MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఒక శుభవార్త వింటారు

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఒక శుభవార్త వింటారు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు.

5 Min read
Author : ramya Sridhar
Published : Nov 26 2022, 04:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Horoscope

Horoscope

పంచాంగం      
 తేది : 26నవంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిర
ఋతువు : హేమంత
పక్షం :  శుక్లపక్షము                                                                                          
వారము: శనివారం
తిథి : తదియ రాత్రి 10.50 వరకు
నక్షత్రం :.  మూల సా 6.39 వరకు
వర్జ్యం:సా. 5.09 ల6.39 వరకు తిరిగి తె 3.36 ల 5.05 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.14 ని నుండి ఉ.7. 42 ని వరకు
రాహుకాలం: ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.3.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.1 4ని.లకు
సూర్యాస్తమయం: సా.05.20ని.లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి  పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను.  కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. కీలకమైన సమస్యలను బుద్ధి బలంతోటి పరిష్కరిస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి.  శివపార్వతులను పూజించడం మంచిది.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది . వ్యాపారంలో లాభాలు ఉంటాయి . ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. స్వల్ప ధన లాభం. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. రవి ధ్యానం మేలు చేస్తుంది.

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును.శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. విష్ణు ఆరాధన శుభప్రదం.

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు.అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధు మిత్రులతో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి.  కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం.   ఇష్టదేవతా శ్లోకం చదవాలి.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి.మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం శుభకరం.
 

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు.నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు.   లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీ ప్రతిభకు  ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సూర్య ఆరాధన శుభప్రదం.

1114
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు.

1214
Zodiac Sign

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం.
 సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. . మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. సూర్య నమస్కారం వల్ల శుభఫలితాలు ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved