పరిస్థితులు అనుకూలంగా ఉండును. సమస్యలు ను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి(విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

విశాఖ నక్షత్రం వారికి (సంపత్తార)వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు.

దిన ఫలం:-వాయిదా పడిన పనులు పూర్తి అగును.నూతన ఆలోచనలు చేస్తారు.బంధుమిత్రుల సహకారం అందుతుంది. ప్రభుత్వ సంబంధిత కార్యములు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.ఓం ఈశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి(జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు.శారీరక శ్రమ అధికం.

జ్యేష్ట నక్షత్రం వారికి(పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము.

దిన ఫలం:-ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.అధికారులు తో  సమస్యలు రాగలవు. ఇతరులతో మాట్లాడేటప్పుడు  జాగ్రత్తగా మాట్లాడాలి.అనుకొని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు ఎదురవుతాయి.అధిక ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి .ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల  పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయాలు కలుగుతాయి.

పూ.షాఢ నక్షత్రం వారికి (నైధనతార) చేసే పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో యందు జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

ఉ.షాఢ నక్షత్రం వారికి (సాధన తార) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు.

దిన ఫలం:-గృహ సంబంధిత అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు.శుభకార్యాలు గూర్చి ఆలోచన చేస్తారు.ప్రయాణంలో విలువైన వస్తువులు తో జాగ్రత్తలు తీసుకోవాలి.ఉద్యోగాలు లో అధికారులు తో సఖ్యత గా ఉండాలి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.పాత మిత్రుల తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు రాగలవు.

ధనిష్ఠ నక్షత్రం వారికి (క్షేమతార) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

దిన ఫలం:-ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు.ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు.కుటుంబ సభ్యులతో చికాకులు. అనారోగ్య సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వ్యవహారాలు లో స్తబ్దత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో  మాటపట్టింపులు రాగలవు. ఉద్యోగాలు లో  అధికారులు తో కలహాలు.ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

పూ.భాద్ర నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.శుభవార్తలు వింటారు.వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగుతుంది.

దిన ఫలం:-బంధువర్గంతో విభేదాలు రాగలవు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ఇంటా బయటా ప్రతికూలత వాతావరణం.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు.ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి 1)
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి (జన్మతార)అధికారులుతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

రేవతి నక్షత్రం వారికి (పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

దిన ఫలం:-ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలు లో నూతనోత్సాహంతో పని చేస్తారు ఓం రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి..
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved