MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి కొత్త డీల్స్ లో ఈరోజు మంచి లాభాలొస్తాయి

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి కొత్త డీల్స్ లో ఈరోజు మంచి లాభాలొస్తాయి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు, చేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

9 Min read
Author : ramya Sridhar
Published : Jun 03 2023, 04:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

03  జూన్   2023 శని వారం  మీ  రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:                                                                                                                                                                       
తేది :   3 జాన్   2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :  శుక్ల పక్షం 
వారము:శనివారం
తిధి: చతుర్దశి ఉ॥10.16 ని.వరకు
నక్షత్రం :- అనూరాధ  తె.5.10 ని.వరకు
యోగం:- శివము మధ్యాహ్నం 2.43 ని.వరకు
కరణం:- వణిజి ఉ॥10.16 భద్ర(విష్టి) రాత్రి 9.43 ని.వరకు
అమృత ఘడియలు:- సాయంత్రం 6.56 ని.ల7.11 ని.వరకు
దుర్ముహూర్తం: ఉ.05:28ని.ల ఉ.7:15 ని వరకు
వర్జ్యం:- ఉ॥9.30 ని.ల 11.05 ని.వరకు
రాహుకాలం: ఉ.9:00ని. నుండి ఉ.10:30ని. వరకు
యమగండం: మ.01:30ని నుండి మ.3:00ని. వరకు
సూర్యోదయం :        5.28  ని॥లకు
సూర్యాస్తమయం:    6.27  ని॥లకు

ఈరోజు దినఫలం  తారాబలం. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితము చూసుకొని వ్యవహరించండి.  శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దిన ఫలం:-వాయిదా పడిన పనులు పూర్తి అగును. సంతానం వలన శుభవార్త వింటారు. నూతన ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది. ప్రభుత్వ సంబంధ కార్యములు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఈశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)
భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-  
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దిన ఫలం:-ముఖ్యమైన పనులలో ఆటంకాలు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండును. అనవసరమైన ఖర్చులు.కుటుంబ సభ్యులతో చికాకులు. అనారోగ్య సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉండును. వ్యవహారాలు మందగించును.బంధుమిత్రులతో  మాటపట్టింపులు రాగలవు. ఉద్యోగం నందు అధికారులతోటి కలహాలు. ఈరోజు ఈ రాశి వారు ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): - వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)


దిన ఫలం:-ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతో  సమస్యలు ఏర్పడగలవు . ఇతరులతో మాట్లాడేటప్పుడు  జాగ్రత్తగా మాట్లాడాలి . కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు .కుటుంబసమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. చేయు పనులలోశ్రమ అధికంగా ఉండును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)


దిన ఫలం:-గృహ సంబంధిత అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులు తో  ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు  గూర్చి  ఆలోచనలు చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రయాణం నందు విలువైన వస్తువులపై  శ్రద్ధ వహించాలి. ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. పాత మిత్రుల తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-  కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దిన ఫలం:-బంధువర్గంతో విభేదాలు రాగలవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ప్రతి కూలత వాతావరణం. ఉద్యోగమనందు అధికారుల ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు యందు ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. అనవసరమైన ఖర్చులు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దిన ఫలం:-ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదర అభిమానములు పొందగలరు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును. నూతన విధానాలను ప్రారంభిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదం
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దిన ఫలం:-ఆర్థిక లాభ లాభాలు పొందగలరు. నూతన కార్యాలులకు శ్రీకారం చేస్తారు. ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులతోటి ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఉపాధి మార్గాలు లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా జరుగును, ఉద్యోగాలలో అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదమ
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దిన ఫలం:-ఇతరులతోటి వాదోపవాదములకు దూరముగా ఉండవలెను.ముఖ్యమైన పనుల యందుఅనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారమును అనుకూలించును. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ నరసింహ స్వామినే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దిన ఫలం:-ఆర్థికంగా అనుకూలంగా ఉండును.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. మనస్సునందు ప్రశాంతంగా ఉండును.ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. సంఘము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగం నందు నూతనోత్సాహంతో చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఓం రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి . ఉద్యోగం అనుకూలంగా ఉండును. శుభవార్తలు వింటారు.పరిస్థితులు అనుకూలంగా ఉండును. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-. కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదం

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దిన ఫలం:-అధిక ఖర్చులు చేయవలసి వస్తుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలదు .నూతన పరిచయాలు ఏర్పడతాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగం నందు అధికారుల ఆగ్రహానికి గురి అవ్వచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

దిన ఫలం:-దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  కీలకమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.  ఉత్సాహంగా ఉంటారు. మన వాంఛలు నెరవేరును. ఉద్యోగమునందు అధికారుల అనుగ్రహం పొందగలరు. ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం సుదర్శనాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(16.4 ov)84/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved