MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్థిక సమస్యలు రాగలవు.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్థిక సమస్యలు రాగలవు.

ఈ రోజు రాశిఫలాలు   ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈరోజు ఆర్థిక సమస్యలు రాగలవు.ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. 

8 Min read
Author : ramya Sridhar
Published : Oct 28 2023, 05:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 08

daily horoscope 2023 New 08

28, అక్టోబర్  2023,  శని వారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం      
(పాక్షిక చంద్రగ్రహణం
స్పర్శ రాత్రి 1.05 ని॥
మోక్షకాలం రాత్రి 2.22 ని॥)
తేది :  28  అక్టోబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :- ఆశ్వయుజ మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                         
వారము:శనివారం
తిథి :- పూర్ణిమ రాత్రి 1.58 ని॥వరకు
నక్షత్రం :-  రేవతి ఉ॥7.57 ని॥వరకు
యోగం:- వజ్రం రాత్రి 12.35 ని॥వరకు
కరణం:- విష్టి(భద్ర) ప॥2.51 బవ రాత్రి 1.58 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 12.00 ని॥ల 1.32 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.06:00 ని॥ల ఉ.7:31 ని॥వరకు
వర్జ్యం:-తె.3.03 ని॥ల 4.35 ని॥వరకు
రాహుకాలం:- ఉ.9:00 ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :-    6.00ని॥లకు
సూర్యాస్తమయం:- 5.28ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను.అవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను.ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.

భరణి నక్షత్రం వారికి (పరమైత్రతార)తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. వాహన ప్రయాణాలను జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగును.

కృత్తిక నక్షత్రం వారికి ఈవారం (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-తల పట్టిన పనులు ఆలస్యముగా జరుగును. మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. వ్యాపారములలో ధన నష్టము రాగలదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.గృహోపకరణాలు నిమిత్తం ఖర్చు చేస్తారు.  ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగును. ఆర్థిక సమస్యలు రాగలవు.ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్రతార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలాసవంతమైన ఖర్చులు చేస్తారు.

రోహిణి నక్షత్రం వారికి (నైదనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను.శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-చేయు పనులలో శారీరక శ్రమ పెరుగును. మానసికంగా భయాందోళన ఉండవచ్చు. కుటుంబ సమస్యలు రావచ్చు. వాగ్వివిదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో  అధికారుల యొక్క ఒత్తిడి పెరుగును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును. పనులలో ఆటంకములు ఏర్పడగలవు.కుటుంబ వ్యవహారాలు చికాకుగా ఉంటుంది.ఈ రోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి(సాధన తార) తలచిన కార్యాలు పూర్తి అగును.శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందుఅపవాదములు ఎదురవగలవు.అధికారులతోటి వివాదాలు ఏర్పడను.

పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల ప్రశంసలు పొందగలరు

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థికంగా లాభాలు పొందగలరు. ప్రయాణములు అనుకూలించును.చేయు పనులులో విజయము సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అనుకూలం. కుటుంబ సౌఖ్యం లభించును.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారులయొక్క ప్రశంసలు పొందగలరు.

పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార) అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

ఆశ్రేష నక్షత్రం వారికి  (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారము నందు ధన లాభం కలుగును.శుభవార్తల వింటారు.

దిన ఫలం:-శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. గొడవలకు వాగ్వివివాదములకు దూరంగా ఉండవలెను. ఆరోగ్య విషయములో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం నందు అధికారుల తో సమస్యలు రాగలవు.  చేయు పని యందు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆర్థిక వ్యవహారములలో జాగ్రత్త అవసరం.వృత్తి  వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను.ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.మానసిక భయాందోళన.

పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్రతార) ధనాధాయ మార్గాల గూర్చి ఆలోచనల చేస్తారు.తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (మిత్రతార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉన్నతాధికారుల నుంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వస్తువులు కొనుగోలు చేస్తారు.

హస్త నక్షత్రం వారికి  (నైదనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను.శ్రమ అధికంగా ఉండును. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి  (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-ఉద్యోగంలో  అధికారుల నుంచి గౌరవం లభిస్తుంది.తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. చేయు వ్యవహారాలు సజావుగా సాగును.శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.గృహము నందు సుఖశాంతులు లభిస్తాయి.సమాజములో కీర్తి ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ధాన్య లక్ష్మీయై  నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

స్వాతి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందు అపవాదములు ఎదురవగలవు.అధికారుల తోటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజము లో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారము లాభసాటిగా  సాగును.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తి అగును.  శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఈరోజు ఈరాశి వారు ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (క్షేమతార) వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల యొక్క ఆదరణ పొందగలరు.


అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార) అనుకోని కలహాలు ఏర్పడగలవు.పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.నూతన సమస్యలు ఎదురవగలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

జ్యేష్ట నక్షత్రము వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఆదాయం మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజము నందు ఉన్నతమైన వ్యక్తుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది.ప్రతి చిన్నవిషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమః శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

పూ.షా  నక్షత్రం వారికి  (పరమైత్రతార)ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.షా నక్షత్రము వారికి (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యం అనుకూలించును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. కుటుంబం లో ఆనందకరమైన వాతావరణం. సమాజము లో గౌరవ ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాదాయ విషయంలో లోటు ఉండదు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

శ్రవణం నక్షత్రము వారికి (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రము వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-కుటుంబము లో  చికాకులు గా ఉండును.ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. చేయు పనులలో  శ్రమ అధికముగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉండును. గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరకంగా మానసికంగా బలహీనముగా నుండును. ఈ రాశి వారు ఈరోజు ఓం నమః శ్శివాయ అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందు అపవాదములు ఎదురవగలవు.అధికారులతోటి వివాదాలు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల మన్ననలు పొందగలరు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగును.కుటుంబ వ్యవహారాలలో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయములు రాగలవు. చేయు పనులలో అసహనం నిరుత్సాహం ఏర్పడను. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈరాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల మన్ననలు పొందగలరు.

ఉ.భా  నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవగలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

రేవతి నక్షత్రం  వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును.శుభవార్తల వింటారు.

దిన ఫలం:-చేయు పనులు అనుకూలం గా ఉండును. ఉద్యోగాలలో అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును.ఆవేశపూరిత నిర్ణయాలకు  పట్టుదలకు దూరంగా ఉండాలి. ఆర్ధికపరంగా లాభము కలుగును. కుటుంబము నందు అనుకూలమైన వాతావరణం. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved