MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది

Today Horoscope: ఓ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల కారణంగా కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది.ప్రశాంతత తో పరిస్థితులు పరిష్కరించు కోవాలి.బంధువులు తో గొడవలు వచ్చే అవకాశం. 

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 01 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

1-4-2024, సోమవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)
 
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి (జన్మతార)(జన్మతారాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

భరణి నక్షత్రం వారికి  (పరమ మిత్ర తార)(పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

కృత్తిక నక్షత్రం వారికి (మిత్ర తార)(మిత్ర తారాధిపతి శుక్ర) విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

దినఫలం:-వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల కారణంగా కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది.ప్రశాంతత తో పరిస్థితులు పరిష్కరించు కోవాలి.బంధువులు తో గొడవలు వచ్చే అవకాశం.మానసికంగా బాధపడొచ్చు.వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం.ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి (నైధనతార)(నైధనతారాధి శని) తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

మృగశిర నక్షత్రం వారికి (సాధన తార)(సాధన తారాధిపతి చంద్రుడు) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

దినఫలం:-పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. వాగ్దానాలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.బద్ధకము అలసత్వం వల్ల వచ్చే అవకాశాలను చేజారుస్తారు.విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను.కష్టానికి తగిన ఫలితాలు పొందగలరు.కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు అనుకున్న పనులు ఏదో విధంగా కాస్త ప్రయాసత్వమైన సాధించుకోగలుగుతారు.ఓం శ్రీధరాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమతార)( క్షేమ తారాధిపతి గురువు) పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు

దినఫలం:-ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ధనధాన్యాది లాభం చేకూరును.ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును.కుటుంబ కార్యకలాపాలపై మీ దృష్టి పెడతారు.వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆత్మబలం పెరుగుతుంది.ఓం దత్తాత్రేయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి  ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార)(విపత్ తారాధిపతి రాహువు) వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి (సంపత్తార)(సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

దినఫలం:-సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు. శుభకార్య ప్రయత్నాలు చేయువారు శుభవార్తలు వింటారు.కొన్ని రోజులు గా వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు లో చురుగ్గా వ్యవహరిస్తారు.సమస్యలు పరిష్కారం అవడం వల్ల కుటుంబం వాతావరణం ఆనందంగా ఉంటుంది.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమస్యలు ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ  పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి (జన్మతార)(జన్మతారాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమ మిత్ర తార)(పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది.చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)(మిత్ర తారాధిపతి శుక్ర) విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

దినఫలం:-తలపెట్టిన కార్యాలలో సహనం సంయమనం పాటించడం అవసరం.భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది.స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ సామర్థ్యం తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వర్గాల వారికి వారి వారి స్థాయికి సంబంధించి ఉన్నత గౌరవం పొందగలరు.ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి (నైధనతార)(నైధనతారాధి శని) తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

చిత్త నక్షత్రం వారికి (సాధన తార)(సాధన తారాధిపతి చంద్రుడు) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

దినఫలం:-భార్యాభర్తల మధ్య సంబంధాలు బలపడతాయి.ఆరోగ్యం బాగుంటుంది.వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి.ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ సమర్థతను నిరూపించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ అమలు చేస్తారు. సంఘములో కీర్తి గౌరవం పెరుగుతాయి.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

విశాఖ  నక్షత్రం వారికి (క్షేమతార)( క్షేమ తారాధిపతి గురువు) పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు.ఆనందంగా గడుపుతారు

దినఫలం:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు గా సకాలంలో పూర్తవుతాయి.సమాజంలో పెద్ద వారి  సహాయ సహకారాలు లభిస్తాయి. 
వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అగును.విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు లో మంచి ఫలితాలు పొందుతారు. మానసిక శారీరక ఒత్తిడి లేకుండా ఆదాయం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.ఓం  నమః అని జపించండి శుభ రాజరాజేశ్వర్యై నమఃఫలితాలను పొందగలరు.

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి (విపత్తార)(విపత్ తారాధిపతి రాహువు) వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం వారికి (సంపత్తార) (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

దినఫలం:-వ్యవహారాల విషయంలో ఇతరుల సలహాలు సూచనలు పొందగలరు.రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఇష్టం లేని చోట ఉండడం అయిష్టత భోజనం చేయవలసి వస్తుంది.కొన్ని విషయాలు మానసిక ఉద్రేకాలకు దారితీయును. దురాలోచన అసూయ లకు దూరంగా ఉండాలి.ఓం రంగనాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ  ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రము వారికి (జన్మతార) (జన్మతారాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పూ.షాఢ నక్షత్రం వారికి(పరమ మిత్ర తార) (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకు పుట్టిస్తాయి. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

ఉ.షాఢ నక్షత్రం వారికి(మిత్ర తార) (మిత్ర తారాధిపతి శుక్రుడు) విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

దినఫలం:-ఉద్యోగాలలో  అధికారుల ద్వారా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు చికాకులు గా ఉంటుంది.కుటుంబ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్య ప్రయత్నాలలో అవాంతరాలు ఏర్పడతాయి.నూతన వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఇతరుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది.ఓం అర్కాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం  ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణం నక్షత్రం వారికి (నైధనతార)(నైధనతారాధి శని) తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులుతో నూతన సమస్యలు రాగలవు.

ధనిష్ఠ నక్షత్రం వారికి(సాధన తార ) (సాధన తారాధిపతి చంద్రుడు) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

దినఫలం:-రుణాల విషయంలో జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి గాక వల్ల ఇబ్బందులు పడతారు. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.అవసరానికి ధనం ఏదో విధంగా సర్దుబాటు జరుగుతుంది.ఆరోగ్య ప్రతిబంధకాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.వ్యవహారములో ఆటంకాలు ఏర్పడును.బంధుమిత్రులతో కలహాలు రాగలవు.ఓం భువనేశ్వర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి(ప్రత్యక్తార) (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

పూ.భాద్ర నక్షత్రం వారికి(క్షేమతార)( క్షేమ తారాధిపతి గురువు) పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు.ఆనందంగా గడుపుతారు

దినఫలం:-కుటుంబ సభ్యులు తో సమస్యలు ఎదురవగలవు.ఉద్యోగాలలో సహోద్యోగులు వల్ల ఇబ్బందులకు గురి అవుతారు.ఇతరులతో కలహాలకు వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భార్య భర్తల మధ్య గొడవలు రావొచ్చు. సమాజంలో ఏది మాట్లాడిన ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర  రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (విపత్తార) (విపత్ తారాధిపతి రాహువు) వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం తరంగ ఉంటుంది.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

రేవతి నక్షత్రం వారికి (సంపత్తార) (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

దినఫలం:-ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.  అభివృద్ధి ప్రయత్నాలలో తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన  ప్రతిఫలం లభిస్తుంది.దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు.ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved