MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆదాయం తో సమానంగా ఖర్చులు పెరుగుతాయి

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆదాయం తో సమానంగా ఖర్చులు పెరుగుతాయి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి ఈ రోజు  సమాజము నందు మీ ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. అధికారుల ఆదర అభిమానం పొందుతారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 03 2023, 04:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

3-11- 2023,  శుక్రవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :  3    నవంబర్ 2023
శోభకృత్  సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణపక్షం
శుక్రవారం
తిథి:- షష్టి రాత్రి 12.09 ని॥వరకు
నక్షత్రం:- ఆరుద్ర ఉ॥8.01 ని॥వరకు
యోగం:- సిద్ధము మ॥3.41 ని॥వరకు
కరణం:- గరజి ఉ॥11.42 వణిజి రాత్రి 12.09 ని॥వరకు
అమృత ఘడియలు:-
దుర్ముహూర్తం:-ఉ.08:19ని॥ల ఉ.09:5 ని॥వరకు  తిరిగి మ.12:07ని॥ల మ.12.52 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.51 ని॥ల 10.33 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:03 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.26ని॥ లకు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (నైధనతార)
భరణి నక్షత్రం వారికి (సాధన తార)
కృత్తిక నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ప్రతికూలత వాతావరణం . పనుల్లో ప్రతిబంధకాలు.సమస్యల వలన మనస్సునందు చికాకుగా ఉంటుంది.  జీవిత భాగస్వామి తో సఖ్యత గా ఉండాలి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతో సంభాషణలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
రోహిణి నక్షత్రం వారికి  (క్షేమ తార)
మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. అధికారుల ఆదర అభిమానం పొందుతారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. ఆకస్మిక ధన లాభం కలుగును.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (విపత్తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)
పునర్వసు నక్షత్రం వారికి (జన్మతార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో పెద్ద వారి సహాయసహకారాలు అందుకుంటారు. కుటుంబ వృద్ధి కొరకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను సామరస్యంగా పరిష్కరించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగవలెను. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు .ఆదాయం తో సమానంగా ఖర్చులు పెరుగుతాయి
వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (జన్మ తార)
పుష్యమి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి కాగలవు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు లభించును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు .ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.మనస్సు నందు ఆందోళన గా ఉంటుంది.గృహము లో చికాకులు. బంధు మిత్రులతో అకారణ కలహాలు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (నైధనతార)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (ప్రత్యక్తార)

దిన ఫలం:-శుభకార్యాలు జరుగును.సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారం నందు నూతన ఉత్తేజం తోటి ముందుకు . ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రావలసిన బాకీలు ఆటంకాలు ఏర్పడిన చివరకు వసూలు అవుతాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎటువంటి నూతన కార్యక్రమాలు తలపెట్టిన  విజయవంతం అగును. సమస్యలు తీరి జీవితం సౌఖ్యంగా గడుస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
హస్త నక్షత్రం వారికి (క్షేమ తార)
చిత్త నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-సంఘంలో సమయానుకూలంగా వ్యవహరించాలి.ఆకస్మిక ప్రయాణాలు .ఉద్యోగాలు నందు చికాకులు.అధిక శ్రమ.ఆర్థిక ఇబ్బందులు.అకారణంగా కోపం.మనస్సు నందు ఆందోళన.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.శారీరకముగా ఒత్తిడి ఆటుపోట్లు కలుగును. ప్రతి పనిలోనూ ఆలోచించి నిదానించి నిర్ణయం తీసుకొనవలెను. ఆదాయానికి మించి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (విపత్తార)
స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)
విశాఖ నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గును.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మనసునందు ఆందోళనగా ఉంటుంది. గృహము నందు ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతో మనస్పర్థలు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (జన్మ తార)
అనూరాధ నక్షత్రం వారికి (పరమైత్ర తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (మిత్ర తార)


దిన ఫలం:-అనుకోకుండా జరిగిన సంఘటనలు  లాభిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  కుటుంబంలో వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి.చేతి వృత్తి వారికి విశేష ఆదరణ పొందగలరు . స్థిరాస్తి వృద్ధి చేయు ప్రణాళికలు కలిసి వస్తాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (నైధనతార)
పూ.షాడ  నక్షత్రం వారికి (సాధన తార)
ఉ.షాడ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)

దిన ఫలం:-ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ అభిమానం పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి . జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమాజంలో  గుర్తింపు పొందుతారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉండును.శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.కుటుంబ వృద్ధి కలుగుతుంది. దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.


 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
తారాబలం
ఉ.షాడ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
శ్రవణం నక్షత్రం వారికి (క్షేమ తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘములో నిందారోపణలు రాగలవు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించ వలెను.పనులు లో శారీరక శ్రమ పెరుగుతుంది. రావలసిన బాకీలు లో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయవలెను. సంతానం మరియు  సోదరి వర్గం తో మనస్పర్థలు రాగలవు. వృత్తి వ్యాపారాలలో  ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండును.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (విపత్తార)
శతభిషం నక్షత్రం వారికి  (సంపత్తార)
పూ.భాద్ర నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. సమాజంలో పెద్దల ఆదరణ అభిమానం పొందగలరు. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన వార్త వింటారు.ఆదాయ మార్గాలు అనుకోకుండా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
       

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి  (జన్మ తార)
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (పరమైత్ర తార)
రేవతి నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-ఆర్థికంగా బలంగా ఉన్న రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి . అనవసరమైన సంభాషణ ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు రాగలవు. బంధువర్గంతో విమర్శలు రావచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image3
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved